Thandel Bujji Thalli Song Lyrics: తండేల్ బుజ్జి తల్లి సాంగ్ లిరిక్స్ ఇవే.. మనసుకు హత్తుకునే మెలోడీ సాంగ్ విన్నారా?
Thandel Bujji Thalli Song Lyrics: తండేల్ మూవీ నుంచి బుజ్జి తల్లి అనే మనసుకు హత్తుకునే ఓ మెలోడియస్ సాంగ్ గురువారం (నవంబర్ 21) రిలీజైంది. సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ఉన్న బంధాన్ని చాటేలా సాగే ఈ పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.
Thandel Bujji Thalli Song Lyrics: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న మూవీ తండేల్. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా బుజ్జి తల్లి అంటూ సాగిపోయే లిరికల్ వీడియో రిలీజైంది. గురువారం (నవంబర్ 21) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మెలోడీ సాంగ్ ఇన్‌స్టాంట్ హిట్ అయింది.
మనసుకు హత్తుకునే మెలోడీ
తండేల్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. తన కెరీర్లో ఎన్నో హిట్ మెలోడీ సాంగ్స్ అందించిన అతడు.. తాజాగా ఈ తండేల్ మూవీలో కూడా బుజ్జి తల్లి అంటూ సాగిపోయే ఈ పాటను క్రియేట్ చేశాడు.
నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య మూవీలో సాగే ఎమోషనల్ జర్నీని కళ్లకు కట్టేలా ఈ పాట సాగిపోయింది. ప్రియురాలికి దూరమైన ప్రియుడు విరహ వేదనతోపాటు ఆమెకు బుజ్జగించేలా సాగిపోయే అద్భుతమైన పాట ఇది.
చాలా కాలం పాటు మెలోడీ లవర్స్ మనసుల్లో నిలిచేపోయే పాటను దేవిశ్రీ ప్రసాద్ అందించాడని చెప్పొచ్చు. లిరికల్ వీడియోలో చైతూ, పల్లవి మధ్య బంధాన్ని కళ్లకు కట్టేలా ఈ పాటను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
సముద్రం సాక్షిగా ఓ యదార్థ ప్రేమకథ అంటూ ఈ వీడియో ప్రారంభమైంది. శ్రీమణి ఈ పాటకు లిరిక్స్ అందించగా.. బాలీవుడ్ సింగర్ జావెద్ అలీ పాడాడు. పుష్ప మూవీలో హిందీ వెర్షన్ శ్రీవల్లి పాట పాడింది ఇతడే. మరి అలాంటి పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.
బుజ్జి తల్లి సాంగ్ లిరిక్స్
గాలిలో ఊగిసలాడే దీపంలా..
ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం..
నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా..
చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం..
సుడిగాలిలో పడిపడి లేచే..
పడవల్లే తడబడుతున్నా..
నీకోసం.. వేచుందే.. నా ప్రాణం..
ఓ బుజ్జితల్లీ.. నా కోసం.. ఓ మాటైనా మాటాడే..
నా బుజ్జితల్లీ...
నీరు లేని చేపల్లే..
తార లేని నింగల్లే..
జీవమేది నాలోనా..
నువ్వు మాటలాడందే..
మళ్లీ యాలకొస్తానే..
కాళ్లయేళ్ల పడతానే..
లెంపలేసుకుంటానే..
ఇంక నిన్ను యిడిపోనే..
ఉప్పు నీటి ముప్పుని కూడా..
గొప్పగ దాటే గట్టోన్నే..
నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే..
నీకోసం.. వేచుందే.. నా ప్రాణం..
ఓ బుజ్జితల్లీ.. నా కోసం.. ఓ మాటైనా మాటాడే..
నా బుజ్జితల్లీ...
ఇన్నినాళ్ల మన దూరం..
తియ్యనైన ఓ విరహం..
చేదులాగా మారిందే..
అందిరాక నీ గారం..
దేన్ని కానుకియ్యాలే..
ఎంత బుజ్జగించాలే..
బెట్టు నువ్వు దించేలా..
లంచమేటి కావాలే..
గాలివాన జాడే లేదే..
రవ్వంతైనా నా చుట్టూ..
అయినా మునిగిపోతున్నానే..
దారే చూపెట్టు..
నీకోసం.. వేచుందే.. నా ప్రాణం..
ఓ బుజ్జితల్లీ.. నా కోసం.. ఓ మాటైనా మాటాడే..
నా బుజ్జితల్లీ...