Hanuman First Review: హనుమాన్ ఫస్ట్ రివ్యూ.. తేజా సజ్జా యాక్టింగ్ హైలెట్.. కంటతడి పెట్టించేలా ఆ సెంటిమెంట్-teja sajja hanuman movie first review and climax 15 minutes highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanuman First Review: హనుమాన్ ఫస్ట్ రివ్యూ.. తేజా సజ్జా యాక్టింగ్ హైలెట్.. కంటతడి పెట్టించేలా ఆ సెంటిమెంట్

Hanuman First Review: హనుమాన్ ఫస్ట్ రివ్యూ.. తేజా సజ్జా యాక్టింగ్ హైలెట్.. కంటతడి పెట్టించేలా ఆ సెంటిమెంట్

Sanjiv Kumar HT Telugu
Jan 11, 2024 01:39 PM IST

Hanuman First Review: ఇండియన్ తెలుగు సూపర్ హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. జనవరి 12న విడుదల కానున్న హనుమాన్ మూవీ ఫస్ట్ రివ్యూ రానే వచ్చింది. పలు చోట్ల ప్రీమియర్ షోలు పడగా హనుమాన్ మూవీపై రివ్యూలు ఇస్తున్నారు ప్రేక్షకులు.

హనుమాన్ ఫస్ట్ రివ్యూ.. తేజా సజ్జా యాక్టింగ్ హైలెట్.. కంటతడి పెట్టించేలా ఆ సెంటిమెంట్
హనుమాన్ ఫస్ట్ రివ్యూ.. తేజా సజ్జా యాక్టింగ్ హైలెట్.. కంటతడి పెట్టించేలా ఆ సెంటిమెంట్

Hanuman First Review: తెలుగు క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. అ! అనే తొలి సినిమాతోనే దర్శకుడుగా టాలెంటెడ్ అని నిరూపించుకున్నాడు. సస్పెన్స్, క్రైమ్, టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో అంథాలజీ మూవీగా వచ్చిన ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌కు విమర్శకులు సైతం పొగడ్తలు కురిపించారు. అనంతరం రాజశేఖర్‌తో కల్కి, తేజా సజ్జాతో జాంబీ రెడ్డి చిత్రాలను తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ.

మొదటిసారిగా

ఈ సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు మరో క్రేజియెస్ట్ ఫిల్మ్ హనుమాన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రశాంత్ వర్మ. తెలుగులోనే మొదటిసారిగా సూపర్ హీరో సినిమాగా హనుమాన్‌ను తెరకెక్కించాడు. ఇండియన్ తెలుగు సూపర్ హీరో మూవీగా వస్తున్న హనుమాన్ చిత్రంలో తేజ సజ్జా హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేశారు. పాపులర్ యాక్టర్ వినయ్ రాయ్ విలన్‌గా నటించాడు.

అంతర్జాతీయ భాషల్లో

హనుమాన్ మూవీలో వీరితోపాటు వరలక్ష్మీ శరత్ కుమార్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను, సత్య తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. హనుమాన్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుకగా తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ సహా పలు భారతీయ, అంతర్జాతీయ భాషల్లో విడుదల చేయనున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించగా.. శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు.

150 షోలతో ప్లాన్

సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదల కానున్న మహేశ్ బాబు గుంటూరు కారం మూవీకి పోటీగా వస్తోన్న హనుమాన్‌ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. అయితే, హనుమాన్ సినిమాను గురువారం (జనవరి 11) సాయంత్రం 6.15 నిమిషాలకు పెయిడ్ ప్రీమియర్ షోలు వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 150 షోలు షెడ్యూల్ చేశారు. వీటిలో దాదాపు థియేటర్స్ హౌస్ ఫుల్ అయినట్లు సమాచారం.

క్లైమాక్స్ నెక్ట్స్ లెవెల్

ఈ పెయిడ్ ప్రీమియర్స్ వేయడానికి ముందు ఇండస్ట్రీలోని కొందరి సినీ ప్రముఖులకు హనుమాన్ స్పెషల్ షో వేశారు మేకర్స్. ఈ క్రమంలో హనుమాన్‌పై ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. హనుమాన్ సినిమా అదిరిపోయిందని వాళ్లు చెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా హనుమాన్ మూవీలోని క్లైమాక్స్‌లో 15 నిమిషాల పాటు వచ్చే హనుమంతుడి ఎపిసోడ్ నెక్ట్స్ లెవెల్ అని అంటున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడని విధంగా హనుమంతుడిని చూపించారట.

సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్

హనుమాన్ మూవీలో తేజ సజ్జా నటన హైలెట్ అవుతుందని స్పెషల్ షో చూసిన వాళ్లు చెప్పినట్లు టాక్. ఇంటర్వెల్ తర్వాత బ్రదర్ అండ్ సిస్టర్ రోల్స్ చేసిన తేజ, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించేలా ఉందని చెబుతున్నారు. ఇక డైరెక్టర్ ప్రశాంత్ వర్మ టేకింగ్ ప్రతి సీన్‌లో కనిపించిందని, నిర్మాతల ఖర్చుకు తగిన న్యాయం చేశాడని సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఉన్నతంగా, మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా ఉందని అంటున్నారు.

అసలైన రివ్యూ

ఇలా హనుమాన్ స్పెషల్ షో చూసిన సినీ ప్రముఖులు పై విధంగా రివ్యూ ఇచ్చారని తెలుస్తోంది. చూస్తుంటే సంక్రాంతి బరిలో మహేశ్ బాబు, వెంకటేష్, నాగార్జునతో పోటీకి దిగిన హనుమాన్ మూవీ కచ్చితంగా విజయం సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, సినిమా విడుదలయ్యాక హనుమాన్‌పై ప్రేక్షకులు అసలైన రివ్యూ తెలియాల్సి ఉంది.

IPL_Entry_Point