Chandini Chowdary: శ్రీ చైతన్య కాలేజీపై హీరోయిన్ చాందినీ చౌదరి కామెంట్స్.. బాత్రూమ్స్ అలా, ఫుడ్ ఉండదంటూ!-chandini chowdary about on sri chaitanya college facilities in yevam movie interview chandini chowdary new movie updates ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chandini Chowdary: శ్రీ చైతన్య కాలేజీపై హీరోయిన్ చాందినీ చౌదరి కామెంట్స్.. బాత్రూమ్స్ అలా, ఫుడ్ ఉండదంటూ!

Chandini Chowdary: శ్రీ చైతన్య కాలేజీపై హీరోయిన్ చాందినీ చౌదరి కామెంట్స్.. బాత్రూమ్స్ అలా, ఫుడ్ ఉండదంటూ!

Sanjiv Kumar HT Telugu
Jun 12, 2024 12:56 PM IST

Chandini Chowdary About Sri Chaitanya College: శ్రీ చైతన్య కాలేజీలోని ఉన్న సౌకర్యాలపై హీరోయిన్ చాందినీ చౌదరి షాకింగ్ కామెంట్స్ చేసింది. చాందినీ చౌదరి పోలీస్ ఆఫీసర్ రోల్‌లో నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ యేవమ్ ఇంటర్వ్యూలో భాగంగా ఆసక్తికర విశేషాలు చెప్పింది.

శ్రీ చైతన్య కాలేజీపై హీరోయిన్ చాందినీ చౌదరి కామెంట్స్.. బాత్రూమ్స్ అలా, ఫుడ్ ఉండదంటూ!
శ్రీ చైతన్య కాలేజీపై హీరోయిన్ చాందినీ చౌదరి కామెంట్స్.. బాత్రూమ్స్ అలా, ఫుడ్ ఉండదంటూ!

Chandini Chowdary Yevam Movie: షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన బ్యూటిఫుల్ చాందినీ చౌదరి టాలీవుడ్‌లో హీరోయిన్‌గా బాగా పాపులర్ అయింది. ఇటీవల గామి సినిమాతో అలరించిన చాందిని చౌదరి ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉంది. త్వరలో అంటే జూన్ 14న యేవమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ రోల్‌లో నటించింది చాందినీ చౌదరి. అయితే, జూన్ 14న యేవమ్ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది చాందినీ చౌదరి. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పింది చాందినీ చౌదరి. ఈ క్రమంలోనే తాను చదువుకున్న శ్రీచైతన్య కాలేజీ నుంచి పారిపోయి వచ్చిన విషయాన్ని తెలియజేసింది.

"విజయవాడలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ చదివేందుకు జాయిన్ అయ్యాను. బాగా చదువుకుందాం అని హాస్టల్‌లో చేరాను. కానీ, మూడే మూడు నెలల్లో తిరిగి వచ్చేశాను. అక్కడ ఉదయం ఆరు గంటలకు క్లాసులు స్టార్ట్ అయ్యేవి. అందరికీ కామన్ బాత్రూమ్స్ ఉండేవి. మనకి బాత్రూమ్ దొరకాలంటే గంటన్నరపాటు లైన్‌లో ఉండాల్సిన పరిస్థి. బకెట్ పట్టుకుని క్యూలోనే నిలబడాలి" అని చాందినీ చౌదరి తెలిపింది.

"ఆ తర్వాత ఫుడ్ ఉండదు. ఏం ఉండదు. వెళ్లి క్లాస్‌లో కూర్చుని రెండు క్లాసులు అయిన తర్వాత రావాలి. అప్పుడు స్నానం చేసి మళ్లీ పోవాలి. రోజులో నాలుగైదు గంటలు మాత్రమే నిద్ర ఉండేది. అందుకే అక్కడ ఉండటం నా వల్లే కాలేదు. మూడు నెలలు కూడా ఉండలేకపోయాను. హాస్టల్ వదిలి వచ్చేశాను" అని శ్రీచైతన్య కాలేజీలో పరిస్థితి గురించి చెప్పుకొచ్చింది చాందినీ చౌదరి.

కాగా విశాఖకు చెందిన చాందినీ చౌదరి 15 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉంటోంది. కుందనపు బొమ్మ సినిమాతో మెయిన్ లీడ్ హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన చాందినీ చౌదరి వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం యేవమ్ సినిమాతోపాటు మ్యూజిక్ షాప్ మూర్తి, సంతాన ప్రాప్తిరస్తు సినిమాల్లో మెయిన్ రోల్ చేస్తోంది. వీటితోపాటు బాలకృష్ణ-బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో ఓ కీ రోల్ ప్లే చేస్తోంది చాందినీ చౌదరి.

కాగా యేవమ్ సినిమాలో చాందినీ చౌదరితోపాటు వ‌శిష్ట సింహా, భరత్‌ రాజ్‌, ఆషు రెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రకాష్‌ దంతులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి హీరో నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. ఈ నెల 14న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవలే నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మాస్ క‌దాస్ విశ్వక్ సేన్, డైరెక్టర్ సందీప్‌రాజ్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు.

అయితే, చాందినీ చౌదరి, విశ్వక్ సేన్ కలిసి గామి సినిమాలో నటించారు. ఇందులో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపిస్తే.. చాందినీ చౌదరి డాక్టర్‌గా అలరించింది. మనిషి స్పర్ష తగిలితే చనిపోయేటువంటి వింత వ్యాధితో బాధపడే వ్యక్తికి మూలికలు ఉండే ప్రాంతానికి వెళ్లేందుకు సహాయం చేసే డాక్టర్ పాత్రలో చాందినీ చౌదరి అలరించింది. ప్రస్తుతం గామి మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

WhatsApp channel