Nayanthara vs Dhanush: సడన్‌గా ఒకే వేదికపైకి నయనతార, ధనుష్.. పక్క పక్కనే కూర్చున్నా ఎడమొఖం, పెడమొఖం
Nayanthara: Beyond The Fairytale Netflix documentary: నయనతార, ధనుష్ వివాదం తర్వాత తొలిసారి ఎదురుపడ్డారు. కానీ.. కనీసం ఒకరి ముఖం కూడా మరొకరు చూసుకోలేదు.
లేడీ సూపర్ స్టార్ నయనతార, హీరో ధనుష్ సడన్‌గా ఒకే వేదికపై ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యపరిచారు. గత వారం రోజులుగా నయనతార డాక్యుమెంటరీలో వాడిన 3 సెకన్ల క్లిప్పింగ్‌పై ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది. ఒకరినొకరు దోషిగా చూపిస్తూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో చెన్నై వేదికగా జరిగిన ఒక వివాహ వేడుకకి ఇద్దరూ హాజరై ఆశ్చర్యపరిచారు.
3 సెకన్ల క్లిప్ తెచ్చిన తంట
నయనతార తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లోని ఆసక్తికరమైన విషయాల్ని‘నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ రూపంలో అభిమానులకి ముందుకు తీసుకొచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతుండగా.. అందులో ‘నేనూ రౌడీనే’ అనే సినిమా నుంచి 3 సెకన్ల క్లిప్పింగ్‌ను వాడారు. అయితే.. తన అనుమతి లేకుండా ఆ సెకన్ల వాడారని కోప్పడిన ధనుష్.. రూ.10 కోట్లు పరిహారం చెల్లించాలంటూ నయనతారకి నోటీసులు పంపాడు. నేనూ రౌడీనే సినిమాకి ధనుష్ ప్రొడ్యూసర్.
ప్రొడ్యూసర్ పెళ్లికి వచ్చిన ధనుష్, నయన్
3 సెకన్లకి రూ.10 కోట్లు ఏంటి? అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చిన నయనతార.. ధనుష్ వేధింపులకి గురిచేస్తున్నట్లు ఆరోపించింది. దాంతో నయన్‌కి ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున సపోర్ట్ లభించింది. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే టౌన్ పిక్చర్స్ వ్యవస్థాపకుడు ఆకాష్ భాస్కర్ ఈ రోజు వివాహం చేసుకున్నారు.
ఆకాష్ భాస్కర్ వివాహానికి తొలుత ధనుష్ హాజరవగా.. ఆ తర్వాత నయనతార కూడా తన భర్త విఘ్నేశ్ శివన్‌తో వచ్చింది. సినీ సెలెబ్రిటీలందరికీ వివాహ వేదికలో ముందు వరుస కుర్చీలను కేటాయించారు. దాంతో ధనుష్, నయనతార ఒకే వరుసలో కూర్చోవాల్సి వచ్చింది. అయినప్పటికీ.. ఇద్దరూ కనీసం ఒకరి వైపు మరొకరు చూసుకోలేదు.
శివ కార్తికేయన్, నయన్ ముచ్చట్లు
వధూవరులను ఆశీర్వదించేందుకు వేదికపైకి కూడా తొలుత సెలెబ్రిటీలు వెళ్లగా.. అక్కడ కూడా నయనతార, ధనుష్ ఎడమొఖం, పెడమొఖంగా ఉన్నారు. ఇదే వివాహానికి శివ కార్తికేయన్ కూడా తన భార్యతో వచ్చాడు. ఆ వివాహ వేదికలో శివ కార్తికేయన్, నయనతార చాలా సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ ఫొటోల్ని షేర్ చేస్తున్న నెటిజన్లు.. ధనుష్‌కి ఇది కాళరాత్రి అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
ధనుష్ విడాకుల కేసు కూడా ఈరోజు చెన్నై ఫ్యామిలీ కోర్టులో విచారణకి వచ్చింది. అతని భార్య, రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య కోర్టుకి వచ్చి.. ధనుష్‌తో విడిపోవాలని తాను నిర్ణయించుకున్నట్లు తేల్చి చెప్పేసింది. దాంతో.. ధనుష్ టైమ్ అస్సలు బాగున్నట్లేదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.