Renu Desai on Pawan Kalyan: పవనే నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నారు.. టార్చర్ పెట్టకండి: అభిమానిపై రేణు దేశాయ్ ఫైర్
Renu Desai on Pawan Kalyan: పవన్ కల్యాణే తనను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నారని, తాను కాదని ఓ అభిమానిపై రేణు దేశాయ్ మండిపడింది. పవన్ ఏపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓ అభిమాని చేసిన కామెంట్ కు ఆమె తీవ్రంగా స్పందించింది.
Renu Desai on Pawan Kalyan: పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి అతని మాజీ భార్య రేణు దేశాయ్ కి ఇప్పటికీ వేధింపులు తప్పడం లేదు. వీళ్లిద్దరూ ఎవరి దారి వాళ్లు చూసుకొని ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కొంత మంది ఆమెను లక్ష్యంగా చేసుకొని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ పవన్ కల్యాణ్ అభిమానికి రేణు కాస్త గట్టిగానే క్లాస్ పీకింది.
పవనే నన్ను వదిలేశారు: రేణు
పవన్ కల్యాణ్ ఏపీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయిన తర్వాత అతని అభిమానుల్లో ఓ కొత్త ఊపు కనిపిస్తోంది. చాలా ఏళ్లపాటు ఎన్నో అవమానాలు భరించి, కష్టాలకోర్చిన తర్వాత ఈ గెలుపు సాధ్యమైందంటూ పవన్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్బంగా ఓ అభిమాని పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ను లక్ష్యంగా చేసుకొని ఇన్‌స్టాగ్రామ్ లో ఆమె చేసి పోస్టుకు కామెంట్ చేశాడు.
"వదిన గారు మీరు కొన్ని ఇయర్స ఓపిక పట్టింటే బాగుండేది. ఒక దేవుడిని వివాహం చేసుకొని ఆయన అంతరంగం తెలీకుండా వెళ్లిపోయారు. కానీ ఈ రోజు ఆయన విలువ మీకు తెలిసింది. ఏది ఏమైనా విధి అన్నీ నిర్ణయిస్తుంది. ఈ రోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదిన.. మిమ్మల్ని మిస్ అవుతున్నాం వదిన" అని సుధాకర్ అనే ఆ అభిమాని కామెంట్ చేశాడు.
దీనికి రేణు కాస్త ఘాటుగా స్పందించింది. "మీకు కొంచెం కూడా బుద్ధి ఉంటే ఇలా చెప్పేది కాదు. ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు. నేను కాదు. దయచేసి నాకు ఇంకా టార్చర్ చెయ్యొద్దు ఇలాంటి కామెంట్స్ పెట్టి" అని రేణు రిప్లై ఇచ్చింది. పవన్ తో విడిపోవడానికి తప్పంతా రేణుదే అన్నట్లు ఇప్పటికే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు అనడానికి ఈ కామెంటే నిదర్శనంగా చెప్పొచ్చు.
పవన్, రేణు పెళ్లి, విడాకులు
పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ కలిసి బద్రి మూవీలో తొలిసారి నటించారు. అప్పటి నుంచే వీళ్ల మధ్య ప్రేమ చిగురించింది. తర్వాత జానీ మూవీలోనూ కలిసి పని చేశారు. ఎన్నో ఏళ్ల పాటు పెళ్లి చేసుకోకుండా సహ జీవనం చేశారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 2009లో పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే మూడేళ్లకే విభేదాలు వచ్చి ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు.
తర్వాత పవన్ కల్యాణ్ మూడో పెళ్లి చేసుకున్నాడు. తీన్మార్ మూవీలో తనతో కలిసి నటించిన ఎనా లెజ్నోవాను పెళ్లాడాడు. అయితే 12 ఏళ్లుగా పవన్ కల్యాణ్ అభిమానులు మాత్రం రేణు దేశాయ్ ను సోషల్ మీడియా ద్వారా ఏవో కామెంట్లతో ఇలా వెంటాడుతూనే ఉన్నారు. తనను వదిలేయాలని ఆమె ఎన్నిసార్లు అడిగినా వాళ్ల తీరు మారలేదు.
తాజాగా పవన్ ఏపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇలా మరోసారి రేణు దేశాయ్ ని టార్గెట్ చేస్తున్నారు. తాము విడిపోవడానికి కారణం పవనే తప్ప తాను కాదని ఈసారి కాస్త గట్టిగానే రేణు స్పందించింది.