Keerthy Suresh Marriage: తమిళ కమెడియన్‌తో కీర్తి సురేష్ పెళ్లి.. కంగ్రాట్స్ అల్లుడంటూ హీరోయిన్ తల్లి ఫోన్.. పిక్స్ వైరల్-tamil actor sathish reveals how menaka reacts to keerthy suresh marriage photo keerthy suresh sathish wedding pics ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Keerthy Suresh Marriage: తమిళ కమెడియన్‌తో కీర్తి సురేష్ పెళ్లి.. కంగ్రాట్స్ అల్లుడంటూ హీరోయిన్ తల్లి ఫోన్.. పిక్స్ వైరల్

Keerthy Suresh Marriage: తమిళ కమెడియన్‌తో కీర్తి సురేష్ పెళ్లి.. కంగ్రాట్స్ అల్లుడంటూ హీరోయిన్ తల్లి ఫోన్.. పిక్స్ వైరల్

Sanjiv Kumar HT Telugu
Feb 19, 2024 11:11 AM IST

Menaka Phone Call To Keerthy Suresh Husband: మహానటి కీర్తి సురేష్‌కు పెళ్లి జరిగినట్లు ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. ఆ సమయంలో ఫొటోలో ఉన్న వ్యక్తికి ఫోన్ కాల్ చేసి అల్లుడు కంగ్రాట్స్ అంటూ విషెస్ తెలిపింది కీర్తి సురేష్ తల్లి మేనక.

తమిళ కమెడియన్‌తో కీర్తి సురేష్ పెళ్లి.. కంగ్రాట్స్ అల్లుడంటూ హీరోయిన్ తల్లి ఫోన్.. పిక్స్ వైరల్
తమిళ కమెడియన్‌తో కీర్తి సురేష్ పెళ్లి.. కంగ్రాట్స్ అల్లుడంటూ హీరోయిన్ తల్లి ఫోన్.. పిక్స్ వైరల్

Keerthy Suresh Marriage Pic Viral: బ్యూటిఫుల్ కీర్తి సురేష్ దక్షిణి చిత్ర పరిశ్రమలోనే స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. సౌత్ సినీ ఇండస్ట్రీలో కీర్తి సురేష్‌కు మహానటి అని పేరు కూడా ఉంది. ఇటీవల దసరా సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన కీర్తి సురేష్ భోళా శంకర్ మూవీలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా నటించింది. తాజాగా తమిళంలో సైరన్ అనే మూవీతో సందడి చేస్తోంది. ఫిబ్రవరి 16న తమిళంలో విడుదలైన సైరన్ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కీర్తి సురేష్ కనిపించింది.

అనిరుధ్‌తో లవ్ ట్రాక్

తెలుగులోను కీర్తి సురేష్‌కు మంచి క్రేజ్ ఉండటంతో సైరన్ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే సాధారణంగా సినిమా హీరోయిన్లపై రూమర్స్ వస్తుంటాయి. అలాగే కీర్తి సురేష్‌ పెళ్లికి సంబంధించి ఇప్పటికీ అనే వార్తలు వచ్చాయి. ఓ స్టార్ హీరోతో కీర్తి సురేష్ ప్రేమాయణం నడిపిందని, కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్‌తో ప్రేమలో పడిందని పుకార్లు షికార్లు చేశాయి.

కమెడియన్‌తో పెళ్లి

అంతేకాకుండా, కీర్తి సురేష్‌కు గతంలోనే పెళ్లి అయిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. అనంతరం పలాన పారిశ్రామికవేత్తతో ఎంగేజ్‌మెంట్, ఆ పొలిటీషియన్‌తో పెళ్లి, ఈ నటుడితే వివాహం వంటి రూమర్స్ జోరుగా ప్రచారం అయ్యాయి. వాటన్నింటిని కీర్తి సురేష్ కుటుంబం ఖండించింది. అయితే, కొన్నాళ్ల క్రితం తమిళ ప్రముఖ కమెడియన్ సతీష్‌ను కీర్తి సురేష్ వివాహం చేసుకున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో తెగ ప్రచారం జరిగింది.

సతీష్ రియాక్షన్

కమెడియన్ సతీష్‌తో కీర్తి సురేష్‌ పెళ్లికి సంబంధించిన ఫొటో కూడా నెట్టింట్లో తెగ వైరల్ అయింది. అయితే, తాజాగా ఆ వార్తలపై సతీష్ స్పందించాడు. వితికారన్ అనే సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్న సతీష్ ఆ న్యూస్‌పై ఆసక్తికర విషయం చెప్పాడు. "ఇళయదళపతి విజయ్ నటించిన భైరవ సినిమాలో నేను కీర్తి సురేష్‌తో నటించాను. ఈ సినిమా షూటింగ్ సమయంలో పూజా కార్యక్రమం జరుగుతుంది" అని కమెడియన్ సతీష్ అసలు మ్యాటర్‌లోకి వచ్చాడు.

కంగ్రాట్స్ అల్లుడు

"భైరవ సినిమా పూజా కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న వారందరం మెడలో పూల మాలలు వేసుకున్నాం. మేము కూడా పూల మాలలు వేసుకున్నాం. అయితే, ఫొటోలో మా ఇద్దరినీ మాత్రమే హైలెట్ చేసి చూపించారు. కొందరు దాన్ని వైరల్ చేశారు. దాంతో మేము రహస్యంగా పెళ్లి చేసుకున్నాం అని చాలా పుకార్లు వచ్చాయి. అప్పుడు చాలా బాధ అనిపించింది. ఆ సమయంలోనే కీర్తి సురేష్ అమ్మ గారు మేనక నాకు ఫోన్ చేసి కంగ్రాచ్యులేషన్ అల్లుడు అన్నారు" అని సతీష్ చెప్పుకొచ్చాడు.

70 సినిమాలకు పైగా

"మేనక గారి మాటలకు నేను చాలా షాక్ అయ్యాను. తర్వాత ఆ రూమర్‌ను వారు పెద్దగా పట్టించుకోలేదని అర్థం అయింది. 2019లో నేను సింధుని వివాహం చేసుకున్న తర్వాత మాత్రమే ఆ పుకార్లు ఆగిపోయాయి" అని కమెడియన్ సతీష్ వెల్లడించాడు. కాగా తమిళ ఇండస్ట్రీలో మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న సతీష్ ఇప్పటివరకు దాదాపుగా 70కిపైగా చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం వితికారన్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

Whats_app_banner