Vishwak Sen: యాక్టింగ్ చేస్తే రొమాన్స్ ఎక్కువ- నిర్మాతగా చేస్తే వయోలెన్స్ ఎక్కువ: విశ్వక్ సేన్-vishwak sen comments on navdeep chandini chowdary in yevam pre release event vishwak sen new movie updates tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwak Sen: యాక్టింగ్ చేస్తే రొమాన్స్ ఎక్కువ- నిర్మాతగా చేస్తే వయోలెన్స్ ఎక్కువ: విశ్వక్ సేన్

Vishwak Sen: యాక్టింగ్ చేస్తే రొమాన్స్ ఎక్కువ- నిర్మాతగా చేస్తే వయోలెన్స్ ఎక్కువ: విశ్వక్ సేన్

Sanjiv Kumar HT Telugu
Published Jun 12, 2024 02:27 PM IST

Vishwak Sen About Navdeep Yevam Pre Release Event: హీరో నవదీప్‌పై మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. యేవమ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నవదీప్ యాక్టింగ్ చేస్తే రొమాన్స్ ఎక్కువ.. నిర్మాతగా చేస్తే వయోలెన్స్ ఎక్కువ అని విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

యాక్టింగ్ చేస్తే రొమాన్స్ ఎక్కువ- నిర్మాతగా చేస్తే వయోలెన్స్ ఎక్కువ: విశ్వక్ సేన్
యాక్టింగ్ చేస్తే రొమాన్స్ ఎక్కువ- నిర్మాతగా చేస్తే వయోలెన్స్ ఎక్కువ: విశ్వక్ సేన్

Vishwak Sen About Navdeep Chandini Chowdary: చాందినీ చౌద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌ రాజ్‌, బిగ్ బాస్ ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవ‌మ్‌. ప్రకాష్‌ దంతులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి హీరో నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. ఈ నెల 14న చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

యేవమ్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక సోమ‌వారం అంటే జూన్ 10 హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మాస్ కా దాస్ విశ్వ‌క్‌ సేన్, కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్‌ రాజ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా విశ్వ‌క్‌ సేన్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

"హీరో న‌వ‌దీప్ యాక్టింగ్ చేస్తే రొమాన్ష్ ఎక్కువ, నిర్మాతగా చేస్తే వయోలెన్స్ ఎక్కువ అని అర్థ‌మైంది. ఈ సీ స్పేస్ అనే సంస్థ‌తో నిర్మాత‌గా టాలెంట్ యంగ్ పీపుల్‌కు నవదీప్ మంచి ఫ్లాట్‌ఫామ్ క్రియేట్ చేశాడు. సాధారణంగా అందరూ సినిమాలు చేసిన త‌రువాత అంద‌రూ ఆ సినిమాలోని చాలా త‌క్కువ మందితో ట‌చ్‌లో ఉంటారు" అని విశ్వక్ సేన్ అన్నారు.

"ఇక నేను న‌టించి రెస్పెక్ట్ చేసే వాళ్ల‌లో చాందిని చౌద‌రి ఒక‌రు. టెన్ష‌న్ ప‌డే క్యాండేట్ చాందిని. ఈ సినిమాతో చాందినికి ఆ భ‌యం పోయింది. ఈ సినిమా ద్వారా ఫీమేల్ సంగీత ద‌ర్శ‌కురాలు, ఫీమేల్ ఎడిట‌ర్‌, ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రానికి ప‌నిచేయడం చాలా ఆనందంగా ఉంది. అన్ని రంగాల్లో అమ్మాయిలు ఉండాలనేది నా కోరిక‌. ఈ టీమ్‌ను చూస్తుంటే ముచ్చ‌టేసింది. త‌ప్ప‌కుండా ఈ చిత్రం అంద‌రికి మంచి బ్రేక్‌నివ్వాలి" అని విశ్వక్ సేన్ కోరారు.

యేవమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చాందిని చౌద‌రి కూడా స్పీచ్ ఇచ్చారు. "ఈ సంవ‌త్స‌రం నా సినిమాలు వ‌రుస‌గా వ‌స్తాయ‌ని ఊహించ‌లేదు. అన్ని సినిమాలు అనుకోకుండా ఒకేసారి విడుద‌ల అవుతున్నాయి. నా ఇన్నేళ్ల కృషి ఇప్పుడు ఫ‌లితం చూపిస్తుంది. నా లైఫ్‌లో మెమెర‌బుల్ సినిమాను ఇచ్చిన సందీప్ రాజ్ నా కోయాక్ట‌ర్ విశ్వ‌క్‌ సేన్‌కు థ్యాంక్స్‌" అని చాందిని చౌదరి పేర్కొంది.

"ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా కోసం ఎద‌రుచూస్తున్న త‌రుణంలో ఈ సినిమా వ‌చ్చింది. పోలీస్ పాత్ర అన‌గానే యాక్ష‌న్ ఓరియెంటెడ్‌గా నా పాత్ర ఉంటుందని అనుకున్నాను. అయితే యాక్ష‌న్‌తో పాటు అన్ని షేడ్స్ నా పాత్ర‌లో ఉన్నాయి. త‌ప్ప‌కుండా యేవ‌మ్ అంద‌రిని ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నాను" అని చాందినీ చౌదరి ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇదిలా ఉంటే, ఇటీవలే నవదీప్ హీరోగా లవ్ మౌళి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్, ముద్దు సన్నివేశాల మోతాదు ఎక్కువగానే ఉంది. ఈ సినిమా చూసే నవదీప్‌పై విశ్వక్ సేన్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. లవ్ మౌళి చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడు అవనీంద్ర తెరకెక్కించారు.

ఇక విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో వచ్చాడు. ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి ఇద్దరూ హీరోయిన్స్‌గా చేశారు. అయితే, ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. రొటీన్ స్టోరీకి యాక్షన్ ఎలిమెంట్స్ అద్ది చిత్రాన్ని తెరకెక్కించారు.

Whats_app_banner