Vijay Sethupathi: అందువల్ల పెయిన్ వస్తుంది.. తర్వాత నిరాశ.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కామెంట్స్
Vijay Sethupathi About Maharaja Movie: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ మూవీ మహారాజా. ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుపతి తన 50 సినిమాల జర్నీ గురించి చెప్పారు. దానివల్ల పెయిన్, నిరాశ వస్తుందని కామెంట్స్ చేశారు.
Vijay Sethupathi About Maharaja Movie: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మోస్ట్ ప్రెస్టీజియస్ 50వ మైల్ స్టోన్ మూవీ 'మహారాజా' రిలీజ్‌కి రెడీ అయింది. నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్‌పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనురాగ్ కశ్యప్ పవర్ ఫుల్ రోల్‌లో నటించారు.
విజయ్ సేతుపతికి ఇది 50వ సినిమా కావడంతో మెమరబుల్ హిట్ అందించడం కోసం దర్శకుడు చాలా కేర్ తీసుకున్నాడు. నిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌ని హ్యుజ్ బడ్జెట్‌తో లావిష్‌గా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఎన్‌విఆర్ సినిమా ఈ మూవీని ఏపీ, తెలంగాణలలో మ్యాసీవ్‌గా రిలీజ్ చేయనుంది.
విజయ్ సేతుపతి మహారాజా సినిమా జూన్ 14న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలు చేస్తున్నారు విజయ్ సేతుపతి. ఈ క్రమంలోనే తాజాగా హీరో విజయ్ సేతుపతి విలేకరుల సమావేశంలో మూవీ విశేషాలని పంచుకున్నారు.
50 సినిమాలు పూర్తి చేసుకున్నారు. ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది?
ఇది చాలా అద్భుతమైన జర్నీ. 50 సినిమాలు చేశాను. ఈ జర్నీలో దాదాపు 500 వందలకు పైగా కథలు విన్నాను. ఎంతోమందిని కలిశాను. హిట్స్, ప్లాప్స్ చూశాను. రిజల్ట్ ఏదైనా అది గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. ఇది చాలా వండర్ ఫుల్ జర్నీ.
మహారాజలో మీ పాత్ర ఎలా ఉండనుంది ?
ఇప్పటివరకూ చాలా రకాల సినిమాలు, క్యారెక్టర్స్ చేశాను. మహారాజలో చేసిన క్యారెక్టర్ నా గత సినిమాలకి డిఫరెంట్‌గా ఉంటుంది. నా క్యారెక్టర్ ఇంట్రోవర్ట్‌గా ఉంటుంది. అదే సమయంలో యాంగ్రీమ్యాన్‌లా ఉంటుంది. అదే టైంలో ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసే క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చాలా బ్యాలెన్సింగ్‌గా ఉంటుంది. మహారాజ కథ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. 50వ సినిమాగా ఈ కథ బావుంటుందని అనౌన్స్ చేయడం జరిగింది. అందరికీ నచ్చే కథ ఇది.
50 సినిమాలు చేశారు. ఫ్యుచర్ జర్నీ ఎలా ఉండబోతుంది ?
నేను ఏదీ క్యారీ చేయను. నార్మల్ థ్రిల్‌తోనే ఉంటాను. ఏదైనా డ్రీం ఉంటే దానిపైన ఎక్కువ పెయిన్ (బాధ), వెయిట్ వస్తుంది. తర్వాత డిస్సాపాయింట్మెంట్ (నిరాశ) వస్తుంది. అందుకే నేను ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోను. సిన్సియర్‌గా నా పని చేయడంపైనే ద్రుష్టి పెడతాను.
డైరెక్టర్ నితిలన్ సామినాథన్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
నితిలన్ చాలా చక్కగా సినిమాని ఎగ్జిక్యూట్ చేశారు. తనకి స్క్రీన్ ప్లే పై చాలా మంచి గ్రిప్ ఉంది. స్క్రీన్ ప్లే ఈ సినిమాలో చాలా స్పెషల్‌గా ఉంటుంది. అందరూ క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. తను ఈ సినిమాని తీర్చిదిద్దిన విధానం చాలా బావుంది.
ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి ?
సుధన్ సర్‌తో ఇది నా థర్డ్ ఫిల్మ్. ఆయన చాలా పాషన్ ఉన్న నిర్మాత. మంచి కథలు చేయడానికి ఇష్టపడతారు. చాలా సెన్సిబుల్ ప్రొడ్యూసర్. ఆయనతో మరో సినిమా చేయబోతున్నాను.