Today OTT Releases: ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 11 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 5.. ఎందుకంటే?-today ott movies to release on netflix disney plus hotstar amazon prime aha zee5 ott siren ott release article 370 ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Today Ott Releases: ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 11 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 5.. ఎందుకంటే?

Today OTT Releases: ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 11 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 5.. ఎందుకంటే?

Sanjiv Kumar HT Telugu
Apr 19, 2024 10:33 AM IST

Friday OTT Movies Releases: ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలతో ఆకర్షించే ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో ఈవారం ఏకంగా 18 చిత్రాలకుపైగా విడుదల అయ్యాయి. కానీ, వాటిలో ఇవాళ ఒక్కరోజే అంటే ఏప్రిల్ 19న ఏకంగా 11 వరకు సినిమాలు రిలీజ్ కాగా వాటిలో 5 కచ్చితంగా చూడాల్సిన సినిమాలు. అవేంటో లుక్కేద్దాం.

ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 11 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 5.. ఎందుకంటే?
ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 11 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 5.. ఎందుకంటే?

Today OTT Releases: ఎవ్రీ వీక్ సరికొత్త కంటెంట్ సినిమాలతో ఓటీటీ వేదికలా తెగ అట్రాక్ట్ చేస్తుంటాయి. ఇక ఓటీటీ సినిమాల కోసమే కాచుకున్న సినీ ప్రియులకు కొత్త వారం వచ్చిందంటే చాలు పండగే. అయితే, ఈ వారం కూడా 19కిపైగా సినిమాలు ఓటీటీలో సందడి చేసేందుకు రిలీజ్ అయ్యాయి.

డిఫరెంట్ జోనర్లలో

వీటిలో ఒక్క ఇవాళ శుక్రవారం (ఏప్రిల్ 19) ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కిన 5 సినిమాలను మాత్రం కచ్చితంగా చూడాల్సిందే. మరి ఆ సినిమాలు ఏంటో.. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.

చీఫ్ డిటెక్టివ్ 1958 (కొరియన్ వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్- ఏప్రిల్ 19

సైరన్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్- ఏప్రిల్ 19

రెబల్ మూన్ ది స్కార్గివర్ (పార్ట్ 2) (ఇంగ్లీష్ చిత్రం)- నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ- ఏప్రిల్ 19

ఆర్టికల్ 370 (హిందీ సినిమా)- నెట్ ఫ్లిక్స్ ఓటీటీ- ఏప్రిల్ 19

డిమోన్స్ (హిందీ సినిమా)- జీ5 ఓటీటీ- ఏప్రిల్ 19

కమ్ చాలు హై (హిందీ మూవీ)- జీ5 ఓటీటీ- ఏప్రిల్ 19

ఒర్లాండో బ్లూమ్: టూ ది ఎడ్జ్ (ఇగ్లీష్ వెబ్ సిరీస్)- జియో సినిమా ఓటీటీ- ఏప్రిల్ 19

రణం అరమ్ తవరేళ్ (తమిళ క్రైమ్ థ్రిల్లర్)- అమెజాన్ ప్రైమ్ వీడియో- ఏప్రిల్ 19

డ్రీమ్ సినారియో (ఇంగ్లీష్ చిత్రం)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఏప్రిల్ 19

ది టూరిస్ట్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఏప్రిల్ 19

మై డియర్ దొంగ (తెలుగు కామెడీ సినిమా)- ఆహా ఓటీటీ- ఏప్రిల్ 19

చూడాల్సిన 5 సినిమాలు

OTT Releases Friday: ఇలా ఇవాళ ఒక్క రోజే ఓటీటీలోకి సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా 11 స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో సైరన్, ఆర్టికల్ 370, మై డియర్ దొంగ, రణం అరమ్ తవరేళ్, రెబల్ మూన్ 2 ఐదు కచ్చితంగా చూడాల్సిన సినిమాలు. ఈ ఐదు డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కిన సినిమాలు సినీ లవర్స్‌కు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనున్నాయి.

సైరన్ ఓటీటీ (Siren OTT)

కీర్తి సురేష్, జయం రవి, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన సినిమా సైరన్. రివేంజ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ తమిళ సినిమా ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

ఆర్టికల్ 370 ఓటీటీ (Article 370 OTT)

బాలీవుడ్ బ్యూటిఫుల్ యామీ గౌతమ్, తెలుగు హీరోయిన్ ప్రియమణి కలిసి నటించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా ఆర్టికల్ 370. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో నేటి నుంచి ఈ సినిమాను ఫ్రీగా చూసేయొచ్చు. అయితే ఈ మూవీ హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.

మై డియర్ దొంగ ఓటీటీ

అభినవ్ గోమఠం, శాలినీ, దివ్య శ్రీపాద నటించి కామెడీ సినిమా మై డియర్ దొంగ (My Dear Donga OTT Release). ఈ మూవీ ఏప్రిల్ 19 నుంచి ఆహాలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. లవ్ స్టోరీలోకి ఎంటరైన్ దొంగ కథగా ఈ సినిమా తెరకెక్కింది.

రణం అరమ్ తవరేళ్ (Ranam Aram Thavarel OTT)

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన తమిళ సినిమా రణం అరమ్ తవరేళ్. హీరో వైభవ్, నందితా శ్వేత, తాన్య హోప్ ప్రధాన పాత్రలుగా పోషించిన ఈ సినిమా తమిళ భాషలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దీంతోపాటు సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా వచ్చిన రెబల్ మూన్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

IPL_Entry_Point