Bigg Boss Telugu 8: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. బిగ్ బాస్ చెత్త ప్లాన్‌ను తిప్పికొట్టిన గౌతమ్.. నిజంగా మాస్టర్ మైండ్!
Bigg Boss Telugu 8 November 21 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 టీమ్ వేసిన అతి చెత్త ప్లాన్‌ను దారుణంగా తిప్పి కొట్టాడు గౌతమ్ కృష్ణ. దాంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు పడినట్లు అయినట్లు అయింది. ఆఖరి మెగా చీఫ్ టాస్క్‌లో తన తెలివితో నిజంగా మాస్టర్ మైండ్ అనిపించుకున్నాడు గౌతమ్.
Bigg Boss 8 Telugu Final Mega Chief Task Highlights: బిగ్ బాస్ అనేది రియాలిటీ షో అయినప్పటికీ చాలా వరకు ఫేవరిటిజం చూపిస్తుంటుంది బీబీ టీమ్. తమకు కావాల్సిన కంటెస్టెంట్స్‌ను లేపుతూ బాగా ఆడిన కంటెస్టెంట్స్‌ను సైతం తొక్కేందుకు ట్రై చేస్తుంటారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపులే గౌతమ్ కృష్ణ.
దారుణంగా తిప్పి కొట్టి
వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టిన గౌతమ్ కృష్ణ ఆట పరంగా అదరగొడుతున్న తనకు సంబంధించిన సీన్స్ అన్నీ ఎపిసోడ్స్‌లో ఎత్తేస్తున్నాడు. కానీ, గౌతమ్‌కు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ పెరుగుతుండటంతో ఎలాగైనా తొక్కాలని చూశాడు బిగ్ బాస్. అందుకే గౌతమ్‌ను నెగెటివ్ చేసేందుకు ఆఖరి మెగా చీఫ్ టాస్క్‌ను ఉపయోగించుకున్నాడు. కానీ, దాన్ని గౌతమ్ కృష్ణ మాత్రం దారుణంగా తిప్పికొట్టాడు.
ఈ వారం సీజన్‌కే ఆఖరి మెగా చీఫ్ టాస్క్‌ను నిర్వహించారు. ఈ టాస్క్‌లో మెగా చీఫ్ కంటెండర్స్‌గా యష్మీ, రోహిణి, పృథ్వీ, విష్ణుప్రియ, టేస్టీ తేజ నిలిచారు. వీరందరికి పోటీ పెట్టాడు బిగ్ బాస్. అయితే, దీనికి సంచాలక్‌గా గౌతమ్‌ను కావాలనే నియమించాడు బిగ్ బాస్. హౌజ్‌లో కన్నడ బ్యాచ్ గ్రూప్ గేమ్ ఆడుతోందని గౌతమ్ పెద్ద వార్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
టెస్ట్ చేసిన బిగ్ బాస్
గ్రూప్ గేమ్ ఆడుతున్న కన్నడ బ్యాచ్‌కు చెందిన యష్మీ, పృథ్వీని పక్కకు పెట్టి తనతోపాటు వైల్డ్ కార్డ్స్‌గా వచ్చిన రోహిణి, టేస్టీ తేజకు సపోర్ట్ చేసేలా పక్షపాతం చూపిస్తాడేమో అని గౌతమ్‌ను టెస్ట్ చేశాడు బిగ్ బాస్. అయితే, సంచాలక్‌గా ఉంటే కచ్చితంగా ఏదో ఒక చిన్న తప్పు జరుగుతుంటుంది. గౌతమ్ కూడా ఏదైనా ఒక చిన్న తప్పు చేసిన దాన్ని హైలెట్ చేద్దామని అనుకున్నారు బీబీ టీమ్.
ఇక వీకెండ్‌లో నాగార్జున వచ్చి దానిపైనే ఎపిసోడ్ అంతా రన్ చేస్తారు. మిగిలిన వాళ్లు ఎంత పెద్ద తప్పులు చేసిన పట్టించుకోరు. కానీ, వారి అంచనాలకు భిన్నంగా ఎవరికి పక్షపాతం చూపించకుండా న్యాయంగా సంచాలక్‌గా డ్యూటీ నిర్వహించాడు గౌతమ్ కృష్ణ. బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 21 ఎపిసోడ్‌లో ఫైనల్ మెగా చీఫ్ ఛాలెంజ్‌లో భాగంగా "పట్టువదలని విక్రమార్కులు" అనే టాస్క్ ఇచ్చారు.
ఆ ఇద్దరికి సపోర్ట్
వీరంతా బ్లూ, రెడ్ ఇలా రంగులు ఉన్న డ్రమ్స్‌పై తాడు పట్టుకుని నిలబడాలి. సంచాలక్ అయిన గౌతమ్ డైస్‌ను రోల్ చేసి అందులో ఏ కలర్ వస్తే ఆ కలర్ డ్రమ్‌ను తీసేస్తాడు. దాంతో దానిపై ఉన్న వాళ్లు వేలాడుతారు. ఎక్కువ సేపు వేలాడలేరు కాబట్టి టాస్క్ నుంచి అవుట్ అవుతారు. అయితే, ఈ టాస్క్‌లో ముందుగా పృథ్వీ, యష్మీని పీకేసి రోహిణి, తేజకు గౌతమ్ సపోర్ట్ చేస్తాడు అని అంతా అనుకున్నారు.
కానీ, గౌతమ్ ఎలాంటి ఫేవరిజం చూపించకుండా కలర్స్‌పై వై, ఆర్, టీ, పీ అని నేమ్ లెటర్స్ రాసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఎవరి నేమ్ వస్తే వారి డ్రమ్‌ను తీసేసాడు. అలా గౌతమ్ క్లియర్‌గా న్యాయమైన గేమ్ ఆడాడు. తనను నెగెటివ్ చేద్దామని వేసిన బిగ్ బాస్ చెత్త ప్లాన్‌ను తిప్పి కొట్టాడు గౌతమ్. దీంతో గౌతమ్ మాస్టర్ మైండ్‌కు బిగ్ బాస్‌కు, కన్నడ బ్యాచ్ షాక్ అయ్యారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు రాలినట్లు అయింది.
నెయిల్ పాలిష్ అడిగి మరి
ఇదిలా ఉంటే, రౌహిణి దగ్గర వైట్ కలర్ నెయిల్ పాలిష్ అడిగి డైస్ మీద నేమ్ లెటర్స్ రాశాడు గౌతమ్ కృష్ణ. కానీ, దీన్ని మాత్రం ఎపిసోడ్‌లో ఎత్తేశాడు బిగ్ బాస్. ఇలా గౌతమ్‌కు ప్లస్ అయ్యే అన్ని సీన్స్‌ను, ఎలివేషన్స్‌ను బిగ్ బాస్ ఎత్తేస్తున్నాడు. మరి దీనికి కారణాలు బిగ్ బాస్‌కే తెలియాలి.