Siren OTT: ఓటీటీలోకి తమిళ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?-siren ott streaming on disney plus hotstar in telugu keerthy suresh anupama parameswaran jayam ravi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Siren Ott: ఓటీటీలోకి తమిళ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Siren OTT: ఓటీటీలోకి తమిళ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Apr 15, 2024 11:37 AM IST

Siren OTT Streaming: తెలుగు హీరోయిన్స్ కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ తొలిసారి కలిసి యాక్ట్ చేసిన సినిమా సైరన్. తమిళంలో క్రైమ్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. సైరన్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్, రిలీజ్ డేట్ వివరాల్లోకి వెళితే..

ఓటీటీలోకి తమిళ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
ఓటీటీలోకి తమిళ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Keerthy Suresh Siren OTT Release: జ‌యం ర‌వి క‌థానాయ‌కుడిగా నటించిన లేటెస్ట్ మూవీ సైరన్. ఈ సినిమాలో టాలీవుడ్ హీరోయిన్స్ కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ నటించారు. హెమ్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై సుజాత విజ‌య్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు ఆంటోని భాగ్య‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వహించారు.

భారీ బడ్జెట్‌తో

అభిమ‌న్యుడు, విశ్వాసం, హీరో వంటి ప‌లు చిత్రాల‌కు రైట‌ర్‌గా ప్రూవ్ చేసుకున్న ఆంటోని భాగ్యరాజ్ సైర‌న్‌ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, యాక్ష‌న్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కాంబినేష‌న్‌లో ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో రూపొందించారు. జ‌యం ర‌వి త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నడూ చేయ‌ని విధంగా రెండు డిఫ‌రెంట్ లుక్స్‌తో మెప్పించారు. అలాగే జ‌యం ర‌వి స‌ర‌స‌న కీర్తి సురేష్ తొలిసారి నటించింది.

అనౌన్స్‌మెంట్ కూడా

సినిమాలో యోగి బాబు త‌న‌దైన కామెడీ పంచుల‌తో నవ్వించాడు. విల‌క్ష‌ణ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర ఖ‌ని ఇందులో కీల‌క పాత్ర‌ను పోషించారు. ఫిబ్రవరి 16న కోలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో మూవీని తెలుగులో సైతం రిలీజ్ చేయాలనుకున్నారు. ఫిబ్రవరి 23న తెలుగు రాష్ట్రాల్లో సైరన్ మూవీని విడుదల చేస్తున్నట్లు అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. కానీ, పలు అనివార్య కారణాల వల్ల తెలుగు రిలీజ్‌కు సైరన్ నోచుకోలేదు.

ఏప్రిల్ 19 నుంచి

ఇప్పుడు ఓటీటీలో మాత్రం నేరుగా తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది. సైరన్ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 19 నుంచి సైరన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోపాటు తెలుగులో కూడా సైరన్ డిజిటల్ ప్రీమియర్ అవనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చేసింది. రేర్ కాంబినేషన్‌ అయిన కీర్తి సురేష్, జయం రవి, అనుపమ పరమేశ్వరన్ సినిమాను ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు.

క్రైమ్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్

సైరన్ సినిమా క్రైమ్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కింది. ఇందులో జయం రవికి భార్యగా అనుపమ పరమేశ్వరన్ నటించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో కనువిందు చేసింది. ఒక పిల్లాడి హత్య కేసుకు సంబంధించిన కథతో సినిమా సాగుతుందని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది.

జీవీ ప్రకాష్ సంగీతం

సైరన్ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సెల్వ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. సైరన్ చిత్రంలో యోగిబాబు, సముద్ర ఖనితోపాటు కౌశిక్ మెహతా, తులసి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. 2023లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ కోలీవుడ్ మూవీ తమిళంలో 2024లో విడుదలైంది.

లిల్లీగా గ్లామర్ షో

ఇదిలా ఉంటే, ఇటీవలే అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డతో ఘాటు కిస్సింగ్ సీన్స్, రొమాంటిక్ సన్నివేశాల్లో అదరగొట్టింది. ఇందులో లిల్లీగా మరోసారి అనుపమ పరమేశ్వరన్ నటనతోపాటు గ్లామర్ షోతో కట్టిపడేసింది.

IPL_Entry_Point