OTT Action Thriller: ఓటీటీలో పది వారాలుగా టాప్-10లో ట్రెండ్ అవుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. చూడకపోతే మిస్ అవొద్దు!
Maharaja OTT Streaming: మహారాజ చిత్రం థియేటర్లలో బ్లాక్‍బస్టర్ అయింది. ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ట్రెండింగ్‍లో అదరగొడుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలో తాజాగా మరో ఫీట్ సాధించింది.
తమిళ స్టార్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేసిన మహారాజ చిత్రం భారీ హిట్ అయింది. అంచనాలకు మించి కలెక్షన్లు దక్కించుకోవడంతో పాటు ప్రశంసలను కూడా సొంతం చేసుకుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం బ్లాక్‍బస్టర్ అయింది. మహారాజ మూవీ ఈ ఏడాది జూన్ 14న థియేటర్లలో రిలీజ్ అయింది. జూలైలో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఓటీటీలో భారీ వ్యూస్‍తో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మరో ఘనత దక్కించుకుంది.
టాప్-10లో పది వారాలుగా..
మహారాజ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో జూలై 12వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆరంభం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు, తమిళం సహా హిందీ, మలయాళం, కన్నడలోనూ ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఓటీటీ రిలీజ్ తర్వాత నేషనల్ వైడ్‍లో ఈ మూవీ పాపులర్ అయింది.
మహారాజ మూవీకి ఆరంభం నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో భారీ వ్యూస్ దక్కాయి. దీంతో రెండు రోజుల్లోనే ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చింది. చాలా రోజులు తొలి స్థానంలోనే కొనసాగింది. కొన్ని ఓటీటీ రికార్డును నెలకొల్పింది. అయితే, స్ట్రీమింగ్‍కు వచ్చిన ఇన్ని రోజులైనా ఈ చిత్రం టాప్-10లోనే ట్రెండ్ అవుతోంది.
మహారాజ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్‍లో పది వారాలుగా టాప్-10లోనే ఉంటుంది. తాజాగా ఈ ఘనత దక్కించుకుంది. పదో వారంలోనూ టాప్-10లో నిలిచింది. మొత్తంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోనూ దుమ్మురేసింది.
భేష్ అనిపించే స్క్రీన్‍ప్లే
రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా మహారాజను డైరెక్టర్ నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలోని స్క్రీన్‍ప్లే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని ఉత్కంఠభరితంగా గ్రిప్పింగ్‍గా తెరకెక్కించటంతో స్వామినాథన్ సక్సెస్ అయ్యారు. ఈ ఏడాది ఒకానొక బెస్ట్ చిత్రంగా మహారాజను చాలా మంది ప్రశంసించారు. ఒకవేళ ఇంకా ఈ మూవీని చూడకపోతే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో వీక్షించండి.
మహారాజ చిత్రంలో విజయ్ సేతుపతి టైటిల్ రోల్ చేశారు. తన నటనతో మరోసారి మెప్పించారు. అనురాగ్ కశ్యప్ నెగెటివ్ రోల్‍లో జీవించేశారు. ఈ మూవీలో మమతా మోహన్ దాస్, నటరాజ్, భారతీరాజా, అభిరామి, అరుల్‍దాస్ కీలకపాత్రలు పోషించారు.
రూ.20కోట్ల బడ్జెట్.. రూ.107 కోట్ల వసూళ్లు
మహారాజ చిత్రం రూ.20కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ మూవీకి ఆరంభం నుంచి అదిరిపోయే టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్ల జోరు పెరిగింది. ఈ మూవీ మొత్తంగా రూ.107కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్‌గా నిలిచింది. తమిళంతో పాటు తెలుగులోనూ బాగా సక్సెస్ అయింది. తెలుగు వెర్షన్ కోసం విజయ్ సేతుపతి బాగా ప్రమోషన్లు చేయడంతో పాటు సినీ ఆకట్టుకోవటంతో మంచి వసూళ్లు దక్కాయి.
మహారాజ చిత్రానికి అజ్నీశ్ లోకనాథ్ సంగీతం ఇచ్చారు. ఈ చిత్రాన్ని బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఎలివేట్ చేసింది. ది రూట్, ప్యాషన్ స్టూడియోస్, థింక్ స్యూడియోస్ బ్యానర్లపై సుధాన్ సుందరం, జగదీశ్ పళనిస్వామి ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు.