Most unsafe car : ప్రాణం అంటే లెక్కలేకపోతే- ఈ కారు కొనాలి! సేఫ్టీలో ‘0’ రేటింగ్​..-citroen c3 aircross suv gets zero safety rating at this global crash test ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Most Unsafe Car : ప్రాణం అంటే లెక్కలేకపోతే- ఈ కారు కొనాలి! సేఫ్టీలో ‘0’ రేటింగ్​..

Most unsafe car : ప్రాణం అంటే లెక్కలేకపోతే- ఈ కారు కొనాలి! సేఫ్టీలో ‘0’ రేటింగ్​..

Sharath Chitturi HT Telugu
Nov 22, 2024 06:40 AM IST

Most unsafe car : సిట్రోయెన్​ వాహనాల్లో సేఫ్టీ సమస్యలు వస్తున్నాయి! క్రాష్​ టెస్ట్​లో ఇవి పేలవ ప్రదర్శన చేస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ క్రాష్​ టెస్ట్​లో సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​కి 0 సేఫ్టీ రేటింగ్​ లభించింది!

ఈ ఎస్​యూవీకి సేఫ్టీలో ‘0’ రేటింగ్​..!
ఈ ఎస్​యూవీకి సేఫ్టీలో ‘0’ రేటింగ్​..!

సిట్రోయెన్ సి3 ఎయిర్ క్రాస్​ ఎస్​యూవీకి.. లాటిన్ ఎన్​సీఏపీలో నిరాశాజనక క్రాష్ టెస్ట్ ఫలితాలు లభించాయి. గత సంవత్సరం భారతదేశంలో అరంగేట్రం చేసిన ఈ మూడు వరుసల ఎస్​యూవీకి సంబంధించిన బ్రెజిల్-స్పెక్ మోడల్​.. జీరో-స్టార్ సేఫ్టీ రేటింగ్​ సాధించింది. లాటిన్ ఎన్​సీఏపీ పరీక్షించిన సీ3 ఎయిర్​క్రాస్ ఎస్​యూవీలో స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లుగా రెండు ఎయిర్​బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్​సీ) ఉన్నాయి. ఎంట్రీ లెవల్ వేరియంట్ నుంచే ఆరు ఎయిర్ బ్యాగులను అందించే భారతదేశంలో అమ్మకానికి ఉన్న మోడల్ కంటే ఇది భిన్నంగా ఉంటుంది!

అడల్ట్ ఆక్యుపెంట్​ ప్రొటెక్షన్ టెస్ట్​లో.. ఈ సిట్రోయెన్ సీ3 ఎయిర్​క్రాస్ కేవలం 33.01% స్కోరును మాత్రమే పొందింది! అయితే చైల్డ్ ఆక్యుపెంట్​ ప్రొటెక్షన్ టెస్ట్​లో 11.37% సేఫ్టీ స్కోర్​ని సాధించింది. ఈ ఎస్​యూవీపై పెడిస్ట్రియన్​ ప్రొటెక్షన్​ అండ్​ వల్నరబుల్​ రోడ్ యూజర్స్ టెస్ట్ కూడా జరిపారు. దీనిలో ఇది 49.57% పాయింట్లు సాధించింది. సేఫ్టీ అసిస్ట్ టెస్ట్​లో సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్ 34.88% సేఫ్టీ స్కోర్​ను పొందింది.

సీ3 ఎయిర్​క్రాస్ ఎస్​యూవీని ఫ్రంటల్ ఇంపాక్ట్, సైడ్ ఇంపాక్ట్, విప్లాష్, పెడిస్ట్రిషన్​ ప్రొటెక్షన్​, ఈఎస్​సీ విభాగాల్లో పరీక్షించారు. టెస్టింగ్ కోసం ఉపయోగించే మోడల్​లో ఆప్షనల్ సేఫ్టీ ఫీచర్​గా కూడా ముందు, వెనుక వరుసల్లో సైడ్ హెడ్ ప్రొటెక్షన్​ను అందించలేదు. దీంతో క్రాష్ టెస్ట్ సమయంలో ఎస్​యూవీ భారీ పాయింట్లు కోల్పోయింది.

ఫ్రంటల్ ఇంపాక్ట్ క్రాష్ టెస్ట్​లో, ఎస్​యూవీ ముందు ప్రయాణికుడికి బలహీనమైన ఛాతీ రక్షణను కనుగొంది. విప్​లాష్ పరీక్షతో సహా ఇతర టెస్ట్​లు నిర్వహించగా.. ఇది పెద్దలకు పేలవమైన నెక్​ ప్రొటెక్షన్​ని చూపించింది. డైనమిక్ చైల్డ్ ప్రొటెక్షన్ టెస్ట్ సమయంలో కూడా ఈ ఎస్​యూవీ ఎలాంటి పాయింట్లు సాధించలేకపోయింది! ఎందుకంటే దాని ఐసోఫిక్స్ యాంకరేజ్ మార్కింగ్ లాటిన్ ఎన్​సీఏపీ అవసరాలను తీర్చలేదు. ఎస్​యూవీ చైల్డ్ కంట్రోల్ సిస్టమ్స్ (సీఆర్​ఎస్)లో కూడా ఈ ప్రయోగం విఫలమైంది.

సిట్రోయెన్ సీ3 ఎయిర్​క్రాస్​ ఇన్ ఇండియా: సేఫ్టీ ఫీచర్స్..

బ్రెజిల్​లో ఉన్న సిట్రోయెన్ సీ3 ఎయిర్​క్రాస్​ మోడల్​కి- భారత్​లో ఉన్న మోడల్​కి చాలా డిఫరెన్స్​ ఉంది. అందుకే ఇండియాలోని మోడల్​ క్రాష్ టెస్ట్ ఫలితాల్లో మెరుగైన స్కోర్​ని సాధించవచ్చు. ఇండియా-స్పెక్ సీ3 ఎయిర్​క్రాస్​ ఎస్​యూవీలో సిట్రోయెన్ 6 ఎయిర్​బ్యాగ్స్​ని స్టాండర్డ్​గా అందిస్తోంది. ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి 40 అధునాతన భద్రతా ఫీచర్లను ఈ ఎస్​యూవీని అందిస్తుంది.

అయితే ఇండియాలో అందుబాటులో ఉన్న సిట్రోయెన్​ ఈసీ3 ఎలక్ట్రిక్​ కారు సేఫ్టీ విషయంలో ఆందోళనకరంగా ఉంది. క్రాష్​ టెస్ట్​లో పేలవ ప్రదర్శన చేసింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం