Vishwak Sen: నాకు సూట్ అయ్యేలా సూట్ వేసింది తనే.. యంగ్ హీరోపై విశ్వక్ సేన్ కామెంట్స్-vishwak sen comments on fighter raja hero ramz in teaser event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwak Sen: నాకు సూట్ అయ్యేలా సూట్ వేసింది తనే.. యంగ్ హీరోపై విశ్వక్ సేన్ కామెంట్స్

Vishwak Sen: నాకు సూట్ అయ్యేలా సూట్ వేసింది తనే.. యంగ్ హీరోపై విశ్వక్ సేన్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Mar 29, 2024 10:55 AM IST

Vishwak Sen About Fighter Raja: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా ఓ హీరోపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఫైటర్ రాజా టీజర్ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

నాకు సూట్ అయ్యేలా సూట్ వేసింది తనే.. యంగ్ హీరోపై విశ్వక్ సేన్ కామెంట్స్
నాకు సూట్ అయ్యేలా సూట్ వేసింది తనే.. యంగ్ హీరోపై విశ్వక్ సేన్ కామెంట్స్

Vishwak Sen Fighter Raja Ramz: పచ్చీస్ సినిమాతో హీరోగా తెరంగ్రేట్రం చేసిన పాపులర్ స్టైలిస్ట్ రామ్జ్ నటించిన రెండో సినిమా ఫైటర్ రాజా. కృష్ణ ప్రసాద్ వత్యం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రన్‌వే ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం.2గా దినేష్ యాదవ్, పుష్పక్ జైన్ నిర్మించారు. రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన మేకర్స్ తాజాగా ఫైటర్ రాజా టీజర్‌ విడుదల చేశారు. ఈ ఫైటర్ రాజా టీజర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హాజరయ్యాడు.

"రామ్జ్ నాకు ఈ నగరానికి ఏమైంది సినిమా నుంచి తెలుసు. తను సెలబ్రెటీలకు చాలా చక్కని స్టయిలింగ్ చేస్తారు. మొదటి సారి నాకు సూట్ వేయించింది కూడా తనే. నాకు మొదటగా సూట్ అయ్యేలా సూట్ వేసింది తనే. అతను ఈ వేడుకు రమ్మని పిలవగానే నాకు అదే గుర్తుకు వచ్చింది. మనస్పూర్తిగా ఈ వేడుకకు రావాలనిపించింది. ఈ సినిమాకి సంబధించిన ప్రతిది చాలా ప్రామెసింగ్‌గా ఉంది. పోస్టర్ డిజైన్, కలర్ గ్రేడింగ్, విజువల్స్ అన్నీ బావున్నాయి" అని విశ్వక్ సేన్ అన్నాడు.

"ఫైటర్ రాజా టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. చాలా రోజుల తర్వాత చంద్రశేఖర్ యేలేటి గారి సినిమా వైబ్ ఈ టీజర్‌లో కనిపించింది. టీజర్ చాలా ఇంపాక్ట్ ఫుల్‌గా ఉంది. రామ్జ్ లోని ప్రతిభ సర్‌ప్రైజ్ చేసింది. తప్పకుండా అందరూ సినిమా థియేటర్స్‌లో చూడండి. కచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్" అని చెప్పిన విశ్వక్ సేన్ సూట్ వేస్తూ నీ సూట్ లోపల చాలా దాచావ్ అని హీరో రామ్జ్‌ను సరదాగా అన్నాడు విశ్వక్ సేన్.

అనంతరం హీరోయిన్ మాయ కృష్ణన్ గురించి కూడా విశ్వక్ సేన్ మాట్లాడాడు. మీరు ఒక్క సీన్‌తో చాలా పాపులర్ అయ్యారు. మావోళ్లు అంతే ఒక్కసారి నచ్చితే.. గచ్చిబౌళిలో ప్లాట్ ఇచ్చేంతలా ఆదరిస్తారు అని విశ్వక్ సేన్ సరదాగా కామెంట్స్ చేశాడు.

"లవ్, మనీ, ఫ్యామిలీ ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం ఫైటర్ రాజా. విశ్వక్ సేన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి సపోర్ట్ మాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. టీజర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా ఉంది. చాలా యంగ్ టీంతో చాలా హార్డ్ వర్క్ చేసి చేశాం. దర్శకుడు కృష్ణ ప్రసాద్ నిర్మాతలు దినేష్, పుష్పక్ జైన్, టీం అంతా కలసి చాలా ప్యాషన్‌తో పని చేశాం. తప్పకుండా సినిమా మీ అందరినీ అలరిస్తుంది" అని హీరో రామ్జ్ తెలిపాడు.

"ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన విశ్వక్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చి , తెలుగులో పరిచయం చేస్తున్న దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. టీజర్ మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మా సినిమాకు సపోర్ట్ చేయండి" అని హీరోయిన్ మాయా కృష్ణన్ కోరారు.

Whats_app_banner