Karimnagar PTC: పోలీసులంటే భయపడొద్దు... ప్రజల్లో నెగెటివ్ అభిప్రాయం పోవాలి… కానిస్టేబుల్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో డీజీ
Karimnagar PTC: పోలీసులు అంటే ప్రజలకు భయం. వారిపై నెగెటివ్ అభిప్రాయం ఉంటుంది. కొడతారు, తిడతారు.. దురుసుగా ప్రవర్తిస్తాలనే అభిప్రాయం పోవాలంటే పోలీసులు సత్ప్రవర్తనతో మెలగాలని అన్నారు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిజీ కమలాసన్ రెడ్డి. కానిస్టేబుల్స్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్నారు.
Karimnagar PTC: కరీంనగర్ లో రెండు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో రాచకొండ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 1351 మంది ఏఆర్, సివిల్ స్టైపండరీ కానిస్టేబుల్స్ శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించారు.
పాసింగ్ ఔట్ పరేడ్ కు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిజీ కమలాసన్ రెడ్డి తోపాటు ఎసిబి డిజి విజయ్ కుమార్ హాజరై 9 నెలల కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్ కు అభినందించారు. పోలీస్ అంటే నెగటివ్ అభిప్రాయం ఉన్నవారు ఒక సర్వే నిర్వహిస్తే 80 శాతం మంది పోలీసులు అంటే సదాభిప్రాయంతో ఉన్నట్లు తేలిందని కమలాసన్ రెడ్డి చెప్పారు.
పోలీసు తో ఇంటరాక్టివ్ కాని వారు, పోలీస్ స్టేషన్ కు రానివారు మాత్రమే నెగటివ్ ఒపీనియన్ తో ఉన్నారని తెలిపారు. తెలంగాణ పోలీస్ అకాడమీ శిక్షణ కు ఏమాత్రం తీసిపోకుండా శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించిన వారు సైతం కానిస్టేబుల్ పోస్ట్ కోసం పోటీపడడం అభినందనీయమన్నారు.
ప్రజాసేవ చేయడానికి గొప్ప వేదిక పోలీస్ డిపార్ట్మెంట్
ప్రజా సేవ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కంటే గొప్ప డిపార్ట్మెంట్ లేదని కమలాసన్ స్పష్టం చేశారు. క్రైమ్ డిటెక్టివ్...శాంతి భద్రతల పరిరక్షణ లో అనునిత్యం అలెర్ట్ గా ఉండాలని, స్కిల్స్ ఇంప్రూ చేసుకోవడానికి ప్రతి రోజు కృష్ణి చేయాలని కోరారు. నేర్చుకునేది ఏమి లేదు శిక్షణ అయిపోయిందని భావించకూడదని, లైఫ్ లాంగ్ బతికున్నంత కాలం ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని సూచించారు.
ఏఆర్ కు ఎంపికైన వారు ఏఆర్ కే పరిమితం కాదని, సివిల్ కు మారే అవకాశం ఉంటుందన్నారు. మన ప్రవర్తన మన హెల్పింగ్ నేచర్ ద్వారా ప్రజలకు మంచి అభిప్రాయం కలిగించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని సూచించారు.
పోలీస్ ప్రతిష్టతను పెంచాలి..విజయ్ కుమార్
నక్సల్స్ తీవ్రవాద సమస్య CYBER CRIME, మాదకద్రవ్యాల రవాణా సమస్యలను ఎదుర్కొని పొలీస్ ప్రతిష్టతను పెంచాలన్నారు అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ విజయ్ కుమార్. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులు మహిళలు, పిల్లలు, వృద్దుల పట్ల నిస్వార్థంగా నిజాయితీతో సేవ చేసినపుడే పోలీసుల పట్ల నమ్మకం పెరుగుతుందని తెలిపారు.
భగవంతుడు ప్రజలను రక్షించడానికి ప్రతిసారి భూమి మీదకు భగవంతుడి రాలేరని, భగవంతుని ప్రతిరూపాలుగా భూమి మీద డాక్టర్, పోలీసులను సృష్టించాడని తెలిపారు. ప్రజలందరికి న్యాయం అందేటట్లు చూడాలని సూచించారు. మంచిని స్వీకరిస్తూ చెడు ఎక్కడ ఉన్న అణచి వేసే దిశగా శిక్షణార్థులు అడుగువేయాలని ఆదేశించారు. శిక్షణలో అత్త్యుత్తమ ప్రతిభ కనపరచిన శిక్షణార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)