చుండ్రు సమస్య ఉంటే అలోవెరా వాడితే మంచి ప్రయోజనాలుంటాయి. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో కూడిన సహజమైన మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. చుండ్రు సమస్య తగ్గుతుంది.
image credit to unsplash
వేప పొడి, ఉసిరిని ఉపయోగించి పేస్ట్‌ను తయారు చేసుకోండి. ఇందులో యాంటీమైక్రోబయల్ లక్షణాలుంటాయి. ఇవి చుండ్రును ఎదుర్కోవడానికి అనువైనవి.
image credit to unsplash
మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి, వాటిని పేస్ట్‌లా చేసి మీ తలకు పట్టించాలి. ఈ పేస్ట్ పొడి దురదను తగ్గిస్తుంది. తద్వారా చుండ్రు సమస్యలను తగ్గిస్తుంది.
image credit to unsplash
చుండ్రు సమస్యను తొలగించడంలో నిమ్మరసం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మరసాన్ని కొబ్బరి నూనెలో లేదా ఆవాల నూనెలో కలిపి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
image credit to unsplash
పెరుగుతో చుండ్రు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. జుట్టు నుంచి చుండ్రును తొలగించడానికి పెరుగు ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది.
image credit to unsplash
చుండ్రు సమస్యను తగ్గించడానికి ఆవనూనె కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో గోరింటాకు, మెంతుల్ని కలిపి వాడితే మరిన్ని ప్రయోజనాలుంటాయి.
image credit to unsplash
కొబ్బరి నూనెతో కూడా చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు. లిక్విడ్‌గా తయారయ్యేవరకు కొబ్బరినూనెను వేడి చేయాలి. తర్వాత జుట్టుకు రాసుకుని షాంపుతో జుట్టును వాష్ చేసుకోవాలి. మంచి ఫలితం ఉంటుంది.