Vastu Tips for Relationships: చీటికీ మాటీకీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా- ఈ వాస్తు చిట్కాలను ఒకసారి ప్రయత్నించి చూడండి
Vastu Tips for Relationships: ఇంట్లో చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయా. ఎన్ని సార్లు సర్దుకుపోయినా మళ్లీ మళ్లీ ఇదే పరిస్థితి నెలకొంటుందా. అయితే ఈ వాస్తు చిట్కాలు మీకు ఉపయోగపడతాయి.
చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు ప్రతి ఇంట్లో సహజంగా ఉండేవో. ఎవరో ఒకరు శాంతంగా వ్యవహరిస్తే అవి తగ్గుముఖం పడతాయి. ఎంత శాంతంగా వ్యవహరించినా ఎలాంటి పొరపాట్లు జరగకున్న చీటికీ మాటీకి ఇంట్లో గొడవలు జరుగుతన్నాయంటే కొన్ని సార్లు దోషం ఇంట్లోని వ్యక్తులది కాకపోయి ఉండచ్చు. అవును ఇంటికి సంబంధించిన వాస్తు దోషాల కారణంగా కూడా ఇంట్లో తరచూ పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. ఇంట్లో వాస్తు సరిగ్గా లేనప్పుడు ప్రతికూల శక్తుల ప్రభావం ఇంటి సభ్యుల మధ్య వివాదాలు, గొడవలకు దారితీస్తాయి. ఎప్పుడూ అశాంతి వాతావరణం నెలకొంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ ఎవరో ఒకరు ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితే మీ ఇంట్లో కూడా ఉందా. అయితే మీరు కొన్ని వాస్తు చిట్కాలను పాటించి చూడండి. ఇవి ఇంట్లో సానుకూల శక్తిని పెంచడంతో పాటు సంతోషాన్ని, శాంతిని పెంపొందించేందుకు మీకు సహాయపడతాయి. ఆ వాస్తు చిట్కాలేంటో తెలుసుకుందాం.
ఇంట్లో గొడవలను తగ్గించే వాస్తు చిట్కాలు:
ఇంటి ఈశాన్య మూల:
వాస్తు ప్రకారం ఈశాన్య దిశ అంటే ఈశాన్య కోణం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఇంటి ఈశాన్య మూలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. అలాగే ఈ మూలలో ఎప్పుడు చీకటి ఉండకూడదు. ప్రకాశవంతంగా ఉండాలి. ఇంటి ఈశాన్య మూల శుభ్రంగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం పెరుగుతుంది. ఇది ఇంట్లో శాంతి, సంతోషం, శ్రేయస్సులను పెంపొందిస్తుంది.
బుద్ధుని విగ్రహం:
ఇంట్లో కలహాలు, బాధల వాతావరణాన్ని తగ్గించడానికి బుద్ధుడి విగ్రహాన్ని ఉంచండి. వాస్తు శాస్త్రం ప్రకారం.. బుద్ధుడి విగ్రహాన్ని లివింగ్ ఏరియా లేదా బాల్కనీలో ఉంచవచ్చు. బుద్ధుడి విగ్రహాం ఇంట్లో గొడవలు, చికాకులను తగ్గించి శాంతి వాతావరణాన్ని పెంపొందిస్తుంది.
రాతి ఉప్పు:
రాతి ఉప్పును ఉపయోగించడం ద్వారా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంపొందిచవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం, రాతి ఉప్పు ప్రతికూల శక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి మీ ఇల్లు లేదా గదిలోని అన్ని మూలలలో రాతి ఉప్పును వేసి ఉంచండి. నెలకు ఒకసారి ఉప్పును మార్చుతూ ఇంటిని శుభ్రం చేయాలి. ఉప్పు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీలన్నింటినీ గ్రహించి పాజిటివ్ ఎనర్జీని పెంపొందిస్తుంది. ఫలితంగా ఇంట్లో గొడవలు తగ్గి శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. నరదిష్టి వంటి ప్రతికూల శక్తుల నుంచి మిమ్మల్ని కాపాడేందుకు కూడా రాతి ఉప్పు మీకు చాలా బాాగా సహాయపడుతుంది.
దిశలు గుర్తుంచుకోండి:
వాస్తు దోషం కారణంగా చాలాసార్లు, ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. గొడవలు, చికాకులు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యానికి ఇవి కారణమవుతాయి. కనుక ఇంటి నిర్మాణ సమయంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఉంది. ఇంటి ఈశాన్య మూలలో ఎప్పుడూ మరుగుదొడ్డి నిర్మించుకోవద్దని గుర్తుంచుకోండి. ఆగ్నేయ దిశలో వంటగది ఉండటం శుభప్రదంగా భావిస్తారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్