Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ మూవీ మళ్లీ వాయిదా.. ప్రభాస్ వీడియోతో క్లారిటీ
Vyjayanthi Movies Reacts To Kalki 2898 AD Postponed: ప్రభాస్ నటించిన క్రేజీయెస్ట్ మూవీల్లో కల్కి 2898 ఏడీ ఒకటి. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడిందంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. దాంతో తాజాగా మేకర్స్ ఈ వాయిదాపై ప్రభాస్ వీడియోతో క్లారిటీ ఇచ్చారు.
Prabhas Kalki 2898 AD: బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ప్రభాస్. ఆ తర్వాత వరుసపెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ వస్తున్నాడు డార్లింగ్. కానీ, అవి అనుకున్న స్థాయిలో అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. వాటిలో సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. అయితే సాహో మూవీ బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్స్ రాబట్టింది. కానీ, టాక్ పరంగా నెగెటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.
ఇక అనంతరం వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాల రిజల్ట్ ఎలా ఉందో తెలిసిందే. గతేడాది విడుదలైన సలార్ మాత్రం ప్రభాస్ అభిమానులను చాలా సంతోషపెట్టింది. ఎన్నాళ్లకు డార్లింగ్ కటౌట్‌కు తగిన సినిమా వచ్చిందని అభిమానులు పండుగ చేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత డార్లింగ్ ఫ్యాన్స్ అందరి దృష్టి అంతా కల్కి 2898 ఏడీపైనే ఉంది. ఎవడే సుబ్రమణ్యం, మహానటి సినిమాల డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కిపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి.
ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ నటిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, సైన్స్ ఫిక్షన్ అండ్ ఫాంటసీ యాక్షన్ సినిమాగా వస్తున్న ఈ సినిమా విడుదలపై మొదట్లో కన్ఫ్యూజన్ ఏర్పడింది. అది ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చింది. ఇటీవల కల్కి మూవీ వాయిదా పడింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ ప్రచారం అయ్యాయి. ఈ పుకార్లు పీక్ స్థాయిలో ఉండటంతో తాజాగా వాటిపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది కల్కి 2898 ఏడీ మూవీ టీమ్.
తాజాగా కల్కి సినిమాలోని ప్రభాస్ గ్లింప్స్ వీడియో విడుదల చేసి అందరి కన్ఫ్యూజన్ దూరం చేసింది వైజయంతీ మూవీ మేకర్స్. కల్కి సినిమాను మే 9న విడుదల చేయడం పక్కా అన్నట్లుగా సోషల్ మీడియాలో వీడియో వదిలింది. ఈ గ్లింప్స్‌లో ప్రభాస్ పాదం మాత్రమే చూపించారు. ఓ బీట్‌కు ప్రభాస్ కాలు మూమెంట్ వేస్తూ ఉంటుంది. దీనికి టా టక్కర టక్కరే అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు మేకర్స్. ఇక ఇందులో ప్రభాస్ పాదం చూసి వెంకటేశ్వర పాదం అంటారు దాన్ని అని కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కల్కి 2898 ఏడీ వాయిదా పడిందనే రూమర్స్‌కు చెక్ పడినట్లు అయింది. కాగా కల్కి సినిమాను సుమారు రూ. 400 కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటి దీపికా పదుకొణె నటిస్తోంది. అలాగే హాట్ బాంబ్ దిశా పటానీ కూడా కల్కిలో కీలక పాత్ర పోషిస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరో ప్రధాన పాత్ర చేస్తుంటే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నట్లు టాక్.
అంతేకాకుండా కల్కి 2898 ఏడీ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పరశురాముడిగా, నాని కృపాచార్య పాత్రలో కాసేపు కనిపిస్తారని ఈ మధ్య వార్తలు జోరు అందుకున్న విషయం తెలిసిందే. వీళ్లే కాకుండా దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ కూడా నటిస్తారని ఓ టాక్ ఉంది.