Pawan Kalyan: పవన్ కల్యాణ్‍తో సమావేశమైన టాలీవుడ్ నిర్మాతలు: ఫొటోలు
- Pawan Kalyan - Tollywood Producers: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‍ను టాలీవుడ్ నిర్మాతలు కలిశారు. డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన ఆయనను అభినందించడంతో పాటు సినీ ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు.

(1 / 5)
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్‍తో తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖ నిర్మాతలు భేటీ అయ్యారు. విజయవాడలోని పవన్ క్యాంప్ కార్యాలయంలో నేడు (జూన్ 24) ఈ సమావేశం జరిగింది.
(2 / 5)
ప్రముఖ నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, బీవీఎస్‍ఎన్ ప్రసాద్, దిల్‍రాజు, డీవీవీ దానయ్య, ఏంఎం రత్నం, చినబాబు, నవీన్ యెర్నెనీ, విశ్వప్రసాద్, సుప్రియ సహా మరికొందరు నిర్మాతలు పవన్ కల్యాణ్‍ను కలిశారు. ఆయనతో సమావేశమయ్యారు.
(3 / 5)
ఏపీ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన పవన్‍ను నిర్మాతలు అభినందించారు. పవన్‍కు దిగ్గజ నిర్మాత అశ్వినీదత్ పుష్పగుచ్ఛం అందిస్తున్న దృశ్యమిది.
(4 / 5)
టికెట్ల ధరలు, థియేటర్లు సహా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ కల్యాణ్‍కు నిర్మాతలు వివరించారు. ఏపీలో సినీ రంగం విస్తరణపై కూడా చర్చ సాగింది. జనసేన ఎమ్మెల్యే, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ కూడా ఈ భేటీలో ఉన్నారు.
ఇతర గ్యాలరీలు