Unlucky zodiac signs: 2025 లో మూడు కీలక గ్రహాల సంచారం- ఈ రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తప్పవు
Unlucky zodiac signs: 2025 కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంటే మరికొందరికి మాత్రం సమస్యలు, కష్టాలు చుట్టుముట్టబోతున్నాయి. మూడు కీలక గ్రహాల సంచార ప్రభావం నాలుగు రాశుల మీద ఉండబోతుంది. దీని వల్ల ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాబోతున్నాయి. అవి ఏ రాశులో చూసేయండి.
మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు పాత సంవత్సరంతోనే ముగిసిపోవాలని కొత్త ఏడాది సరికొత్తగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. అలాగే గ్రహాలు కూడా సమయానుకూలంగా తమ రాశులను మార్చుకుంటూ ఉంటాయి.
నవగ్రహాలలో రెండు కీలక గ్రహాలు కొత్త సంవత్సరం కొన్ని రాశుల వారికి కష్టాలను ఇచ్చేందుకు రెడీ అయిపోతున్నాయి. వీటి ప్రభావం వల్ల 2025 ప్రారంభంలో కొన్ని నెలలు ఆరోగ్య, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొత్త ఏడాది బృహస్పతి తిరోగమనం, శని రాశి మార్పు, కుజుడి తిరోగమన ప్రభావం నాలుగు రాశుల మీద అధికంగా ఉండబోతుంది.
బృహస్పతి తిరోగమనం
ప్రస్తుతం బృహస్పతి తిరోగమన దశలో సంచరిస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఇలాగే ఉంటాడు. జాతకంలో బృహస్పతి బలంగా ఉంటే సుఖ సంతోషాలు, కీర్తి, సౌభాగ్యం, అదృష్టం, ఐశ్వర్యం లభిస్తాయి. అదే బలహీన స్థితిలో ఉంటే వైవాహిక జీవితంలో సమస్యలు, గొడవలు, దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడతాయి. జాతకంలో గురు తిరోగమన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సమస్యలు అధికంగా ఉంటాయి. ఇటువంటి పరిస్థితిలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.
కుజుడి తిరోగమనం
కర్కాటక రాశిలో సంచరిస్తున్న కుజుడు జనవరి 21 వరకు ఇదే రాశిలో ఉంటాడు. తర్వాత తిరోగమన దశలోకి వెళ్ళి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మళ్ళీ ఏప్రిల్ 3 నుంచి కర్కాటక రాశిలోకి వస్తాడు. జూన్ వరకు ఇదే రాశిలో ఉంటాడు. గ్రహాలు తిరోగమనంలో ఉన్నప్పుడు కొన్ని అశుభ, శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఇది కొందరికి హానికరమైన పరిస్థితులను కలిగిస్తుంది.
మీన రాశిలోకి శని
శని ప్రస్తుతం తన సొంత రాశి కుంభ రాశిలో సంచరిస్తోంది. మార్చి నుంచి శని మీన రాశిలోకి వెళ్తుంది. ఈ రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. దీని వల్ల ఏలినాటి శని, అర్థాష్టమ శని ప్రభావం ఎదుర్కొనే రాశులు కూడా మారతాయి. సింహం, ధనుస్సు రాశుల మీద అర్థాష్టమ శని ప్రారంభంఅవుతుంది. అలాగే కొత్త ఏడాది మేష రాశి వారికి ఏలినాటి శని తగులుకుంటుంది. ఇది ఏడున్నర సంవత్సరాలు మూడు దశలలో ఉంటుంది. మేష రాశి వారికి తొలి దశ, మీన రాశి వారికి రెండో దశ, కుంభ రాశి వారి మీద మూడో దశ ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. మకర రాశి వారికి ఏలినాటి శని నుంచి కొత్త సంవత్సరంలో విముక్తి కలుగుతుంది.
ఈ రాశుల వాళ్ళు జాగ్రత్త
జ్యోతిష్య నిపుణులు చెప్పే దాని ప్రకారం ఈ రాశుల ప్రభావం వృషభం, సింహం, వృశ్చికం, మీన రాశుల వారికి అశుభ ఫలితాలు అందిస్తుంది. వీరికి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు వస్తాయి. డబ్బు చేజారుతుంది. సమాజంలో గౌరవం దెబ్బతినే అవకాశం ఉంది. ప్రమాదాలు సంభవించే అవకాశం కూడా ఉంది. అందుకే వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.