Renu Desai: నటి రేణు దేశాయ్ ఇంట విషాదం, పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?
Renu Desai Family: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి పుణెలో రేణు దేశాయ్ ఉంటోంది. గురువారం రేణు దేశాయ్ ఇంట విషాదం చోటు చేసుకుంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి గురువారం మరణించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ అందరికీ తెలియజేశారు. ఓం శాంతి అంటూ తన మాతృమూర్తి పాత ఫొటోని షేర్ చేసిర రేణు దేశాయ్.. ఆది శంకరాచార్యుల విషాద శ్లోకాన్ని రాసుకొచ్చారు.
‘‘పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం
ఇహ సంసారే- బహు దుస్తారే
కృపయాపారే- పాహ మురారే’’
అని రేణు దేశాయ్ రాసుకొచ్చారు.
పుట్టుట.. గిట్టుట.. ఇది ఒక అంతులేని కథ. జనన, మరణాల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. కానీ.. ఈ దు:ఖ సాగరం నుంచి కాపాడమని భగవంతుని ప్రార్థించడం మంచిదని ఈ శ్లోకం అర్థమని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.
పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత తన పిల్లలతో కలిసి రేణు దేశాయ్ పుణెలో ఉంటున్నారు. సినిమాల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చినా ఆమెకి ఆ అవకాశాలు కలిసిరాలేదు. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటూ.. సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా జంతు హింసపై ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఆమె ఎన్టీవోలను కూడా రన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
రేణు దేశాయ్ తల్లి మృతిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తారా? ఆమెకి సంతాపం తెలియజేస్తారా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.