OTT Thriller Movie: ఓటీటీలోకి నేరుగా వస్తున్న థ్రిల్లర్ మూవీ.. ఇంట్రెస్టింగా టీజర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
OTT Thriller Movie: ఓటీటీలోకి ఇప్పుడో థ్రిల్లర్ మూవీ నేరుగా వచ్చేస్తోంది. తాజాగా గురువారం (నవంబర్ 21) టీజర్ రిలీజ్ కాగా.. స్ట్రీమింగ్ తేదీని కూడా జీ5 ఓటీటీ అనౌన్స్ చేసింది. ఓ జర్నలిస్ట్ చుట్టూ తిరిగే కథ ఇది.
OTT Thriller Movie: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. థియేటర్ రిలీజ్ కాకుండా ఈ సినిమాను నేరుగా డిజిటల్ ప్రీమియర్ చేస్తుండటం విశేషం. కొన్నాళ్ల కిందట ఈ మూవీని అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ.. తాజాగా గురువారం (నవంబర్ 21) టీజర్ రిలీజ్ చేసింది. నిజం తెలుసుకోవడానికి ప్రాణాలను పణంగా పెట్టే ఓ జర్నలిస్టు స్టోరీతో వస్తున్న మూవీ డిస్పాచ్ (Despatch).
డిస్పాచ్ ఓటీటీ రిలీజ్ డేట్
జీ5 ఓటీటీ ఒరిజినల్ మూవీగా తెరకెక్కిన డిస్పాచ్ డిసెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తన ఎక్స్ అకౌంట్ ద్వారా సదరు ఓటీటీ వెల్లడించింది. బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయీ నటించిన ఈ సినిమా.. ఎంతో ఆసక్తి రేపుతోంది.
"హెడ్‌లైన్స్ ప్రపంచంలో అతడు నిజం కోసం వెతుకుతున్నాడు. డిస్పాచ్ డిసెంబర్ 13 నుంచి జీ5లో ప్రీమియర్ కానుంది. టీజర్ ఇప్పుడు వచ్చేసింది" అని జీ5 ఓటీటీ ట్వీట్ చేసింది.
డిస్పాచ్ టీజర్ ఎలా ఉందంటే..
డిస్పాచ్ మూవీ టీజర్ ఇంట్రెస్టింగా ఉంది. ఏకంగా రూ.8 వేల కోట్ల స్కామ్ ను వెలికితీసేందుకు ప్రయత్నించే జర్నలిస్టు.. ఈ క్రమంలో ఎదుర్కొనే సవాళ్లు, బెదిరింపులు, దాడులను ఈ టీజర్ లో చూడొచ్చు. ఈ డిస్పాచ్ మూవీలో మనోజ్ బాజ్‌పేయీ ఆ జర్నలిస్టు పాత్రలో నటించాడు.
టీజర్ మొదట్లోనే అతని ఇంటి అద్దాలను చీల్చుకుంటూ ఓ రాయి అతని ఇంట్లో పడుతుంది. ఆ వెంటనే ఓ బెదిరింపు కాల్ వస్తుంది. ఇప్పటికైనా ఆపకపోతే నెక్ట్స్ టైమ్ బుల్లెట్ దిగుతుంది అని అవతలి వ్యక్తి బెదిరిస్తాడు. అసలు ఆ స్కామ్ వెనుక ఉన్నది ఎవరు? అసలు నిజం ఏంటి?
ఈ క్రమంలో తనకు ఎదురైన ఈ సవాళ్లను ఆ జర్నలిస్టు ఎలా ఎదుర్కొంటాడు? చివరికి ఆ నిజాన్ని బయటపెడతాడా లేదా అన్నది ఈ డిస్పాచ్ మూవీలో చూడొచ్చు. తనదైన రీతిలో జర్నలిస్ట్ పాత్రలోనూ మనోజ్ బాజ్‌పేయీ ఒదిగిపోయినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ థ్రిల్లర్ మూవీ డిస్పాచ్ డిసెంబర్ 13 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.