Bachelor Party OTT: ఓటీటీలోకి సడెన్‌గా సూపర్ హిట్ కన్నడ కామెడీ మూవీ.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bachelor Party OTT Streaming Date: ఇతర ఇండస్ట్రీలోని సూపర్ హిట్ సినిమాలను సైతం అన్ని భాషల్లో అనువదించి స్ట్రీమింగ్ చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అలా తాజాగా కన్నడ సూపర్ హిట్ కామెడీ మూవీ బ్యాచిలర్ పోర్టీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Bachelor Party OTT Release Date: ఓటీటీలు వచ్చాక ఇతర భాషల్లోని మంచి కంటెంట్ సినిమాలకు ప్రతి ఒక్కరు చూడగలుగుతున్నారు. దీంతో ఓటీటీల హవా మరింత పెరిగిపోయాయి. ప్రతి వారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు ఏం రిలీజ్ కాబోతున్నాయని ఈగర్‌గా ఎదురుచూస్తుంటారు మూవీ లవర్స్. అలాగే వీకెండ్స్‌లో కుటుంబంతో చూసేందుకు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా మంచి కంటెంట్ సినిమాలో కోసం వెతుకుతుంటారు.
ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే చిత్రాల్లో దాదాపుగా కామెడీ సినిమాలే ఉంటాయి. మంచి సీన్లతో ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కిస్తే కామెడీ ఒరియెంటెడ్ సినిమాలు మూవీ లవర్స్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను సైతం అట్రాక్ట్ చేస్తాయి. అలా ఈ మధ్య కన్నడలో సూపర్ హిట్ అయింది ఓ కామెడీ సినిమా. ఈ సినిమాను కన్నడ స్టార్ హీరో నిర్మించడం విశేషం. కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నిర్మాతగా ఇటీవల నిర్మించిన కామెడీ మూవీ బ్యాచిలర్ పార్టీ.
కర్ణాటక రాష్ట్రంలో జనవరి 26న థియేటర్లలో విడుదలైంది బ్యాచిలర్ పార్టీ మూవీ. రిలీజైల తొలి రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. బ్యాచిలర్ పార్టీ మూవీ కడుపుబ్బా నవ్వించే మంచి కామెడీ సినిమా అని అక్కడి ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. దాంతో పాటు సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వసూలు అయినట్లు సమాచారం. అలాంటి ఆ బ్యాచిలర్ పార్టీ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేస్తోంది. ఒక్క రోజు ఉందనగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇచ్చింది సదరు ఓటీటీ ప్లాట్ ఫామ్.
రక్షిత్ శెట్టి నిర్మించిన బ్యాచిలర్ పార్టీ మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 4 అంటే సోమవారం నుంచి బ్యాచిలర్ పార్టీ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. అంటే ఇంకా ఒక్క రోజు ఉందనగా దీనిపై అనౌన్స్ ఇచ్చింది ఓటీటీ సంస్థ. బ్యాచిలర్ పార్టీ సినిమాకు అభిజిత్ మహేష్ దర్శకత్వం వహించారు. పరమ్ వహ్ స్టూడియోస్ బ్యానర్‌పై రక్షిత్ శెట్టి, జీఎస్ గుప్తా నిర్మాతలుగా వ్యవహరించారు.
ఇక బ్యాచిలర్ పార్టీ సినిమాలో దిగంత్, అచ్యుత్ కుమార్, యోగేష్, సిరి రవికుమార్, బాలాజీ మనోహర్, ప్రకాష్ తుమినాడ్, పవన్ కుమార్, శోభరాజ్, సుధ బెల్వాడీ తదితరులు నటించారు. అభిజిత్ మహేష్, వీరేష్ శివమూర్తి, గణేష్ వశిష్ట మాటలు అందించిన ఈ సినిమాకు అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. అర్జున్ రాము సంగీతం అందించారు. అయితే, అమెజాన్ ప్రైమ్‌లో బ్యాచిలర్ పార్టీ సినిమాను కేవలం కన్నడలోనే స్ట్రీమింగ్ చేస్తారా లేదా తెలుగులో కూడా డబ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
బ్యాచిలర్ పార్టీ సినిమా కథ విషయానికొస్తే.. భార్య-భర్తల మధ్య ఉండే చిన్న సమస్యలతో కామెడీ పుట్టించినట్లు తెలుస్తోంది. అలానే ముగ్గరు స్నేహితులు కలిసి బ్యాంకాక్‌లో చేసిన సందడి సమాచారం. సాఫ్ట్ వేర్ జాబ్ చేసే సంతోష్‌కు సంధ్య అనే అమ్మాయితో పెళ్లి అవుతుంది. ఆయితే వారి వైవాహిక జీవింతలో ఎలాంటి సంతోషం అనేది ఉండదు. భర్తను ఎలాంటి పార్టీలు కూడా చేసుకోనివ్వకుండా ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికి వచ్చేయాలని కండిషన్ పెడుతుంది.
అలాంటి సంతోష్ తన ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీలో తన పాత స్నేహితుడు మ్యాడీ, పీటీ సర్‌లను కలుస్తాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి బ్యాంకాక్ వెళ్దామని నిర్ణయించుకుని వెళ్తారు. ఈ ప్రయాణంలో ఆ ముగ్గురు ఏం తెలుసుకున్నారు. బ్యాంకాక్‌లో వాళ్లు ఏం చేశారన్నదే బ్యాచిలర్ పార్టీ సినిమా కథ. మరి ఈ స్టోరీ చూసేయాలంటే ఇవాళ అర్థరాత్రి స్ట్రీమింగ్ అయ్యేందుకు ఇంకా కొన్ని గంటలు ఎదురుచూడాల్సిందే.