Chandini Chowdary: పవర్‌ఫుల్ పోలీస్‌గా గామి హీరోయిన్ చాందినీ చౌదరి.. బోల్డ్ బ్యూటితో కలిసి యేవమ్-chandini chowdary yevam first look out chandini chowdary plays police officer role bigg boss ashu reddy ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chandini Chowdary: పవర్‌ఫుల్ పోలీస్‌గా గామి హీరోయిన్ చాందినీ చౌదరి.. బోల్డ్ బ్యూటితో కలిసి యేవమ్

Chandini Chowdary: పవర్‌ఫుల్ పోలీస్‌గా గామి హీరోయిన్ చాందినీ చౌదరి.. బోల్డ్ బ్యూటితో కలిసి యేవమ్

Sanjiv Kumar HT Telugu
Apr 27, 2024 11:28 AM IST

Chandini Chowdary Yevam First Look: కలర్ ఫొటో సినిమాతో మంచి పేరు తెచ్చుకుని ఇటీవల గామితో పాపులర్ అయిన చాందిని చౌదరి నటిస్తున్న సినిమా యేవమ్. మొదటిసారిగా చాందిని చౌదరి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న యేవమ్ ఫస్ట్ లుక్ విడుదలైంది.

పవర్‌ఫుల్ పోలీస్‌గా గామి హీరోయిన్ చాందినీ చౌదరి.. బోల్డ్ బ్యూటితో కలిసి యేవమ్
పవర్‌ఫుల్ పోలీస్‌గా గామి హీరోయిన్ చాందినీ చౌదరి.. బోల్డ్ బ్యూటితో కలిసి యేవమ్

Chandini Chowdary As Police Officer: యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో పేరు తెచ్చుకున్న చాందినీ చౌదరి అనేక సినిమాల్లో సైడ్ రోల్స్ చేసింది. మొదటిసారిగా కలర్ ఫొటోలో మెయిన్ హీరోయిన్‌గా నటించి సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా మంచి క్రేజ్ అందుకుంది. తర్వాత హీరోయిన్‌గా అనేక సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది బ్యూటిఫుల్ చాందినీ చౌదరి.

ఇటీవలే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రయోగాత్మక చిత్రం గామితో అలరించింది చాందినీ చౌదరి. ఇందులో ఓ కీలక పాత్రలో నటించి ఒదిగిపోయింది చాందినీ చౌదరి. ఇప్పుడు మరొ కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. చాందినీ చౌదరి తొలిసారిగా హీరోయిన్ ఒరియెంటెడ్ సినిమా చేస్తోంది. ఆ మూవీ పేరే యేవమ్. చాందినీ చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న యేవమ్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేశారు.

శుక్రవారం (ఏప్రిల్ 26) యేవమ్ చిత్రంలో చాందిని చౌదరి నటిస్తున్న పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. మహిళా సాధికారికతను చాటి చెప్పే విధంగా ఆమె పాత్ర చిత్రంలో కనిపించనుంది. ఈ యేవమ్ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చాందినీ చౌదరి కనిపించింది. తీక్షణంగా ఆలోచిస్తూ తన ఫొటో ఉంది. అలాగే 'ఆడపిల్లని అయితే ఏంటంటా?' అని పోస్టర్‌పై రాసి ఉంది.

దర్శకుడు ప్రకాష్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. "నేటి మహిళా సాధికారితను, ధైర్యాన్ని రిప్రంజెట్‌ చేసే విధంగా ఉంటుంది. ఈ చిత్రంలో చాందిని చౌదరి నటన ఎంతో హైలైట్‌గా ఉంటుంది. కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్‌ నేరేషన్‌తో ఈ సినిమా ఉంటుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది" అని తెలిపారు.

ఈ సినిమాలో చాందినీ చౌదరితోపాటు వశిష్ట సింహా, జైభారత్‌, బిగ్ బాస్ బోల్డ్ బ్యూటి ఆషు రెడ్డి ముఖ్యతారలుగా నటిస్తున్నారు. అలాగే గోపరాజు రమణ, దేవిప్రసాద్‌, కల్పిత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రకాష్‌ దంతులూరి దర్శకత్వం వహించారు. నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌ గా ఎస్‌వీ విశ్వేశ్వర్‌, సంగీతం కీర్తన శేషు, నీలేష్‌ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

కాగా చాందినీ చౌదరి కలర్ ఫొటో, సమ్మతమే, హౌరా బ్రిడ్జ్, కుందనపు బొమ్మ, సూపర్ ఓవర్, బొంబాట్, కేటుగాడు వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. అలాగే సభా నాయగన్ అనే తమిళ సినిమాలో ఒక హీరోయిన్‌గా ఆకట్టుకుంది. ఇటీవలే విశ్వక్ సేన్ గామి సినిమాలో డాక్టర్ పాత్రలో అలరించింది చాందినీ చౌదరి.

పవర్‌ఫుల్ పోలీస్‌గా గామి హీరోయిన్ చాందినీ చౌదరి
పవర్‌ఫుల్ పోలీస్‌గా గామి హీరోయిన్ చాందినీ చౌదరి

ప్రస్తుతం జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న గామి సినిమాలో హరిద్వార్‌లో ఉండే అఘోరా శంకర్ (విశ్వక్ సేన్) వింత సమస్యతో బాధపడుతుంటాడు. అందుకనే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా శంకర్ తనున్న ప్రదేశాన్ని వీడి తన సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటూ కాశీకి వెళతాడు. అక్కడ తన సమస్యకు పరిష్కారం దొరికే చోటు హిమాలయాలు అని తెలుస్తుంది.

అక్కడ 36 ఏళ్లకు అరుదుగా దొరికే మాలి పత్రాలు కోసం శంకర్ అన్వేషిస్తూ బయలుదేరుతాడు. అదే సమయంలో అతనికి డాక్టర్ జాహ్నవి (చాందిని చౌదరి) పరిచయం అవుతుంది. ఈ ప్రయాణంలో శంకర్ మనసులో చిత్ర విచిత్రమైన ఆలోచనలు, కలలు వస్తుంటాయి. ఓ పల్లెటూరుల్లో ఉండే దేవదాసి ఉమ, ఓ ప్రయోగశాలలో చిక్కుకుని తప్పించుకోవాలనుకునే ఓ యువకుడు కనిపిస్తుంటారు. అసలు వాళ్లకు శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? శంకర్ సమస్య ఏంటి? తన సమస్యకు శంకర్ పరిష్కారం కనుక్కున్నాడా? అనే విషయాలతో గామి తెరకెక్కింది.

IPL_Entry_Point