Amaran OTT Release Date: అమరన్ ఓటీటీ రైట్స్ ధర తెలుసా? స్ట్రీమింగ్ తేదీపై కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్ క్లారిటీ
Amaran Movie: అమరన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఎట్టకేలకి క్లారిటీ వచ్చేసింది. భారీ ధరకి కొనుగోలు చేసిన ఓటీటీ ప్లాట్‌ఫామ్.. అందరూ ఊహించనట్లు కాకుండా కొత్త తేదీలని లాక్ చేసింది.
దీపావళి సెన్సేషన్ అమరన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఎట్టకేలకి క్లారిటీ వచ్చేసింది. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ అమరన్ మూవీ.. అక్టోబరు 31న దీపావళి కానుకగా విడుదలై ఇప్పటికే రూ.300 కోట్ల వరకూ వసూళ్లని రాబట్టింది. తొలి రోజు నుంచే పాజిటివ్ మౌత్ టాక్‌తో దూసుకెళ్లిన ఈ సినిమా.. ఇప్పటికే తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో రన్ అవుతోంది.
ఫ్యాన్సీ ధరకి అమరన్ ఓటీటీ రైట్స్
థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన అమరన్ మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఓ మంచి ఫ్యాన్సీ ధరకి కొనుగోలు చేసింది. కానీ.. ఆ ధరపై గత కొన్ని రోజుల నుంచి గోప్యత పాటిస్తూ వచ్చింది. అయితే.. తాజాగా అమరన్ మూవీని నెట్‌ఫ్లిక్స్ రూ.60 కోట్లకి కొనుగోలు చేసినట్లు బయటికి వచ్చింది. అమరన్ సినిమాని కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మించిన విషయం తెలిసిందే.
తమిళనాడులోనే రూ.150 కోట్లు
అమరన్ మూవీకి వచ్చిన కలెక్షన్లలో ఒక్క తమిళనాడు నుంచే రూ.150 కోట్లు వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. అలానే తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా వసూళ్లని రాబట్టిన ఈ సినిమా.. కన్నడ, మలయాళంలో మాత్రం ఆశించిన మేర వసూళ్లని రాబట్టలేకపోయింది. తెలుగులో సుదీర్ఘకాలంగా నటిస్తున్న సాయి పల్లవికి ఇక్కడ మంచి క్రేజ్ ఉండగా.. శివ కార్తికేయన్‌కి కూడా ఈ అమరన్ మూవీతో ఫాలోయింగ్ భారీగా పెరిగింది.
రూ.300 కోట్ల క్లబ్‌లో అమరన్
తమిళంలో ఇటీవల జైలర్, లియో, గోట్ సినిమాలు రూ.300 కోట్ల క్లబ్‌లో చేరగా.. అమరన్ కూడా తాజాగా ఆ జాబితాలో చేరిపోయింది. శివ కార్తికేయన్ సుదీర్ఘ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా ఇదే కావడం గమనార్హం.
ఓటీటీలోకి అమరన్ ఎప్పుడు రానుందంటే?
అమరన్ మూవీని నెట్‌ప్లిక్స్ డిసెంబరు 5 లేదా డిసెంబరు 11న స్ట్రీమింగ్‌కి ఉంచేందుకు సిద్ధమవుతోంది. వాస్తవానికి నవంబరు చివర్లో ఈ సినిమా స్ట్రీమింగ్‌కి వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ.. నెట్‌ఫ్లిక్స్ మాత్రం పై రెండు తేదీల్లో ఒకదాన్ని లాక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.