Aishwarya Abhishek : ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకుల రూమర్స్‌కి ఒక్క వీడియోతో చెక్ చెప్పిన జంట
Aishwarya Abhishek divorce rumours: అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకుల రూమర్స్‌పై పూర్తిగా చెక్ పడినట్లు అయ్యింది. గత కొంతకాలంగా కనీసం కలిసి కనిపించని ఈ జంట..
బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకుల రూమర్స్‌కి పూర్తి స్థాయిలో ఈ జంట చెక్ చెప్పేసింది. గత కొంతకాలంగా ఐశ్వర్య, అభిషేక్ విడిపోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి విడిగా ఉంటోందని.. అభిషేక్ మాత్రం తన తల్లిదండ్రులు అమితాబ్, జయా బచ్చన్‌తో కలిసి ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ కలిసి కనిపించి కూడా చాలా రోజులైపోయింది. ఇటీవల అనంత్ అంబానీ వెడ్డింగ్ ఈవెంట్‌కు కూడా ఈ జంట విడివిడిగానే రావడంతో.. విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలకి బలం చేకూరింది.
ఐశ్వర్య రాయ్, అభిషేక్ విడాకుల రూమర్స్‌పై తొలుత అమితాబ్ స్పందిస్తూ.. ఆ వార్తల్ని కొట్టిపారేశాడు. ఆ తర్వాత అభిషేక్‌కి ఓ ఇంటర్వ్యూలో విడాకుల ప్రశ్న ఎదురవగా.. ఎమోషనల్ అయిపోయిన అభిషేక్ తన వెడ్డింగ్ రింగ్‌ను చూపించి మేము ఇప్పటికీ వివాహ బంధంలోనే ఉన్నానని చెప్పుకొచ్చాడు.
ముంబై ధీరూభాయ్ అంబానీ స్కూల్‌లో ఆరాధ్య చదువుతుండగా.. స్కూల్ ఫంక్షన్‌కి ఐశ్వర్య, అభిషేక్ జంటగా తాజాగా హాజరయ్యారు. అమితాబ్ బచ్చన్ కూడా ఈ ఈవెంట్‌కి హాజరవగా.. ముగ్గురూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. అలానే ఒకే కారులో ఐశ్వర్య, అభిషేక్ ఇం వెళ్లడం కనిపించింది. దాంతో విడాకుల రూమర్‌కి పూర్తిగా చెక్ పడినట్లు అయ్యింది.
2007లో ఐశ్వర్య, అభిషేక్ వివాహం చేసుకోగా.. దశాబ్దన్నరగా బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ కపుల్స్‌లో ఈ జంట టాప్‌లో నిలుస్తూ వచ్చింది. కానీ.. గత ఏడాదన్నరగా ఇద్దరూ కలిసి కనిపించకపోవడం.. ఒకే ఈవెంట్‌కి వేర్వేరుగా ఇద్దరూ రావడం.. పోవడంతో విడాకుల రూమర్స్ తెరపైకి వచ్చాయి. అలానే సోషల్ మీడియాలోనూ ఇద్దరూ తమ వ్యక్తిగత ఫొటోల్ని మాత్రమే షేర్ చేసుకుంటూ రాగా.. ఓ విడాకుల పోస్టుకి అభిషేక్ బచ్చన్ లైక్ కూడా కొట్టాడు. అయితే.. మనస్పర్థలు తొలగి.. ఇప్పుడు మళ్లీ జంట కలిసిపోయినట్లు తెలుస్తోంది.