Asur 2 In OTT : జియో సినిమాలో అసుర్ 2.. కానీ మొత్తం సిరీస్ చూడలేరు-asur 2 streaming on jio cinema but you can not watch whole episode on day one heres why ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Asur 2 In Ott : జియో సినిమాలో అసుర్ 2.. కానీ మొత్తం సిరీస్ చూడలేరు

Asur 2 In OTT : జియో సినిమాలో అసుర్ 2.. కానీ మొత్తం సిరీస్ చూడలేరు

Anand Sai HT Telugu
Jun 01, 2023 12:15 PM IST

Asur 2 Streaming : అసుర్ వెబ్ సిరీస్ చాలా మందికి నచ్చింది. సీజన్ 2కు కూడా వచ్చేసింది. జియో సినిమాలో స్ట్రీమింగ్ మెుదలైంది. మొదటి రోజే అన్ని ఎపిసోడ్స్ చూసే అవకాశం జియో సినిమా ఇవ్వలేదు.

అసుర్ 2
అసుర్ 2 (Twitter)

2020లో ప్రసారమైన 'అసుర్'(Asur) అనే వెబ్ సిరీస్‌కి సీక్వెల్ సిద్ధంగా ఉంది. జూన్ 1 నుండి ప్రసారం ప్రారంభమైంది. క్రైమ్ థ్రిల్లర్ తరహాలో రూపొందిన తొలి సిరీస్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. సెకండ్ సిరీస్ ట్రైలర్ కూడా జనాలకు బాగా నచ్చింది. దీనిపై భారీగా అంచనాలు ఉన్నాయి. జియో సినిమా(Jio Cinema)లో అసుర్ 2(Asur 2) ప్రసారం అవుతోంది. జియో సినిమా మొదటి రోజు అన్ని ఎపిసోడ్స్ చూసే అవకాశం ఇవ్వలేదు .

ఈ మధ్యకాలంలో వారానికి ఒక ఎపిసోడ్, రోజుకు ఒక ఎపిసోడ్ ప్రసారం చేసే ట్రెండ్ జోరుగా సాగుతోంది. 'అసుర్ 2'లోనూ అదే స్ట్రాటజీని ఉపయోగించారు. తొలిరోజు రెండు ఎపిసోడ్లు ప్రసారమయ్యాయి. ఆ తర్వాత జూన్ 2 నుంచి జూన్ 7 వరకు రోజూ ఒక ఎపిసోడ్ ప్రసారం కానుంది. దీని ద్వారా జూన్ 7న కావాలనుకుంటే ఒకేరోజు అన్ని ఎపిసోడ్స్ ను వీక్షించవచ్చు.

అర్షద్ వార్సీ, బరున్ సోబ్తి తదితరులు.. అసుర్ సిరీస్‌(Asur Series)లో ప్రధాన పాత్రల్లో కనిపించారు. వరుస హత్యలు కొనసాగుతూ.. ఇదంతా అసురుడు చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ అసురుడు ఎవరో తెలుసుకోవడానికి నిఖిల్ నాయర్ (బరుణ్ సోబ్తి) బయలుదేరుతాడు. అతను ఫోరెన్సిక్ నిపుణుడు. నిఖిల్‌కి ధనంజయ్ రాజ్‌పుత్ (అర్షద్) సహాయం కూడా అందుతుంది. కానీ, అసురుడు కనిపించడు. రెండో భాగంలోనూ అసుర్ అన్వేషణ కొనసాగుతుంది.

అసుర్ చూసిన చాలా మందికి నచ్చింది. అసుర్ 2 రెండు ఎపిసోడ్స్ కూడా బాగున్నాయి. అసుర్ Vootలో అందుబాటులో ఉంది. ఈసారి అసుర్ 2 'జియో సినిమాస్' ద్వారా టెలికాస్ట్ అయింది. ఐపీఎల్‌(IPL)తో మెున్నటి వరకూ జియో సినిమా బిజీగా ఉంది. ఈ కారణంగానే ఐపీఎల్ ముగిసిన తర్వాత 'అసుర్ 2' విడుదలైంది.

టాపిక్