OTT Top Thriller Movies 2024: ఈ ఏడాది ఓటీటీల్లో దుమ్మురేపిన 10 థ్రిల్లర్ సినిమాలు.. భారీ వ్యూస్‍తో సత్తా
OTT Top Thriller Movies 2024: ఈ ఏడాది ఓటీటీల్లో కొన్ని థ్రిల్లర్ చిత్రాలు అదరగొట్టాయి. మంచి వ్యూస్ సాధించి దుమ్మురేపాయి. కొన్ని వారాల పాటు ట్రెండింగ్‍లో నిలిచాయి. వాటిలో టాప్-10 ఏవో ఇక్కడ చూడండి.
ఓటీటీల్లో థ్రిల్లర్ చిత్రాలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. వీటికి భారీగా వ్యూస్ దక్కుతుంటాయి. ట్విస్టులతో, సస్పెన్స్ కథనంతో సాగే ఈ జానర్ చిత్రాలకు ఆదరణ ఎక్కువగా లభిస్తుంటుంది. ఈ ఏడాది కూడా వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో కొన్ని థ్రిల్లర్ చిత్రాలు దుమ్మురేపాయి. భారీ వ్యూస్ దక్కించుకొని సూపర్ సక్సెస్ అయ్యాయి. ప్రేక్షకులకు థ్రిల్ అందించాయి. ఈ ఏడాది ఓటీటీల్లో టాప్-10 థ్రిల్లర్ చిత్రాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
మహారాజా
తమిళ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజా సినిమా థియేటర్లలో సూపర్ హిట్ అయింది. జూన్ 14న రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్ బ్లాక్‍బస్టర్ అయింది. ఈ మహారాజా సినిమా జూలై 12వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. కొన్ని వారాల పాటు టాప్‍లో కొనసాగింది. గ్లోబల్‍గానూ ట్రెండ్ అయింది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మహారాజా మూవీకి భారీ వ్యూస్ దక్కాయి. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ వరుసగా పది వారాలకు పైగా టాప్-10 ట్రెండింగ్‍లో కొనసాగింది.
సెక్టార్ 36
బాలీవుడ్ యంగ్ నటుడు విక్రాంత్ మాసే ప్రధాన పాత్ర పోషించిన సెక్టార్ 36 మూవీ సెప్టెంబర్ 13వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి నేరుగా వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆరంభం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. దీంతో భారీ వ్యూస్ సొంతమయ్యాయి. ఈ చిత్రానికి ఆదిత్య నంబల్‍కర్ దర్శకత్వం వహించారు.
కిల్
ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్ ఈ ఏడాది థియేటర్లలో మంచి హిట్ కొట్టింది. ఈ చిత్రంలో లక్ష్య, రాఘవ్ జుయల్, తాన్య లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీ సెప్టెంబర్ 6న డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మంచి హైప్ ఉండటంతో కిల్ చిత్రం ఆరంభం నుంచి భారీ వ్యూస్ దక్కించుకుంది. చాలా కాలం ట్రెండింగ్‍లో నిలిచింది.
గామి
తెలుగు అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ గామి.. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ సూపర్ సక్సెస్ అయింది. విశ్వక్‍సేన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం మార్చి 8న థియేటర్లలో రిలీజై బ్లాక్‍బస్టర్ కొట్టింది. ఏప్రిల్ 12వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సినిమాకు మొదటి నుంచి మంచి వ్యూస్ దక్కాయి. నేషనల్ వైడ్‍లో కొన్ని రోజులు టాప్‍లో ట్రెండ్ అయింది.
మంజుమ్మల్ బాయ్స్
మలయాళ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ బ్లాక్‍బస్టర్‌గా మంజుమ్మల్ బాయ్స్ నిలిచింది. రూ.200కోట్ల కలెక్షన్ల మార్క్ సాధించిన తొలి మలయాళ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సర్వైవల్ యాక్షన థ్రిల్లర్ చిత్రం ఫిబ్రవరి 22న థియేటర్లలో రిలీజైంది. మే 5వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఓటీటీలోనూ ఈ మూవీ అదరగొట్టింది. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసీ, దిలాన్ డెరిన్, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్ లీడ్ రోల్స్ చేసిన ముంజుమ్మల్ బాయ్స్ మూవీకి చిదంబరం దర్శకత్వం వహించారు.
బెర్లిన్
అపర్‌శక్తి ఖురానా, ఇష్వాక్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించిన స్పై థ్రిల్లర్ మూవీ బెర్లిన్.. ఈ ఏడాది జీ5 ఓటీటీలో దుమ్మురేపింది. ఈ చిత్రంలో సెప్టెంబర్ 13న నేరుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. బధిరుడైన గూఢచారిని విచారించడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. బెర్లిన్ మూవీకి అతుల్ సబర్వాల్ దర్శకత్వం వహించారు.
అన్వేషిప్పిన్ కండేతుమ్
మలయాళ మూవీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘అన్వేషిప్పిన్ కండేతుమ్’ కూడా ఈ ఏడాది అదరగొట్టింది. ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజై బ్లాక్‍బస్టర్ సాధించిన ఈ మూవీ.. ఓటీటీలోనూ జోరు చూపింది. మార్చి 8న మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ చిత్రం మంచి వ్యూస్ సాధించింది. ట్రెండింగ్‍లో కొన్ని వారాల పాటు కొనసాగింది.
ది గోట్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‍టైమ్ (ది గోట్) చిత్రం ఓటీటీలో దుమ్మురేపింది. థియేటర్లలో అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రం భారీ వ్యూస్ సాధించింది. ఈ మూవీ అక్టోబర్ 3న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెట్టింది.
ఫిర్ ఆయీ హసీన్ దుల్‍రుబా
విక్రాంత్ మాసే, తాప్సీ పన్ను, సన్నీ కౌశల్ ప్రధాన పాత్రలు పోషించిన ఫిర్ ఆయీ హసీన్ దుల్‍రుబా మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఆగస్టు 9న స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సీక్వెల్ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా.. వ్యూస్ మాత్రం ఎక్కువగా దక్కాయి.
ఈ ఏడాది వివిధ భాషల్లో మరిన్ని థ్రిల్లర్ చిత్రాలు కూడా వచ్చాయి. వాటిలో కొన్ని థియేటర్లు, ఓటీటీల్లో బాగానే సక్సెస్ అయ్యాయి.
సంబంధిత కథనం