Kaal Bhairav Jayanthi: రేపే కాలాష్టమి- కష్టాలు తొలగించుకోవాలంటే ఏ పనులు చేయాలి, శివుడిని ఎలా పూజించాలి తెలుసుకొండి
Kaal Bhairav Jayanthi: పరమ శివుడు కాల భైరవుడిగా అవతారమెత్తిన రోజును కాల భైరవ అష్టమి లేదా కాల బైరవ జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజు శివుడిని ఆరాధించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని, భయం, చెడు, ప్రతికూల శక్తి నశిస్తాయని భక్తుల నమ్మిక.
పరమశివునడు అత్యంత భీకరుడు, రక్షకుడుగా చెప్పుకునే కాలభైరవుని అవతారమెత్తిన రోజును కాలాష్టమి లేదా కాలభైరవ జయంతిగా చెబుతారు. కాల భైరవుడు అంటే కాలనాకి రాజు అని, మరణానికి దేవుడని శివ పురాణం చెబుతోంది. అందుకే ఈ రోజు శివుడు ఆరాధనకు అంకితం చేయబడింది. ప్రతి సంవత్సరం మార్గశిర్ష మాసంలో కృష్ణ పక్షం ఎనిమిదవ రోజున కాలాష్టమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున కాశీ రక్షకుడైన కాలభైరవుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మనలోని భయం, చెడు వంటి ప్రతికూల శక్తులు నాశనం అవుతాయట. ఈరోజు శివుడిని ఎలా పూజించాలి.కష్టాలన్నీ తొలగిపోతాయేందుకు ఎలాంటి పరిహారాలు పాటించాలి తెలుసుకొండి.
కాలభైరవ జయంతి:
పంచాంగం ప్రకారం మార్గశిర్ష మాసం శుక్లపక్షం అష్టమి తిథి నవంబర్ 22 సాయంత్రం 6:07 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది 2024 నవంబర్ 23 రాత్రి 7:56 గంటలకు ముగుస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం నవంబర్ 22వ తేదీ శుక్రవారం కాలభైరవుడిని పూజించడం శుభప్రదం.
శివుడు, కాలభైరవుడిని ఎలా పూజించాలి?
పూజ చేయాల్సిన పద్ధతి:
* ఉదయాన్నే లేచి పవిత్ర స్నానం చేయడం.
* ఉపవాస దీక్షను చేపట్టి రోజంతా మహిమాన్వితమైన "హ్రీం ఉన్మత్ భైరవాయ నమ:" అనే మంత్రాన్ని జపించడం.
* ఇంటిని, ముఖ్యంగా పూజా గదిని శుభ్రం చేయడం.
* పూజ గదిలో కాల భైరవ విగ్రహాన్ని లేదా కాల భైరవ యంత్రాన్ని ఉంచాలి.
* ఆవాల నూనెతో దీపం వెలిగించి, దండ, స్వీట్లు పెట్టాలి.
* కాల భైరవ అష్టకం పఠిస్తూ ప్రార్థనలు చేస్తారు.
* ఆ తర్వాత నలు దిక్కులా ఆవాల నూనెతో నాలుగు వైపులా దీపం వెలిగించాలి.
* కాల భైరవుడికి మద్యాన్ని, పాలను సమర్పిస్తారు.
* సాయంత్రం వేళల్లో నాలుగు వైపులా దీపాలు వెలిగించి అర్ధరాత్రి వరకూ పూజా కార్యక్రమం నిర్వహిస్తారు.
* ఉదయం నుంచి కఠిక ఉపవాసం నిర్వహించి ఉపవాస విరమణ తర్వాత నల్ల కుక్కకు తియ్యటి రోటీలు తినిపించడం వల్ల అదనపు ప్రయోజనాలు అందుతాయని విశ్వసిస్తారు.
ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు:
కాల బైరవుని ఆరాధించడం వల్ల శారీరకంగా, మానసికంగా సుదీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు, జబ్బుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
చేతబడులు, దుష్ట శక్తులు నుంచి బయటపడటానికి కాలభైరవుడు సాయం చేస్తాడని నమ్ముతారు.
కాలాష్టమి రోజు భైరవుడిని పూజించడం వల్ల శత్రువులపై విజయం లభిస్తుంది.
మానసిక ప్రశాంతత, ఆనందం లభిస్తాయి.
ఏ పనులు చేస్తే కష్టాలు తొలగిపోతాయి:
కాలాష్టమి రోజు శివుడికి చందనం సమర్పించాలి.
కాలష్టమి రోజు నెయ్యి దీపం వెలిగించాలి.
తమలపాకులు, పండ్లు, పాయసం వంటివి కాలభైరవుడికి సమర్పించాలి.
కాలాష్టమి రోజున కాలభైరవుడికే కాకుండా శమీ వృక్షాన్ని దర్శించి శమీ వృక్షానికి నీరు సమర్పించాలి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్