LIVE UPDATES
Andhra Pradesh News Live December 13, 2024: YS Jagan Assets Case : జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం - సుప్రీంకోర్టుకు సీబీఐ, ఈడీ నివేదిక
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 13 Dec 202404:47 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: YS Jagan Assets Case : జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం - సుప్రీంకోర్టుకు సీబీఐ, ఈడీ నివేదిక
- వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో వివరాలతో కూడిన నివేదికను సీబీఐ, ఈడీ… సుప్రీంకోర్టుకు అందజేశాయి. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత.. తీర్పు ఇవ్వనుంది. అక్రమాస్తుల కేసు బదిలీ, బెయిల్ రద్దు పిటిషన్లపై తదుపరి విచారణను జనవరి 10కి వాయిదా వేసింది.
Fri, 13 Dec 202401:47 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Swarnandhra 2047 : ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చేందుకే.. స్వర్ణాంధ్ర-2047 : సీఎం చంద్రబాబు
- Swarnandhra 2047 : ఆంధ్రప్రదేశ్ దశ దిశను మార్చేలా స్వర్ణాంధ్ర – 2047 విజన్‌ను ఆవిష్కరించామని.. ప్రపంచంలోని తెలుగు జాతిని ఉన్నత స్థానంలో నిలపడమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీనికి స్వర్ణాంధ్ర-2047 విజన్‌తో బీజం పడిందని వివరించారు.
Fri, 13 Dec 202412:47 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: APSRTC : మహా శివరాత్రికి రాజమండ్రి నుంచి కాశీ యాత్ర.. ఏపీఎస్ఆర్టీసీ ప్యాకేజీ ఇదే
- APSRTC : ఆర్టీసీ నిత్యం కొత్త సర్వీసులను అందుబాటులో తెస్తుంది. డిమాండ్‌ను బట్టి, ప్రయాణికులు, యాత్రీకులు అత్యధికంగా వెళ్లే మార్గాలకు అతితక్కువ ధరకు, సురక్షితమైన ప్రయాణాన్ని ఆర్టీసీ అందిస్తుంది. అందులో భాగంగానే ఉత్తప్రదేశ్‌లోని కాశీ, అయోధ్యకి ఈ బస్సు సర్వీస్‌లు అందుబాటులోకి తెచ్చింది.
Fri, 13 Dec 202412:23 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Jagan Reaction on Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్టు.. వైఎస్ జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వైసీపీ మద్దతు
- Jagan Comments on Allu Arjun Arrest : సంథ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. చంచల్‌గూడ జైలుకు అల్లు అర్జున్‌ను తరలించారు. అయితే.. బన్నీ అరెస్టును ప్రముఖులు ఖండిస్తున్నారు. తాజాగా వైఎస్ జగన్ అల్లు అర్జున్‌కు అండగా నిలిచారు.
Fri, 13 Dec 202409:41 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TG Weather ALERT : 3 రోజుల్లో మరో 'అల్పపీడనం' - ఏపీకి మరోసారి వర్ష సూచన..!
- AP Telangana Weather Updates : డిసెంబర్ 14వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తదుపరి 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీలో మరికొన్నిరోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Fri, 13 Dec 202409:18 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Outsourcing Jobs : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి
- AP Outsourcing Jobs : కృష్ణా జిల్లాలోని వైద్య, ఆరోగ కార్యాలయంలో జిల్లా ఆరోగ్య సంస్థలు, నేషనల్ హెల్త్ మిషన్ కింద ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు చేసేందుకు జిల్లా ఆరోగ్య సంస్థ పోస్టులకు డిసెంబర్ 16న, ఎన్‌హెచ్ఎం పోస్టులకు డిసెంబర్ 17న ఆఖరు తేదీగా నిర్ణయించారు.
Fri, 13 Dec 202408:11 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Pushpa In Police Station: బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వరా..అల్లు అర్జున్ అసహనం..శుక్రవారం పోలీస్ పిలుపులో ఆంతర్యం?
