Maharaja 3 Days Collections: దుమ్మురేపుతున్న విజయ్ సేతుపతి ‘మహారాజ’ సినిమా.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే!
Maharaja Day 3 Box office Collections: మహారాజ సినిమా బాక్సాఫీస్ వద్ద జోరు పెంచింది. పాజిటివ్ టాక్ రావటంతో ఈ చిత్రాన్ని కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ సినిమా మూడు రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మూవీ టీమ్ వెల్లడించింది.
Maharaja Day 3 Box office Collections: మహారాజ సినిమా మంచి అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టింది. ట్రైలర్ ఆకట్టుకోవడంతో బాగా బజ్ ఏర్పడింది. మక్కల్ సెల్వన్, తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ మూవీ జూన్ 14వ తేదీన రిలీజ్ అయింది. హీరోగా సేతుపతికి ఇది 50వ చిత్రంగా ఉంది. మహారాజ మూవీకి తొలి రోజు మోస్తరు కలెక్షన్లే వచ్చినా.. ప్రేక్షకుల నుంచి పూర్తిగా పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో వసూళ్లు పెరిగాయి. తొలి రోజు కంటే మూడో రోజే ఎక్కువ టికెట్ల బుకింగ్స్ జరిగాయి. మహారాజ చిత్రానికి మూడు రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయంటే..
కలెక్షన్లు ఇలా..
మహారాజ సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.32.6 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా నేడు (జూన్ 17) వెల్లడించింది. ఓ పోస్టర్ కూడా తీసుకొచ్చింది. మహారాజ చిత్రానికి తొలి రోజు కంటే మూడో రోజు ఎక్కువగా వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. టికెట్ల బుకింగ్ ట్రెండ్ దీన్ని స్పష్టం చేసింది. పాజిటివ్ టాక్ రావటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మరేపుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లను సాధిస్తోంది.
రికార్డు అంటూ..
2024లో తమిళ బాక్సాఫీస్ వద్ద తొలి వీకెండ్ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మహారాజ రికార్డు సాధించిందని ప్యాషన్ స్టూడియోస్ పోస్ట్ చేసింది. బాక్సాఫీస్‍ను ఈ మూవీ షేక్ చేస్తోందంటూ ట్వీట్ చేసింది.
రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా మహారాజ మూవీ వచ్చింది. ఈ చిత్రానికి నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి యాక్టింగ్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఈ సినిమాలు అదిరిపోయాయనే టాక్ వచ్చింది. ముఖ్యంగా స్క్రీన్‍ప్లేతో నిథిలన్ మ్యాజిక్ చేశారు. దీంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాజిటివ్ టాక్‍తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
మహారాజ చిత్రంలో సేతుపతి ప్రధాన పాత్ర పోషించగా.. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టీ (నటరాజ్), భారతీరాజా, అభిరామి, అరుల్‍దాస్ కీలకపాత్రలు పోషించారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ పతాకైలపై సుధాన్ సుందరం, జగదీశ్ పళనిస్వామి సంయుక్తంగా ప్రొడ్యూజ్ చేశారు. ఈ సినిమాకు అజ్నీశ్ లోకనాథ్ మ్యూజిక్ ఇచ్చారు.
తెలుగుపై ఫోకస్
మహారాజ సినిమా కోసం తెలుగు మార్కెట్‍పై కూడా బాగా ఫోకస్ పెట్టారు విజయ్ సేతుపతి. తెలుగు కోసం ప్రీ-రిలీజ్ ప్రెస్‍మీట్‍లో మాట్లాడారు. ప్రీమియర్లకు కూడా హాజరయ్యారు. నేడు (జూన్ 17) తెలుగులోనూ సక్సెస్ మీట్ పెట్టారు. హీరో సుహాస్‍తో ఇంటర్య్వూ ఇచ్చారు. కొందరు తెలుగు యూట్యూబర్లతో కూడా విజయ్ సేతుపతి చిట్‍చాట్ మాట్లాడారు. మొత్తంగా ఈ సినిమా కోసం తెలుగులోనూ చాలా దృష్టి పెట్టారు. అందుకు తగ్గేట్టే మహారాజ సినిమా చిత్రం తెలుగు వెర్షన్ కూడా మంచి వసూళ్లను రాబడుతోంది.
మహారాజ సినిమా రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ మూవీలో బార్బర్‌గా పని చేసే మహారాజ పాత్ర పోషించారు విజయ్ సేతుపతి. తన కూతురిపై జరిగిన అన్యాయానికి మహారాజ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనే అంశం చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఈ మూవీ స్క్రీన్‍ప్లే అద్భుతంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరి వరకు సస్పెన్స్ కొనసాగించి ప్రేక్షకులను ఈ చిత్రం మెప్పిస్తోంది.
టాపిక్