Drug Alcohol Addict Celebrities: డ్రగ్స్, మద్యానికి బానిసలైన హీరో హీరోయిన్స్ వీళ్లే! ఓ సింగర్ కూడా! ఎవరెవరో తెలుసా?-bollywood celebrities who were drugs and alcohol addict sanjay dutt to manisha koirala drug addict actors actress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Drug Alcohol Addict Celebrities: డ్రగ్స్, మద్యానికి బానిసలైన హీరో హీరోయిన్స్ వీళ్లే! ఓ సింగర్ కూడా! ఎవరెవరో తెలుసా?

Drug Alcohol Addict Celebrities: డ్రగ్స్, మద్యానికి బానిసలైన హీరో హీరోయిన్స్ వీళ్లే! ఓ సింగర్ కూడా! ఎవరెవరో తెలుసా?

Published Dec 06, 2024 04:13 PM IST Sanjiv Kumar
Published Dec 06, 2024 04:13 PM IST

  • Drug And Alcohol Addicted Celebrities: డ్రగ్స్, ఆల్కహాల్‌కు బానిసలు అయిన వాళ్లలో చాలా పాపులర్ సెలబ్రిటీలు ఉన్నారు. వారిలో స్టార్ హీరో హీరోయిన్స్ కూడా ఉండటం ఆలోచించాల్సిన విషయం. అయితే, డ్రగ్స్, మద్యానికి బానిస అయిన హీరో హీరోయిన్స్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బాలీవుడ్ తారలు తరచుగా మద్యం, మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తుంటాయి. కొన్నిసార్లు ఈ వార్తలు నిజం అవుతుంటాయి. అయితే, కొన్నిసార్లు అవి కేవలం పుకార్లుగా మాత్రమే మిగిలిపోతాయి. ఈ నేపథ్యంలో ఆల్కహాల్, మాదకద్రవ్యాలకు నిజంగా బానిసలైన హీరో హీరోయిన్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

(1 / 8)

సంజయ్ దత్ తరచూ మాదకద్రవ్యాలు, మద్యానికి బానిసై ఉంటాడని చెబుతుంటారు. సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'సంజు' సినిమాలో సంజయ్ దత్ డ్రగ్స్‌కు అలవాటు పడిన విధానాన్ని చూపించారు. అందులో సంజయ్ దత్ తన డ్రగ్స్ వ్యసనాన్ని జయించడానికి పునరావాసానికి వెళ్లినట్లు చూపించిన విషయం తెలిసిందే. 

(2 / 8)

భారతీయుడు సినిమాతో తెలుగులో పాపులర్ అయిన మనీషా కొయిరాల క్యాన్సర్ ను జయించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. అయితే ఒకప్పుడు ఆమె మద్యానికి బానిస అయ్యారట. మీడియా కథనాల ప్రకారం మనీషా తన పుస్తకంలో ఆల్కహాల్ వ్యసనం గురించి రాసుకొచ్చారు. ఆల్కహాల్ తన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అందులో వివరించారట.

(3 / 8)

బాలీవుడ్ నటుడు ఫర్దీన్ ఖాన్ భారతదేశంలో నిషేధిత మాదకద్రవ్యాలతో వార్తల్లో నిలిచాడు. ఫర్దీన్ ఖాన్ దగ్గర ఉన్న మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న తరువాత అరెస్టు అయ్యాడు. మీడియా నివేదికల ప్రకారం, ఫర్దీన్ ఖాన్ 2001 లో మాదకద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడటానికి పునరావాసానికి వెళ్లాల్సి వచ్చిందట. 

(4 / 8)

ర్యాపర్, సింగర్ హనీ సింగ్ బాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు డ్రగ్స్, ఆల్కహాల్‌కు హనీ సింగ్ బానిసయ్యాడని సమాచారం. హనీ సింగ్ కొంతకాలంగా మీడియాకు, సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడేందుకు హనీ సింగ్ రీహాబిలిటేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు బాలీవుడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.

(5 / 8)

కమెడియన్, నటుడు కపిల్ శర్మ తన కామెడీతో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అయితే కెరీర్ సక్సెస్ పీక్స్‌లో ఉన్నప్పుడు మద్యానికి బానిస అయ్యాడట. ఆ ప్రభావం అతని కెరీర్‌పై కూడా చూపించిందని సమాచారం. కపిల్ మద్యం వ్యసనం నుంచి బయటపడేందుకు రిహాబిలిటేషన్‌లో కొంతకాలం గడిపినట్లు పలు మీడియా సంస్థలు తెలిపాయి. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కామెడీ షోతో మళ్లీ తన కామెడీతో ఆకట్టుకుంటున్నాడు కపిల్ శర్మ. 

(6 / 8)

గత 15 ఏళ్లుగా తాను మద్యానికి బానిసయ్యానని, తన కెరీర్ కూడా మద్యానికి బానిసైందని ప్రముఖ నటుడు ధర్మేంద్ర 2012లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పి ఒప్పుకున్నారు. 

(7 / 8)

నటుడు, రచయిత జావేద్ అక్తర్ ఒక ఇంటర్వ్యూలో తన మద్య వ్యసనం గురించి చెప్పారు. “ప్రజలు తరచుగా దేనికీ చింతించరని చెబుతారు, కానీ నేను చాలా విషయాలకు చింతిస్తున్నాను. నేను నా జీవితంలో 10 సంవత్సరాలు తాగుతూ గడిపాను. ఆ సంవత్సరాలు నేను ఏదైనా మంచి పని చేసి ఉంటే బాగుండేది” అన్న అర్థంలో జావేద్ అక్తర్ తెలిపారు. 

(8 / 8)

ఇతర గ్యాలరీలు