- Pushpa In Police Station: వైల్డ్ ఫైర్ పుష్పను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్న పోలీసులు నేరుగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అల్లు అర్జున్ షాక్‌కు గురయ్యారు. పోలీసుల తీరుపై బన్నీ అసహనం వ్యక్తం చేశారు.
Fri, 13 Dec 202406:47 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Jamili Elections Impact on AP : జమిలికి జై.. జోష్‌లో వైసీపీ.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
- Jamili Elections Impact on AP : దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. తాజాగా ఒకే దేశం.. ఒకే ఎన్నికకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది.
Fri, 13 Dec 202405:20 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP New EV policy: ఏపీలో కొత్త ఈవీ పాలసీ విడుదల..వాహనాలపై భారీగా రాయితీలు.. పరిశ్రమలకు ప్రోత్సహకాలు..
- AP New EV policy: ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఊపు తెచ్చేలా కొత్త ఈవీ పాలసీను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేలా రాయితీలు ప్రకటించారు. కొనుగోలు దారులతో పాటు ఉత్పత్తిదారులకు కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలో రాయితీలు కల్పించారు.
Fri, 13 Dec 202404:36 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Tomato Price Drop: ఒక్కసారిగా పడిపోయిన టమాటా, మిర్చి ధరలు, చెత్తలో పారబోస్తున్న రైతులు
- Tomato Price Drop: నిన్న మొన్నటి వరకు చుక్కల్ని తాకిన టమాటా, మిర్చి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. సెప్టెంబర్, అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని ధరలు అమాంతం పెరిగితే ఇప్పుడు కొనేవాళ్లు లేక పారబోయాల్సి వస్తోంది.
Fri, 13 Dec 202403:59 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Anantapur Tragedy : అనంతపురం జిల్లాలో విషాదం.. భర్త వేధింపులు.. భార్య, కుమారుడు మృతి
- Anantapur Tragedy : అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్త వేధింపులు తాళలేక భార్య సహా ఇద్దరు పిల్లలు ఆత్మహత్యకు యత్నించారు. ఇందులో భార్య, కుమారుడు మృతి చెందగా.. కుమార్తె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. భర్తపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Fri, 13 Dec 202403:42 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Vijayawada traffic Alert: నేడు విజయవాడలో వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ ఆంక్షలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
- Vijayawada traffic Alert: విజయవాడలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో నగరం అంతట ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
Fri, 13 Dec 202401:26 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Constable Recruitment: ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు జనవరి 30నుంచి దేహదారుఢ్య పరీక్షలు..రెండేళ్లుగా నిరీక్షణ
- AP Constable Recruitment: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. దాదాపు రెండేళ్ల తర్వాత కానిస్టేబుల్ నియామకాల్లో కదలిక వచ్చింది. జనవరి 30 నుంచి 6100కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా రాతపరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు.
Fri, 13 Dec 202412:35 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Pakistan Colony In Vijayawada: బెజవాడలో పాకిస్తాన్ కాలనీ.. అసలు రహస్యం ఇదే.. మిగతావన్నీ కట్టుకథలే…
- Pakistan Colony In Vijayawada: బెజవాడలో పాకిస్తాన్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చిలువలు పలువలుగా వార్తలు, తాము ఇబ్బందులు పడుతున్నామని స్థానికుల ఆందోళనలు, బెజవాడలో పాకిస్తాన్ పేరు ఉండటం ఏమిటనే సందేహాలు దానికి రకరకాల వివరణలు అంతు లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి.
Fri, 13 Dec 202411:30 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: PM Suryaghar: పీఎం సూర్య ఘర్ యోజన అప్టేడ్.. ఎస్సీ, ఎస్టీలకు ఏపీ సర్కారు ఉచిత ఇన్‌స్టలేషన్
- PM Suryaghar: ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచే క్రమంలో ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న పథకాల్లో సౌర విద్యుత్ పథకాన్ని అందించాలని నిర్ణయించారు. ఈ పథకంలో అయా వర్గాలకు ఉచితంగా సోలార్ ఇన్‌స్టలేషన్ చేస్తారు.