Renu Desai: నా కూతురు తీవ్రంగా ఏడ్చారు.. మీకు ఈ తల్లి శాపం తగులుతుంది: రేణు దేశాయ్ ఆగ్రహం-pawan kalyan ex wife renu desai fires on meme pages says you will carry this curse of a mother ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Renu Desai: నా కూతురు తీవ్రంగా ఏడ్చారు.. మీకు ఈ తల్లి శాపం తగులుతుంది: రేణు దేశాయ్ ఆగ్రహం

Renu Desai: నా కూతురు తీవ్రంగా ఏడ్చారు.. మీకు ఈ తల్లి శాపం తగులుతుంది: రేణు దేశాయ్ ఆగ్రహం

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 25, 2024 08:48 PM IST

Renu Desai: కొందరు ట్రోలర్లు, మీమర్లపై నటి రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మాజీ భర్త పవన్ కల్యాణ్‍తో పిల్లలు అకీరా నందన్, ఆద్య కలిసి దిగిన ఫొటోపై మీమ్స్ చేసిన వారికి హెచ్చరిక చేశారు.

Renu Desai: నా కూతురు తీవ్రంగా ఏడ్చారు.. మీకు ఈ తల్లి శాపం తగులుతుంది: రేణు దేశాయ్ ఆగ్రహం
Renu Desai: నా కూతురు తీవ్రంగా ఏడ్చారు.. మీకు ఈ తల్లి శాపం తగులుతుంది: రేణు దేశాయ్ ఆగ్రహం

Renu Desai: సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న వారిపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా కాలంగా కొందరు నెటిజన్ల కామెంట్లు, ట్రోల్స్ వల్ల ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ట్రోలింగ్‍కు ఎప్పటికప్పుడు గట్టిగా బదులిస్తున్నారు. అయినా కొందరు ట్రోల్స్, మీమ్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇటీవలే పవన్ కల్యాణ్‍‍, అన్నా లెజినోవాతో తన పిల్లలు అకీరా నందన్, ఆద్య కలిసి ఫొటో దిగారు. అయితే, ఈ ఫొటోపై కొందరు సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ చేయడంపై రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు. మనుషులు ఎంత దారుణంగా తయారవడం సిగ్గుచేటు అంటూ ఇన్‍స్టాగ్రామ్‍లో సుదీర్ఘ పోస్ట్ చేశారు.

నా కూతురు తీవ్రంగా ఏడ్చారు

తన తల్లి గురించి ఇష్టమొచ్చినట్టుగా రాసిన కామెంట్లను చదివి, మీమ్స్ చూసి తన కూతురు ఆద్య తీవ్రంగా ఏడ్చారని రేణు దేశాయ్ పేర్కొన్నారు. సెలెబ్రిటీలు, రాజకీయ నాయకుల కుటుంబాలను ఎగతాళి చేసే ముందు మీకు కుటుంబం ఉందని గుర్తుంచుకోవాలని సూచించారు. “నేను ఈ ఫొటోను ఎలా క్రాప్ చేస్తానో.. ఎలా పోస్ట్ చేస్తానో అంటూ జోక్‍లు వేస్తూ.. మీమ్స్ తయారు చేస్తున్న భయానక కఠినమైన వ్యక్తులు అందరూ మీకు కూడా కుటుంబం ఉంటుందని గుర్తు పెట్టుకోండి. నా కూతురు (ఆద్య) ఇన్‍స్టాగ్రామ్ వాడుతున్నప్పుడు ఓ మీమ్ పేజీ కనిపించింది. దాంట్లో తన తల్లిని ఎగతాళి చేయడాన్ని చూసి తీవ్రంగా ఏడ్చింది. సెలెబ్రిటీలు, రాజకీయ నాయకుల కుటుంబాలను ఎగతాళి చేసే వారంతా ఒక్కసారి మీ ఇళ్లలోనూ తల్లులు, అక్కాచెల్లెళ్లు ఉన్నారని గుర్తుంచుకోండి” అని రేణు దేశాయ్ పోస్ట్ చేశారు. పవన్ - అన్నా లెజినోవాతో అకీరా, ఆద్య దిగిన ఫొటోను షేర్ చేశారు.

శాపం తగులుతుంది

అభ్యంతరకరంగా మీమ్స్, జోక్స్ వేసున్న వారికి ఈ తల్లి శాపం తగులుతుందని రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “నా కూతురు ఈరోజు అనుభవించిన బాధ, కార్చిన కన్నీరుతో మీకు చెడు కర్మ కచ్చితంగా తగులుతుందని గుర్తుంచుకోండి. పోలెనా, మార్క్ (పవన్ - లెజినోవా పిల్లలు) కూడా ఈ మీమ్స్, కఠినమైన కామెంట్లతో ప్రభావితులవుతారు. అతి భయకమైన మనుషులుగా తయారైన మీమ్ పేజ్ అడ్మినిస్ట్రేటర్లందరికీ ఈ తల్లి శాపం తగులుతుంది. నేను దీన్ని పోస్ట్ చేసే ముందు 100సార్లు ఆలోచించా. కానీ నా కూతురు అనుభవించిన బాధను వ్యక్తం చేసేందుకు చెప్పాల్సి వచ్చింది” అని రేణు దేశాయ్ తన ఇన్‍స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ ఇటీవలే ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టారు. ఈ తరుణంలో అకీరా, ఆద్యతో కలిసి పవన్, అన్నా లెజినోవా దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు.

తనను దురదృష్టవంతురాలు అంటూ కొందరు చేసిన కామెంట్లపై ఇటీవలే రేణు దేశాయ్ గట్టిగా స్పందించారు. తన అదృష్టాన్ని ఓ వ్యక్తితో ఎందుకు ముడిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విడాకులు తీసున్నంత మాత్రాన మహిళ, పురుషుడు దురదృష్టవంతులు కారని చెప్పారు. ఇక, అర్థంపర్థం లేని కామెంట్లు వస్తుండటంతో రేణు దేశాయ్ విసిగిపోయారు. తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో కామెంట్ల సెక్షన్‍ను డిసేబుల్ చేశారు.

Whats_app_banner