Z5 OTT: ఓటీటీలో దంచికొడుతున్న క్రైమ్ థ్రిల్లర్.. జీ5 బెస్ట్ 5 ట్రెండింగ్ సినిమాలు ఇవే.. మీరెన్ని చూశారు?-ott trending movies on zee5 this week silence 2 ott streaming gaami ott release hanuman digital premiere ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Z5 Ott: ఓటీటీలో దంచికొడుతున్న క్రైమ్ థ్రిల్లర్.. జీ5 బెస్ట్ 5 ట్రెండింగ్ సినిమాలు ఇవే.. మీరెన్ని చూశారు?

Z5 OTT: ఓటీటీలో దంచికొడుతున్న క్రైమ్ థ్రిల్లర్.. జీ5 బెస్ట్ 5 ట్రెండింగ్ సినిమాలు ఇవే.. మీరెన్ని చూశారు?

Sanjiv Kumar HT Telugu
Apr 20, 2024 12:27 PM IST

OTT Trending Movies This Week: ఓటీటీలో కొన్ని సినిమాలు మాత్రమే మంచి ఆదరణ దక్కించుకుని ట్రెండింగ్‌లో దూసుకుపోతుంటాయి. అలా రీసెంట్‌గా రిలీజైన ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో అదరగొడతుతోంది. మరి ఆ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందన్న వివరాల్లోకి వెళితే..

ఓటీటీలో దంచికొడుతున్న క్రైమ్ థ్రిల్లర్.. జీ5 బెస్ట్ 5 ట్రెండింగ్ సినిమాలు ఇవే.. మీరెన్ని చూశారు?
ఓటీటీలో దంచికొడుతున్న క్రైమ్ థ్రిల్లర్.. జీ5 బెస్ట్ 5 ట్రెండింగ్ సినిమాలు ఇవే.. మీరెన్ని చూశారు?

OTT Movies: ఓటీటీలో విడుదలైన అన్నీ సినిమాలను ప్రేక్షకులు చూడరు. కొన్ని జోనర్స్ మాత్రమే చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. దాంతో కొన్ని సినిమాలు మాత్రమే ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకుని ట్రెండింగ్‌లో దూసుకుపోతుంటాయి. అలా ఇటీవల విడుదలైన ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో రచ్చ చేస్తోంది. దాంతో పాటు మరికొన్ని సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. అలా టాప్ 5 ఓటీటీ ట్రెండింగ్ సినిమాలు, వాటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో చూద్దాం.

సైలెన్స్ 2 ఓటీటీ

వర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్ పాయ్ నటించిన లేటెస్ట్ సినిమా సైలెన్స్ 2 నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. 2021లో వచ్చి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ 'సైలెన్స్: కెన్ యు హియర్ ఇట్?' (Silence OTT)కు సీక్వెల్‌గా వచ్చిందే సైలెన్స్ 2 (సైలెన్స్ ది నైట్ ఔల్ బార్ షూట్ అవుట్).

ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రముఖ ఓటీటీ జీ5లో (Zee5 OTT) నేరుగా విడుదలైంది. రిలీజైన తొలి రోజు నుంచే ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇప్పుడు జీ5 ఓటీటీలో ట్రెండింగ్‌లో టాప్ 1 ప్లేస్ సాధించి అదరగొడుతోంది సైలెన్స్ 2 మూవీ (Silence 2 OTT). క్రైమ్ మర్డర్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్‌గా వచ్చిన ఈ సినిమాకు అబన్ బరుచా దర్శకత్వం వహించారు. ఇందులో ప్రాచీ దేశాయ్ కీలక పాత్ర పోషించింది.

గామి ఓటీటీ

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రయోగాత్మక సినిమా గామి. విజువల్ వండర్ అండ్ డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో వచ్చిన ఈ సినిమా మార్చి 8న థియేటర్లలో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల ఏప్రిల్ 12 నుంచి జీ5 ఓటీటీలో (Gaami OTT Streaming) స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రస్తుతం ఈ సినిమా టాప్ 2 ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ అఘోరాగా నటించిన విషయం తెలిసిందే.

హనుమాన్ ఓటీటీ

తేజా సజ్జా నటించిన సూపర్ హీరో సినిమా హనుమాన్ ఇప్పటికీ ట్రెండింగ్‌లో కొనసాగుతుండటం విశేషం. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా జీ5లో మూడో స్థానంలో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

ఫారే ఓటీటీ

సల్మాన్ ఖాన్ మేనకోడలు అలిజెహ్ అగ్నిహోత్రి నటించిన మిస్టరీ థ్రిల్లర్ ఫారే. రొనిత్ రాయ్, ప్రసన్ని బిషత్, జూహి బబ్బర్, సాహిల్ మెహతా నటించిన ఈ సినిమాకు సౌమేంద్ర పది దర్శకత్వం వహించారు. ఈ సినిమా (Farrey OTT) జీ5 ఓటీటీలో టాప్ 4 స్థానంలో అలరిస్తోంది.

ది కేరళ స్టోరీ ఓటీటీ

బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన అదా శర్మ మూవీ ది కేరళ స్టోరీ. చాలా గ్యాప్‌తో ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ (The Kerala Story OTT) ఇప్పటికీ జీ5లో టాప్ 5 ప్లేసులో ట్రిండింగ్ అవుతోంది.

టాప్ 10 ఓటీటీ సినిమాలు

సినిమాలు మాత్రమే కాకుండా జీ5 ఓటీటీలో పంకజ్ త్రిపాఠి నటించిన మెయిన్ అటల్ హూన్ టాప్ 6 ప్లేసులో ట్రెండ్ అవుతోంది. అలాగే ఏడో స్థానంలో విక్కీ కౌశల్ సామ్ బహదూర్, అభిషేక్ బచ్చన్ స్పోర్ట్స్ డ్రామా గూమర్ 8వ స్థానంలో, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఓపెన్ హైమర్ 9వ ప్లేసులో, కన్నడ స్టార్ హీరో దర్శన్ యాక్ట్ చేసిన కాటెరా టాప్ 10లో ట్రెండ్ అవుతున్నాయి.