Life Changing OTT Movies: సినిమా అనేది కేవలం వినోదం కోసమే మాత్రమే కాదు. ఒక్కోసారి జీవితాన్నే మార్చేలా కొన్ని సినిమాలు మంచి మోటివేషన్ అందిస్తుంటాయి. సాధారణంగా మనుషులు ఏదో ఒక కారణంలో తీవ్ర దుఖంలో, బాధలో, ఏం చేయలేని నిస్సాహయ పరిస్థితిలో ఉంటారు. అలాంటి సమయంలో కొన్ని మాటలు చాలా స్ఫూర్తినిస్తాయి. అడుగు ముందుకు వేసేందుకు ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తాయి. అలాంటి మోటివేషన్‌ను ఇచ్చే టాప్ 5 ఓటీటీ సినిమాలు ఏంటో ఓసారి లుక్కేద్దాం.
బాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ ఆర్ బల్కి దర్శకత్వం వహించిన రీసెంట్ మూవీ గూమర్ (Ghoomer OTT. హీరో అభిషేక్ బచ్చన్, సయామి ఖేర్ అతి ముఖ్యమైన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా. క్రికెట్‌లో మంచి పేరు తెచ్చుకోవాలని చాలా ప్రయత్నించే యువతికి అనుకోకుండా యాక్సిడెంట్‌లో చేతిని కోల్పోతుంది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తన లక్ష్యాన్ని ఎలా సాధించుకుందో స్పూర్థివంతంగా చెప్పిన సినిమానే గూమర్.
గూమర్ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా చూసిన క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించారు. చాలా బాగుందంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు.
2022లో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమా కచ్చే లింబు. శుభమ్ యోగి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాధిక మదన్, రజత్ బర్మేచా, ఐషా అహ్మద్ తదితరులు నటించారు. తన సోదరుడు క్రికెట్ జట్టుకు పోటీగా టోర్నమెంట్‌లో పాల్గొన్న ఓ యువతి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంటుంది. అమ్మాయిలకు కట్టుబాట్లు ఉండాలని, సామాజిక నిబంధనలతో చేస్తున్న కట్టడిని అడ్డుకుని ఓ యువతి తన గోల్ ఎలా రీచ్ అయిందే చెప్పే స్పోర్ట్స్ డ్రామా ఇది. ఈ సినిమాను (Kacchey Limbu OTT) జియో సినిమాలో ఫ్రీగా చూసేయొచ్చు.
పాపులర్ నటి రేవతి డైరెక్ట్ చేసిన సలామ్ వెంకీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్, మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్, విశాల్ జెత్వా, రిద్ధి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా నిలిచింది. కండరాల బలహీనతతో బాధపడుతున్న కొడుకు జీవితాన్ని మార్చేసిన ఓ ఆదర్శవంతమైన తల్లి కథ ఇది. ఎమోషనల్ డ్రామాతో ఆద్యంతం మోటివేషన్ నింపేలా ఉండే ఈ సినిమా (Salaam Venky OTT) జీ5లో (Zee5) స్ట్రీమింగ్ అవుతోంది.
గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, బాలీవుడ్ యాక్టర్ అండ్ డైరెక్టర్ పర్హాన్ అక్తర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన రొమాంటిక్ మెలో డ్రామా ది స్కై ఈజ్ పింక్. షొనాలి బోస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019లో రిలీజై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. 19 ఏళ్లకే మరణించిన మోటివేషనల్ స్పీకర్, రైటర్ ఐషా చౌదరి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
ఐషా చౌదరి మరణానికి ఒకరోజు ముందు ఆమె రచించిన మై లిటిల్ ఎపిఫనీస్ పుస్తకం విడుదలైంది. శ్వాసకోశ వ్యాధితో బాధపడే తన కూతురికి తమ జీవితంలో జరిగిన సంఘటనలు స్ఫూర్తివంతంగా చెప్పే కథాంశంతో సినిమా ఉంటుంది. అప్పట్లో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ఈ సినిమా (The Sky Is Pink OTT) ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ బయోగ్రఫీగా వచ్చిన ట్వెల్త్ ఫెయిల్ మూవీ గతేడాది సెన్సేషనల్ హిట్ అందుకుంది. రూ. 20 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 69 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది. ఇంటర్ ఫెయిల్ అయిన ఓ యువకుడు ఐపీఎస్ అధికారి ఎలా అయ్యాడో స్ఫూర్తివంతంగా చెప్పే ఈ సినిమా (12th Fail OTT) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.