Tillu Square Box Office: నాని దసరాను బీట్ చేసిన టిల్లు స్క్వేర్.. ఇక ఆరేళ్ల నాటి ఆ సినిమా రికార్డే టార్గెట్
Tillu Square Box Office Collection: సిద్దు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ సినిమా టిల్లు స్క్వేర్ నేచురల్ స్టార్ నాని బ్లాక్ బస్టర్ హిట్ దసరాను బీట్ చేసేసింది. ఇక ఆరేళ్ల నుంచి ఎవరు టచ్ చేయని ఆ సినిమా రికార్డ్‌ను టిల్లు గాడు బ్రేక్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టిల్లు స్క్వేర్ 16 డేస్ కలెక్షన్స్ చూస్తే..
Tillu Square 16 Days Collection: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా బాక్సాఫీస్ వద్ద చెలరేగిపోతుంది. మార్చి 29న విడుదలైన ఈ మూవీ మీడియం రేంజ్ హీరో సినిమాల రికార్డులను కొల్లగొడుతుంది. తాజాగా నేచురల్ స్టార్ నాని దసరా మూవీ బాక్సాఫీస్ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు టిల్లు గాడు.
ఒక్క రోజులోనే కోటికిపైగా
టిల్లు స్క్వేర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఒక 16వ రోజునే రూ. 1.10 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇక మొత్తం 16 రోజుల్లో రూ. 46.41 కోట్ల షేర్, 77.55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. వాటిలో నైజాం నుంచి 24.86 కోట్లు, సీడెడ్-5.16 కోట్లు, ఉత్తరాంధ్ర-5.56 కోట్లు, ఈస్ట్ గోదావరి-2.85 కోట్లు, వెస్ట్ గోదావరి-1.76 కోట్లు, గుంటూరు-2.52 కోట్లు, కృష్ణా-2.27 కోట్లు, నెల్లూరు నుంచి రూ. 1.43 కోట్లు వసూలు అయ్యాయి.
టిల్లు స్క్వేర్ ప్రాఫిట్
తెలుగు రాష్ట్రాలు కాకుండా కర్ణాటకతోపాటు మిగతా రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.15 కోట్లు, ఓవర్సీస్ నుంచి రూ. 14.72 కోట్ల కలెక్షన్స్ టిల్లు స్క్వేర్‌కు వచ్చాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా సినిమాకు 16 రోజుల్లో రూ. 65.28 కోట్ల షేర్, రూ. 115.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ మూవీకి అది పూర్తి చేసుకుని ఇప్పటికీ రూ. 37.28 కోట్ల లాభాలు వచ్చాయి.
దసరాను బీట్ చేసి
దీంతో ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే, తెలుగులో భారీ కలెక్షన్స్ అందుకున్న బిగ్గెస్ట్ మీడియం రేంజ్ హీరోల ఒక్కో సినిమాను దాటుకుంటూ పోతున్నాడు టిల్లు గాడు. అలా రీసెంట్‌గా ఉప్పెన, కార్తికేయ 2 వంటి సినిమాల లాంగ్ రన్ కలెక్షన్స్‌ను బీట్ చేసి 60 కోట్ల క్లబ్‌లో చేరింది టిల్లు స్క్వేర్. 15 రోజుల వసూళ్లతో మీడియం రేంజ్ సినిమాల్లో టాప్ 2 బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన నాని (Nani) దసరా (Dasara Movie) టోటల్ కలెక్షన్స్‌ను బీట్ చేసింది.
టోటల్ రన్‌లో
దసరా సినిమా (Dasara Collection) మొత్తం రన్‌లో రూ. 63.55 కోట్లు కలెక్ట్ చేయగా టిల్లు స్క్వేర్ 64 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. అయితే, గ్రాస్ కలెక్షన్స్ పరంగా మాత్రం దసరా (113 కోట్ల గ్రాస్) కంటే టిల్లు స్క్వేర్ కాస్తా వెనుకే (15 రోజులకు చూస్తే) ఉంది. ఇక మీడియం రేంజ్ హీరోల చిత్రాల్లో ఆల్ టైమ్ అత్యధిక కలెక్షన్స్ అందుకుంది రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) మూవీ గీత గోవిందం (Geetha Govindam Movie).
ఇక మిగిలింది ఇదే
గీత గోవిందం (Geetha Govindam Collection) సినిమా టోటల్ రన్‌లో రూ. 70 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ అందుకుంది. ఆరేళ్ల క్రితం సొంతం చేసుకున్న ఈ రికార్డ్‌ను ఇప్పటికీ ఏ మీడియం రేంజ్ హీరో బీట్ చేయలేదు. మరి ఇప్పుడు 65.28 కోట్లతో దూసుకుపోతున్న టిల్లు స్క్వేర్ బ్రేక్ చేయడమే టార్గెట్‌గా ఉంది. సమ్మర్‌లో పెద్ద పోటీ లేకపోవడంతో ఇలానే కలెక్షన్స్ కొనసాగితే లాంగ్ రన్‌లో ఆరేళ్లుగా ఎవరు టచ్ చేయలేని శిఖరం వంటి గీత గోవిందంను బీట్ చేసే ఛాన్స్ ఉంది.