Sri Chaitanya Infinity Learn: శ్రీ చైతన్య ఇన్ఫినిటీ లెర్న్ ఘన విజయం-infinity learn by sri chaitanya reports strong revenue growth along with profit in its latest financial report ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Sri Chaitanya Infinity Learn: శ్రీ చైతన్య ఇన్ఫినిటీ లెర్న్ ఘన విజయం

Sri Chaitanya Infinity Learn: శ్రీ చైతన్య ఇన్ఫినిటీ లెర్న్ ఘన విజయం

HT Telugu Desk HT Telugu
Oct 06, 2023 03:32 PM IST

శ్రీ చైతన్య ఇన్ఫినిటీ లెర్న్ ఎడ్యుటెక్ రంగంలో అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే అనూహ్య విజయాలు సాధించింది. మంచి ఫలితాలు లక్ష్యంగా పాఠ్య ప్రణాళికను రూపొందించింది

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

శ్రీ చైతన్య ఇన్ఫినిటీ లెర్న్ ఎడ్యుటెక్ రంగంలో అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే అనూహ్య విజయాలు సాధించింది. మంచి ఫలితాలు లక్ష్యంగా పాఠ్య ప్రణాళికను రూపొందించింది.

ఫైనాన్షియల్ గా లాభం..

ఎడ్యుటెక్ రంగంలో అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే ఈ రంగంలో తనదైన ముద్ర వేసిన శ్రీ చైతన్య ఇన్ఫినిటీ లెర్న్ స్టార్ట్ అప్.. ఆర్థికంగా కూడా విజయం సాధించింది. ఈ రంగంలో ఈ సంస్థ అంచనాలను మించిన విజయాన్ని సాధించి ప్యాట్ పాజిటివ్ (PAT +ve) పొందిన తొలి సంస్థగా నిలిచింది. 2022-23లో సంస్థ ఆపరేషన్స్ రెవెన్యూ రూ. 100 కోట్లను దాటింది. 2021-22 లో అది కేవలం రూ. 2.3 కోట్లు. ఆపరేషన్స్ ప్రారంభించిన రెండేళ్లలోపే శ్రీ చైతన్య ఇన్ఫినిటీ లెర్న్ ఈ విజయాలను సాధించింది. ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, ఈ రంగంలో తమకు లభించిన ఆదరణకు ఉదాహరణ తాము ఆర్థికంగా సాధించిన విజయమని శ్రీ చైతన్య ఇన్ఫినిటీ లెర్న్ వెల్లడించింది.

కొత్త లక్ష్యాలు..

తమకు తామే కాకుండా, ఈ రంగంలోని పోటీ దారులకు కూడా అత్యున్నత లక్ష్యాలను, ప్రమాణాలను చూపెడ్తున్నామని శ్రీ చైతన్య ఇన్ఫినిటీ లెర్న్ సీఈఓ ఉజ్వల్ సింగ్ వెల్లడించారు. ఎడ్యుటెక్ రంగంలో ఈ రెండేళ్లలోనే చెరగని ముద్ర వేశామని సగర్వంగా తెలిపారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహకారంతో సిలబస్ ను రూపొందించి, విద్యార్థులకు అందజేస్తామన్నారు.