Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ రేటింగ్స్‌లో భారీ మార్పులు.. అడ్రెస్ లేని బ్రహ్మముడి.. టాప్‌లో ఏదంటే..-star maa serials trp ratings brahmamudi trp rating karthika deepam illu illalu pillalu in top 2 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Star Maa Serials Trp Ratings: స్టార్ మా సీరియల్స్ రేటింగ్స్‌లో భారీ మార్పులు.. అడ్రెస్ లేని బ్రహ్మముడి.. టాప్‌లో ఏదంటే..

Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ రేటింగ్స్‌లో భారీ మార్పులు.. అడ్రెస్ లేని బ్రహ్మముడి.. టాప్‌లో ఏదంటే..

Hari Prasad S HT Telugu
Nov 21, 2024 08:37 PM IST

Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రైమ్ టైమ్ నుంచి వెళ్లిపోయిన బ్రహ్మముడి అడ్రెస్ లేకుండా పోగా.. కొత్తగా టాప్‌లోకి కార్తీకదీపం రావడం విశేషం.

స్టార్ మా సీరియల్స్ రేటింగ్స్‌లో భారీ మార్పులు.. అడ్రెస్ లేని బ్రహ్మముడి.. టాప్‌లో ఏదంటే..
స్టార్ మా సీరియల్స్ రేటింగ్స్‌లో భారీ మార్పులు.. అడ్రెస్ లేని బ్రహ్మముడి.. టాప్‌లో ఏదంటే..

Star Maa Serials TRP Ratings: బ్రహ్మముడి సీరియల్ తాజా టీఆర్పీ రేటింగ్స్ లో కనిపించకుండాపోయింది. దాని స్థానంలో వచ్చిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఏకంగా రెండో స్థానంలోకి దూసుకురావడం విశేషం. స్టార్ మాతోపాటు ఇతర తెలుగు టీవీ సీరియల్స్ 46వ టీఆర్పీ రేటింగ్స్ తాజాగా రిలీజయ్యాయి. ఈ జాబితాలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

టాప్ సీరియల్ కార్తీకదీపం 2

ఊహించిందే జరిగింది. తెలుగు టీవీ సీరియల్స్ 46వ వారం టీఆర్పీ రేటింగ్స్ లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. నవంబర్ 12 నుంచి రాత్రి 7.30కు బదులు మధ్యాహ్నం ఒంటి గంటకు టెలికాస్ట్ అవుతున్న బ్రహ్మముడి సీరియల్.. చాలా కాలంగా ఉన్న తన టాప్ స్పాట్ కోల్పోయింది.

ఇన్నాళ్లూ రెండో స్థానంలో ఉన్న కార్తీకదీపం 2 సీరియల్.. ఇప్పుడు నంబర్ వన్ సీరియల్ అయింది. ఇక బ్రహ్మముడి స్థానంలో కొత్తగా వచ్చిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్.. తొలి వారమే 12.21 రేటింగ్ తో రెండో స్థానంలోకి దూసుకురావడం విశేషం. ఈ రెండింటి తర్వాత 10.71 రేటింగ్ తో చిన్ని మూడో స్థానంలో, 9.99 తో ఇంటింటి రామాయణం నాలుగో స్థానంలో, 9.80తో గుండెనిండా గుడిగంటలు ఐదో స్థానంలో, 9.30 రేటింగ్ తో మగువ ఓ మగువ ఆరో స్థానంలో నిలిచాయి.

బ్రహ్మముడి తాజా రేటింగ్స్ లో 6.16తో అసలు టాప్ 10లోనూ లేకుండా పోయింది. ఇక ఇప్పటి నుంచీ టాప్ ప్లేస్ కోసం పోటీ కార్తీకదీపం 2, ఇల్లు ఇల్లాలు పిల్లలు మధ్య ఉండనున్నట్లు తాజా రేటింగ్స్ చూస్తే తెలుస్తోంది.

జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే.. మేఘ సందేశం 8.13 రేటింగ్ తో టాప్ లో ఉంది. ఓవరాల్ గా తెలుగు టీవీ సీరియల్స్ లో ఏడో స్థానం సొంతం చేసుకుంది.

ఆ తర్వాత 7.59తో నిండు నూరేళ్ల సావాసం, 7.30తో పడమటి సంధ్యారాగం, 6.48తో త్రినయని, 6.2తో జగద్ధాత్రి సీరియల్స్ ఉన్నాయి. ఈసారి కూడా జీ తెలుగు సీరియల్స్ టాప్ 6లో చోటు దక్కించుకోలేకపోయాయి.

ఈటీవీ, జెమిని సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

ఈటీవీ విషయానికి వస్తే 46వ వారానికి 3.36 రేటింగ్ తో మనసంతా నువ్వే టాప్ లో కొనసాగుతోంది. ఇక 3.28తో రంగుల రాట్నం, 2.73తో బొమ్మరిల్లు, 2.47తో రావోయి చందమామ, 2.09తో శతమానం భవతి సీరియల్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

జెమిని సీరియల్స్ చూస్తే.. శ్రీమద్ రామాయణం 1.42తో టాప్ లో ఉంది. కొత్తగా రెక్కలొచ్చెనా సీరియల్ కు 1.28 రేటింగ్ వచ్చింది. ఆ తర్వాత 0.95తో భైరవి, 0.94తో సివంగి, 0.89తో నువ్వే కావాలి లాంటి సీరియల్స్ ఉన్నాయి. తెలుగు టీవీ సీరియల్స్ కు సంబంధించి 46వ వారం టీఆర్పీల్లో మాత్రం కచ్చితంగా బ్రహ్మముడి టాప్ 10లో నుంచి వెళ్లిపోవడం, కార్తీకదీపం 2 టాప్ సీరియల్ గా మారడమే విశేషంగా చెప్పొచ్చు.

Whats_app_banner