Keerthy Suresh Maharaja review: మహరాజా మూవీ ఓ జెమ్.. విజయ్ ఇరగదీసేశాడు: కీర్తి సురేశ్ రివ్యూ
Keerthy Suresh Maharaja review: విజయ్ సేతుపతి 50వ సినిమా మహరాజాపై ప్రశంసల వర్షం కురిపించింది కీర్తి సురేశ్. ఈ మూవీ ఓ జెమ్ అని, విజయ్ సేతుపతి ఇరగదీశాడని తన పోస్టులో చెప్పింది.
Keerthy Suresh Maharaja review: తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన మహరాజా మూవీపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా నటి కీర్తి సురేశ్ కూడా ఈ సినిమా చూసి ఆశ్చర్యపోతూ ఓ పోస్ట్ చేసింది. తమిళ సినిమా గర్వంగా చెప్పుకోదగిన ఓ జెమ్ లాంటి మూవీ ఇది అని కీర్తి అనడం గమనార్హం.
మహరాజాపై కీర్తి సురేశ్ రివ్యూ
విజయ్ సేతుపతి 50వ సినిమాగా మహారాజా శుక్రవారం (జూన్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాధారణ ప్రేక్షకులతోపాటు సెలబ్రిటీలు కూడా ఈ సినిమా చూసి పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. తమిళ, తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేశ్ కూడా మహరాజా రివ్యూ ఇచ్చింది. తన ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలో ఆమె ఈ మూవీ రివ్యూ పోస్ట్ చేసింది.
డైరెక్టర్, యాక్టర్ తోపాటు స్క్రీన్ ప్లేను కూడా ఆమె ప్రశంసించింది. "మహరాజా సినిమా ఇప్పుడే చూసి వస్తున్నాను. స్క్రీన్ ప్లే ఎంత బాగుందో. ఈ షోలో డైరెక్టర్ నిథిలిన్ మీరే పెద్ద స్టార్. తమిళ సినిమా గర్వంగా చెప్పుకోదగిన జెమ్ ఈ మూవీ.
మీ 50వ సినిమాను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదే పర్ఫెక్ట్ మూవీ విజయ్ సేతుపతి సర్. మిమ్మల్ని చూడటం ఓ పండగలాంటిదే. అనురాగ్ కశ్యప్ సర్ మీ పాత్రతో అదరగొట్టేశారు. నటరాజ్ సర్ కూడా అన్ని పాత్రలను అద్భుతంగా ఒక చోట ఉంచగలిగాడు.
అభిరామి మేడమ్ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడటం బాగుంది. మమతా మోమన్‌దాస్ అక్కకి నా ప్రేమను పంచుతున్నాను" అని కీర్తి సురేశ్ ట్వీట్ చేసింది. అంతేకాదు ఈ సినిమా కోసం పని చేసిన మిగతా వారిపై కూడా కీర్తి ప్రశంసలు కురిపించింది. ఈ సినిమా అద్భుతంగా రావడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని, అందరికీ శుభాకాంక్షలు అని చెప్పింది.
మహరాజా సినిమా గురించి..
విజయ్ సేతుపతి నటించిన ఈ మహరాజా మూవీని నిథిలన్ డైరెక్ట్ చేశాడు. 2017లో కొరంగు బొమ్మై సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిథిలన్.. విజయ్ 50వ సినిమాను డైరెక్ట్ చేయడం విశేషం. ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఓ బార్బర్, తన బిడ్డపై అతనికున్న ప్రేమ చుట్టూ తిరిగే కథే ఈ మహరాజా.
తన ఇంట్లో నుంచి లక్ష్మి కనిపించకుండా పోయిందంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాడు. ఆ లక్ష్మి ఎవరన్నది సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ లక్ష్మి కోసం మహరాజా సాగించే వేటే ఈ సినిమా. విజయ్ తన మైలురాయిలాంటి 50వ సినిమాతో మంచి హిట్ కొట్టినట్లే అని చెప్పొచ్చు.
మహరాజా ఓటీటీ
మహారాజ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా థియేట్రికల్ డేట్ తెలిజేస్తూ తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. దీనిద్వారా ఓటీటీ పార్ట్‌నర్ నెట్‍ఫ్లిక్స్ అని తెలిసిపోయింది. థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తుంది.