Goa Destination Wedding: గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారా? ఎంత ఖర్చవుతుందో తెలుసుకోండి
Goa Destination Wedding: పెళ్లిల్ల సీజన్ వచ్చేస్తోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకునే వారిలో చాలా మంది ఎంచుకునే ప్లేస్ గోవా? గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని మీరూ ప్లాన్ చేస్తున్నారా..? అక్కడ ఎన్ని ప్రదేశాలున్నాయి, ఎంత ఖర్చు అవుతుంది వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.
(1 / 8)
సముద్ర తీరంలో అందమైన అలల శబ్దాల మధ్య మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఎంత బావుంటుంది. ఆ ఊహే చాలా బాగుంది కదా. అందుకే ఈ మధ్య చాలా మంది డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా గోవాలోని బీచ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనేది చాలా మంది కల. వచ్చేది పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలా మంది తమ పెళ్లిని గోవాలో ప్లాన్ చేసుకుంటున్నారు.
(freepik)(2 / 8)
గోవా బీచ్ లో ఉన్న అందమైన ప్రదేశాలని, చుట్టూ ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా కనిపించే వాతావరణంలో జరుపుకునే మీ వివాహం మీతో పాటు అతిథులకు కూడా నిజంగా చిరస్మరణీయంగా ఉంటుంది. మీరు కూడా గోవా బీచ్ లో మీ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తుంటే, బడ్జెట్ తెలుసుకోవాలనుకుంటే, ఈ వ్యాసం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఈ కథనంలో, మీరు మీ వివాహానికి సిద్ధం కావడానికి గోవా లాంటి బీచ్‌లు, ఆ వేదికలయ్యే జరిగే వివాహ ఖర్చుల గురించి చర్చించుకోబోతున్నాం.
(3 / 8)
మీరు గోవా బీచ్ రిసార్ట్ లో పెళ్లి చేసుకునేందుకు 2 రాత్రులు, 3 పగళ్లు బుక్ చేసుకోవచ్చు. మీరు పీక్ సీజన్ లో వివాహం కోసం ఇక్కడకు వెళుతుంటే, 4-స్టార్ హోటల్ లో రేట్లు సుమారు డబుల్ షేరింగ్ రూ .18,000 + నుండి ప్రారంభమవుతాయి.
(4 / 8)
ఆఫ్ సీజన్ లో రూమ్ బుక్ చేసుకుంటే ఒక్కో రూమ్ కోసం రూ.15,000+ చెల్లించాల్సి ఉంటుంది. పీక్ సీజన్ లో లంచ్, డిన్నర్ తో సహా ఒక హోటల్ లో 200 మంది అతిథులు బస చేయడానికి సుమారు రూ.36 లక్షల వరకూ ఖర్చవుతుంది.
(5 / 8)
గోవా బీచ్ లలో వెడ్డింగ్ డెకరేషన్స్ కోసం రూ.5-8 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీ ఎంపికను బట్టి ఖర్చు ఉంటుంది. డెకరేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయకపోతే ఖర్చు కూడా అంతగా ఉండదు మరి. మీ వెడ్డింగ్ ప్లానర్ నుండి అలంకరణలను ఖర్చును బట్టి ఎంచుకోవడం ద్వారా మీరు తక్కువలో పెళ్లిని ముగించేయొచ్చు కూడా.
(6 / 8)
మీరు గోవా బీచ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తుంటే, ముందుగా దాని కోసం ప్రత్యేకమైన లైసెన్స్ పొందాలి, ఇది వివాహానంతర భద్రత, బీచ్ క్లీనింగ్ కు బాధ్యత వహిస్తుంది.
(7 / 8)
మీ వెడ్డింగ్ ప్లానర్ ఈ విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, కానీ మీరు లైసెన్స్ కూడా పొందాల్సి ఉంటుంది. వెడ్డింగ్ ప్లానర్ దగ్గర లైసెన్స్ ఉందో లేదో మీరే చెక్ చేసుకుని, లేకపోతే తీసుకోవాలని సూచించండి. భవిష్యత్ లో ఇబ్బందులు కలగకుండా అతనిని సిద్ధం చేయండి.
ఇతర గ్యాలరీలు