Drinking In Bra: బ్రాలో మందు తాగిన హీరో నవదీప్.. రాజమౌళి శిష్యుడు, డైరెక్టర్ అవనీంద్ర ఆన్సర్ ఏంటంటే?
Love Mouli Director Avaneendra About Bra Shot: లవ్ మౌళి సినిమాలో హీరో నవదీప్ బ్రాలో మందు తాగడంపై ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడు, మూవీ డైరెక్టర్ అవనీంద్ర క్లారిటీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటనే వివరాల్లోకి వెళితే..
Love Mouli Navdeep Drinking In Bra: దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడు, ఆయన దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన అవనీంద్ర డైరెక్టర్‌గా మారారు. నవదీప్ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో వచ్చిన సినిమా లవ్ మౌళి. జూన్ 7న విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్సే తెచ్చుకుంటోంది.
అయితే, సినిమా విడుదలకు ముందు విడుదల చేసిన ఓ పోస్టర్‌లో హీరో నవదీప్ బ్రాలో మందు పోసుకుని తాగడం సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఓ ఇంటర్వ్యూలో బ్రాలో మందు తాగడంపై డైరెక్టర్ అవనీంద్రను ప్రశ్నించగా ఆయన చెప్పిన సమాధానం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
హీరో నవదీప్ కోసమే ఈ కథ తయారు చేశారా?
కథ రాస్తున్నప్పుడు మనం ఎవరినో ఒకరిని ఊహించుకుంటూ రాయాలి. ఈ కథకి అలా ఊహించుకోవడం చాలా కష్టం. ఈ ఒక్క కథకి ఎవరినీ ఊహించుకోకుండా ఒక నవలలా కథ రాసేశా. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలందరినీ ఈ కథకి ఊహించుకుంటూ వచ్చా. అయితే ఆ ఫొటోలలో అప్పుడు నవదీప్ ఫొటో లేదు. అప్పుడు నవదీప్ కూడా అంత యాక్టివ్‌గా సినిమాలు చేయడం లేదు.
అప్పుడు నాకెందుకో నవదీప్ అయితే అనే ఆలోచన వచ్చింది. నా ఆలోచనలన్నీ అతనిపై పెట్టి.. ఆ తర్వాత వెళ్లి కథ చెప్పా. కథ వినగానే ఎగిరి గంతేశాడు. ఇలాంటి కథ కోసం ఎప్పటి నుండో చూస్తున్నా అని చెప్పాడు. నేను అనుకున్న లుక్‌కి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యాడు.
మార్కెట్ ఈక్వేషన్స్ పట్టించుకోలేదా?
అయితే మార్కెట్ అవి ఇవీ ప్రాబ్లమ్స్ ఉంటాయని అంతా అన్నారు. కానీ, ఫస్ట్ సినిమా.. ఈ ఒక్క కథని నిజాయితీగా చేద్దాం అని ఫిక్సయ్యా. రిజల్ట్‌తో సంబంధం లేదు. 10 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నా.. ఫస్ట్ సినిమా నిజాయితీగా చేశానని చెప్పుకోవడానికి ఉంటుందని అనుకున్నా.
హీరో బ్రాలో మందు తాగడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది?
లో దుస్తులని పబ్లిగ్‌గా ఆరేయడానికి సంకోచించే మైండ్ మనది. నాకున్న స్క్రీన్‌ప్లే టైమ్‌ని దృష్టిలో పెట్టుకుని.. హీరో క్యారెక్టర్ ఇదని చెప్పడం కోసమే.. హీరో ఇన్నర్ దుస్తుల్లో మందు తాగడం చూపించడం జరిగింది.
ఇందులో హీరోకి ఎటువంటి సెన్సిబిలిటీస్ ఉండవు. నిజంగా అలాంటి సీన్ డిస్టర్బ్‌గా అనిపిస్తే సెన్సార్ వాళ్లు చూసుకుంటారు. వైజాగ్‌లో షోకి 50 శాతం అమ్మాయిలే వచ్చారు. ఎవరూ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. పోస్టర్‌లో అలా అనిపిస్తుంది కానీ.. సినిమా చూశాక అందరికీ ఆ సీన్ అర్థమవుతుంది.
సెన్సారు వాళ్లు ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు?
సెన్సార్ వాళ్లు యు/ఏ సర్టిఫికెట్ ఇస్తా అన్నారు. కానీ, 20 కట్స్ చెప్పారు. అయితే, ఆ కట్స్ వల్ల కథ ఫ్లో పోతుంది. కథ కథగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి అంటే.. అయితే ‘ఏ’ ఇస్తాం అన్నారు. నేను ముందుగానే ‘ఏ’కి ప్రిపేరై ఉన్నా. ‘ఏ’ కావాలని మాత్రం అడగలేదు.. ప్రిపేర్ అయి ఉన్నా. 18ప్లస్‌కి అవసరమైన కథ ఇది.