Mechanic Rockey Twitter Review: మెకానిక్ రాకీ ట్విట్టర్ రివ్యూ - పైసా వసూల్ మూవీ - విశ్వక్ సినిమా టాక్ ఏంటంటే?
Mechanic Rockey Twitter Review: విశ్వక్‌సేన్ హీరోగా నటించిన మెకానిక్ రాకీ మూవీ శుక్రవారం రిలీజైంది. ఈ యాక్షన్ కామెడీ మూవీలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు.
Mechanic Rockey Twitter Review: కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడితో యంగ్ హీరో విశ్వక్‌సేన్ చేసిన మెకానిక్ రాకీ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. ప్రమోషన్స్‌లో విశ్వక్‌సేన్ కామెంట్స్‌తో పాటు టీజర్, ట్రైలర్స్ కారణంగా ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. మెకానిక్ రాకీ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?
విశ్వక్ మాస్ డైలాగ్స్...
ప్రాపర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రవితేజ ముళ్లపూడి మెకానిక్ రాకీ మూవీని తెరకెక్కించినట్లు నెటిజన్లు చెబుతోన్నారు. ఈ సినిమాలో రాకీ పాత్రలో విశ్వక్‌సేన్ తన కామెడీ టైమింగ్, మాస్ డైలాగ్స్ తో అదరగొట్టాడని అంటున్నారు.
రాకీ అనే డ్రైవింగ్ స్కూల్ ఓనర్ జీవితం నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని, తండ్రి జీవితం వెనకున్న సీక్రెట్స్ గురించి తెలుసుకోవడమే కాకుండా తన స్కూల్ స్థలాన్ని కబ్జా చేసిన రౌడీలను ఎదురించి రాకీ ఎలా పోరాడడన్నది యాక్షన్, కామెడీ అంశాలు మేళవించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా డైరెక్టర్ చూపించాడని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
పది నిమిషాలకు ఓ ట్విస్ట్...
ఫస్ట్ హాఫ్ కామెడీ, లవ్ రొమాంటిక్ సీన్స్‌తో సినిమా డైరెక్టర్ టైమ్‌పాస్ చేశాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సెకండాఫ్ మాత్రం ప్రతి పదినిమిషాలకు ఓ ట్విస్ట్‌తో సినిమా థ్రిల్లింగ్‌ను పంచుతుందని అంటున్నారు.సైబర్ క్రైమ్ అంశాన్ని టచ్ చేస్తూ కథను ఎంగేజింగ్‌గా నడిపించాడని చెబుతున్నారు.
పోటాపోటీగా...
శ్రద్ధా శ్రీనాథ్, మీనాక్షి చౌదరి ఇద్దరు పాత్రలు పోటాపోటీగా సాగుతాయి. ఇద్దరు హీరోయిన్లు యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్‌లో కనిపించారని చెబుతున్నారు.
పెద్ద మైనస్...
ఫస్ట్ హాఫ్ ఈ సినిమాకు పెద్ద మైనస్‌గా మారిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. కథ అక్కడే తిరుగుతూ ముందుకు కదలని భావన కలిగిస్తుందని తెలిపాడు. కామెడీ కూడా ఆశించిన స్థాయిలో వర్కవుట్ కాలేదని చెబుతున్నారు.ట్విస్ట్‌లు బాగున్నా...వాటి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే డ్రామాను మాత్రం దర్శకుడు ఇంట్రెస్టింగ్ రాసుకోలేకపోయాడని ట్వీట్స్ చేస్తున్నారు.
విశ్వక్‌సేన్ యాక్టింగ్ అతడి గత సినిమాలను గుర్తుచేస్తుందని, పాత్రలో వేరియేషన్ పెద్దగా కనిపించదని ఓ నెటిజన్ అన్నాడు.