Pushpa 2 All Time Record: బాలీవుడ్ అడ్డాలో పుష్ప 2 ఆల్‍టైమ్ రికార్డు.. టాప్ ప్లేస్‍కు దూసుకెళ్లిన అల్లు అర్జున్ మూవీ
Pushpa 2 Bollywood All Time Record: బాలీవుడ్‍లో పుష్ప 2 సినిమా ఆల్‍టైమ్ రికార్డు సృష్టించింది. హిందీ సినిమాలన్నింటినీ వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ దక్కించుకుంది. హిందీ నెట్ కలెక్షన్లలో స్త్రీ 2ను 15 రోజుల్లోనే దాటేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ చిత్రం రికార్డుల వేటు కొనసాగిస్తూనే ఉంది. డిసెంబర్ 5న థియేటర్లలో భారీ అంచనాలతో రిలీజైన ఈ యాక్షన్ మూవీ ఆరంభం నుంచి అదిరిపోయే వసూళ్లతో దుమ్మురేపుతోంది. నాన్‍స్టాప్‍గా రికార్డులను చెరిపేస్తూనే ఉంది. ఇప్పటికే అత్యంత వేగంగా రూ.1,500 కోట్ల కలెక్షన్లు దక్కించుకున్న భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. తాజాగా బాలీవుడ్ అడ్డాలో ఆల్‍టైమ్ రికార్డును పుష్ప 2 క్రియేట్ చేసింది. హిందీ గడ్డపై ఈ మూవీ అగ్రస్థానంలో నిలిచింది.
ఆల్‍టైమ్ రికార్డు ఇదే
పుష్ప 2 చిత్రం 15వ రోజు హిందీ వెర్షన్‍లో రూ.14కోట్ల నెట్ కలెక్షన్లు దక్కించుకుంది. దీంతో హిందీ నెట్ కలెక్షన్లు రూ.632.5 కోట్లకు చేరాయి. దీంతో హిందీలో అత్యధిక కలెక్షన్లు దక్కించుకున్న చిత్రంగా పుష్ప 2 రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు టాప్‍లో ఉన్న స్త్రీ 2 (రూ.627.50కోట్లు)ను వెనక్కి నెట్టి హిందీలో అత్యధిక నెట్ కలెక్షన్లు దక్కించుకున్న మూవీగా పుష్ప 2 నిలిచింది.
15 రోజుల్లోనే స్త్రీ 2 సినిమా లైఫ్‍టైమ్ నెట్ కలెక్షన్లను పుష్ప 2 దాటేసింది. డబ్బింగ్ మూవీగా అడుగుపెట్టి బాలీవుడ్‍లో ఉన్న చాలా రికార్డులన్నింటినీ ఈ చిత్రం తుడిచిపెట్టేసింది. ఇప్పుడు ఏకంగా హిందీలో ఆల్‍టైమ్ రికార్డు సాధించింది. హిందీ చిత్రాలన్నింటినీ వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని పుష్పరాజ్ అధిష్టించాడు.
ఈ ఘనత దక్కించుకునే తొలి మూవీగా..
పుష్ప 2 చిత్రానికి ఇంకా హిందీలో జోరుగా వసూళ్లు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో హిందీ నెట్ కలెక్షన్లు రూ.700కోట్లకు చేరడం పక్కాగా కనిపిస్తోంది. దీంతో హిందీలో ఈ మార్క్ సాధించే తొలి చిత్రంగా పుష్ప 2 చరిత్ర సృష్టించనుంది. ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ హీరోకు సాధ్యం కానీ రికార్డును.. వారి అడ్డాలో తెలుగు స్టార్ అల్లు అర్జున్ సాధించనున్నారు.
రూ.1,500 కోట్ల మార్క్ దాటి..
పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,500 గ్రాస్ కలెక్షన్లను దాటేసింది. అత్యంత వేగంగా ఈ మార్క్ చేరిన ఇండియన్ మూవీగా చరిత్ర సృష్టించింది. ఇప్పటికే చాలా రికార్డులను ఈ మూవీ తన ఖాతాలో వేసుకుంది. ఇంకా దూకుడుగా వసూళ్లు వస్తుండటంతో మరిన్ని రికార్డులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు, హిందీతో పాటు రిలీజైన అన్ని భాషల్లో పుష్ప 2 హవా చూపిస్తోంది. ఉత్తరాదిలో ఫుల్ క్రేజ్ మధ్య వచ్చిన ఈ చిత్రం అంతకు మించిన వసూళ్లతో దుమ్మురేపుతోంది.
పుష్ప 2 చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. పుష్పకు మూడేళ్ల తర్వాత ఫుల్ క్రేజ్‍తో వచ్చిన ఈ సీక్వెల్ అంతకు మించి బ్లాక్‍బస్టర్ కొట్టింది. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపారు. పుష్ప 2లో రష్మిక మందన్నా కూడా మరింత మెప్పించారు. ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, జగదీశ్ ప్రతాప్ భండారీ, అనసూయ, సునీల్ ఈ మూవీలో కీరోల్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు.
సంబంధిత కథనం