TG Politics Year Review 2024 : తెలంగాణ పొలిటికల్ రివ్యూ - ఈ ఏడాదిలో జరిగిన కీలక సంఘటనలు-year review 2024 key changes in telangana politics top points check kere ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Politics Year Review 2024 : తెలంగాణ పొలిటికల్ రివ్యూ - ఈ ఏడాదిలో జరిగిన కీలక సంఘటనలు

TG Politics Year Review 2024 : తెలంగాణ పొలిటికల్ రివ్యూ - ఈ ఏడాదిలో జరిగిన కీలక సంఘటనలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 20, 2024 05:23 PM IST

ఈ ఏడాదిలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉండగా.. పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది.

తెలంగాణ పాలిటిక్స్ - 2024లో జరిగిన పరిణామాలు
తెలంగాణ పాలిటిక్స్ - 2024లో జరిగిన పరిణామాలు

తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఈ ఏడాది కాలంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతేడాది డిసెంబర్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో… ఇక్వేషన్స్ పూర్తిగా మారిపోయాయి. అప్పటివరకు తిరుగులేని శక్తిగా ఉన్న బీఆర్ఎస్… అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయింది. మరోవైపు బీజేపీ.. 8 సీట్లు సాధించి సత్తా చాటించింది. ఈ ఇయర్ లో జరిగిన సంఘటనలపై ఓ లుక్కేద్దాం….!

  • 2023 డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. 39 స్థానాలు సాధించిన బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక బీజేపీ పార్టీ ఎనిమిది ఎమ్మెల్యేల స్థానాల్లో పాగా వేసింది.
  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్ట్ దేశ రాజకీయాల్లో పెనుసంచలనం అయ్యింది. ఢిల్లీ మద్యం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. అనంతరం సీబీఐ సైతం కవితను అరెస్టు చేసింది. సుమారు 165 రోజుల పాటు తీహాడ్ జైలులో ఉన్న కవిత సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది.
  • వైఎస్ షర్మిల తన రాజకీయాలను తెలంగాణ నుంచి ఏపీకి షిఫ్ట్ చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యారు.
  • 39 స్థానాలు గెలిచి ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
  • ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, గద్వాల్ ఎమ్మెల్యే క్రిష్ణ మోహన్ రెడ్డి, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేరి లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు. వీరు కాకుండా శాసన మండలి సభ్యులు (ఎమ్మెల్సీలు) భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యెగ్గె మల్లేషం, బొగ్గారపు దయానంద్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
  • బీఆర్ఎస్ పార్టీ తరపున సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి గెలిచిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ తర్వాత ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.
  • 2024 లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ 8, బీజేపీ 8, ఎంఐఎం 1 ఎంపీ సీటు కైవసం చేసుకున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. పలుచోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది.
  • జులైలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు విపక్ష నాయకుడిగా కేసీఆర్ హాజరయ్యారు. ప్రతిపక్ష నేతగా సభకు హాజరైనప్పటికీ… సభలో మాట్లాడలేదు. శాసనసభ ప్రాంగణంలో మాట్లాడుతూ… ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
  • విభజన అంశాలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.
  • సెప్టెంబర్‌ 17ను ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’ జరపాలని తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏడాది పాలన సందర్భంగా ప్రజాపాలన-విజయోత్సవాలను నిర్వహించింది. ఇందులో భాగంగా.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ ఏడాదిలోనే రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణను గుర్తించారు. ఈ పాటను అందెశ్రీ రాశారు. రాష్ట్ర గీతంతో పాటు విగ్రహా మార్పుపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది.
  • ఫార్ములా ఈ రేస్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఈ కేసులో ఏ1గా కేటీఆర్ పేరును ప్రస్తావించింది. త్వరలోనే ఆయన్ను విచారించే అవకాశం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం