Munjya: హారర్ కామెడీ మూవీతో రానున్న బోల్డ్ హీరోయిన్.. జూనియర్ ఎన్టీఆర్ 'వార్ 2' స్పై యూనివర్స్‌లోనూ ఛాన్స్-sharvari wagh about horror comedy universe munjya and yrf spy universe movie with alia bhatt jr ntr war 2 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Munjya: హారర్ కామెడీ మూవీతో రానున్న బోల్డ్ హీరోయిన్.. జూనియర్ ఎన్టీఆర్ 'వార్ 2' స్పై యూనివర్స్‌లోనూ ఛాన్స్

Munjya: హారర్ కామెడీ మూవీతో రానున్న బోల్డ్ హీరోయిన్.. జూనియర్ ఎన్టీఆర్ 'వార్ 2' స్పై యూనివర్స్‌లోనూ ఛాన్స్

Sanjiv Kumar HT Telugu
Jun 01, 2024 02:34 PM IST

Sharvari Wagh Munjya Movie: జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 మూవీ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో ఛాన్స్ కొట్టేసింది బోల్డ్ హీరోయిన్ శార్వరి వాఘ్. ఇదే కాకుండా మరో హారర్ కామెడీ మూవీ ముంజ్యాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హారర్ కామెడీ మూవీతో రానున్న బోల్డ్ హీరోయిన్.. జూనియర్ ఎన్టీఆర్ 'వార్ 2' స్పై యూనివర్స్‌లోనూ ఛాన్స్
హారర్ కామెడీ మూవీతో రానున్న బోల్డ్ హీరోయిన్.. జూనియర్ ఎన్టీఆర్ 'వార్ 2' స్పై యూనివర్స్‌లోనూ ఛాన్స్

Jr NTR War 2 YRF Spy Universe Sharvari Wagh: బాలీవుడ్‌లో రూపొందుతోన్న అతి పెద్ద ఫ్రాంచైజీల‌లో భాగ‌మైంది బోల్డ్ హీరోయిన్ శార్వరి వాఘ్. బాలీవుడ్‌లో నేటితరం రైజింగ్ స్టార్‌గా శార్వరి వాఘ్ అంద‌రి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె రెండు క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఒకటి దినేష్ విజ‌న్ రూపొందిస్తోన్న హార‌ర్ కామెడీ సినిమా ముంజ్యా (Munjya Movie). అలాగే ఈ మూవీతో పాటు ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా య‌ష్‌రాజ్ ఫిల్మ్స్ యూనివ‌ర్స్ (YRF Spy Universe) రూపొందిస్తోన్న స్పై యూనివ‌ర్స్‌లో భాగ‌మ‌వుతోంది. అంతేకాకుండా ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తో శార్వరి స్క్రీన్ షేర్ చేసుకోనుంది.

ఈ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటిస్తున్న వార్ 2 (War 2 Movie) మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా చేస్తున్న ఈ సినిమాలో తారక్ విలన్ రోల్ చేస్తున్నాడు. ఈ వార్ 2 స్పై యూనివర్స్‌ ఫ్రాంఛైజీలోనే శార్వరి వాఘ్ ఛాన్స్ కొట్టేసింది.

ఇక ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్న ముంజ్యా మూవీ జూన్ 7న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకుంది బోల్డ్ బ్యూటి శార్వరి వాఘ్. "మన ఇండస్ట్రీలో అతి పెద్ద సినీ ప్ర‌ముఖుల‌తో నేను భాగం అవుతున్నాను. నాకు అవకాశం కల్పించిన మన దర్శకులు, నిర్మాతలకు దన్యవాదాలు. అయితే ఈ స్థాయికి చేరుకోవ‌టానికి నేను చాలా క‌ష్ట‌ప‌డ్డాను" అని శార్వరి వాఘ్ తెలిపింది.

"దినేష్ విజ‌న్ గారి హార‌ర్ కామెడీ యూనివ‌ర్స్‌తో పాటు ఆదిత్య చోప్రా గారి య‌ష్ రాజ్ ఫిల్మ్స్ రూపొందిస్తోన్న స్పై థ్రిల్ల‌ర్‌లో న‌టించ‌డంతో న‌టిగా నా క‌ల నేర‌వేరింది. నేను ఇప్ప‌టి వ‌ర‌కు ఒక సినిమానే చేశాను. అయితే న్యూ టాలెంట్‌ను గుర్తించడంలో ఎప్పుడూ ముందుండే ఇండ‌స్ట్రీ నాకు ఇంత మంచి అవ‌కాశాల‌ను క‌ల్పించ‌టంపై నాకెంతో థ్రిల్లింగ్‌గా ఉంది" అని శార్వరి వాఘ్ పేర్కొంది.

"పెద్ద సంస్థ‌లు చేస్తోన్న ఫ్రాంచైజీల్లో పెద్ద సూప‌ర్‌ స్టార్స్ ఉంటారు. ఇలాంటి వాటిలో నేను భాగం కావ‌డం అనేది నేను చేసిన ప‌నికి లభించిన గొప్ప గుర్తింపుగా భావిస్తున్నాను" అని బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ శ్రావరి వాఘ్ తన మనసులోను భావాలను పంచుకుంది.

దేశంలోని అగ్ర ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు శార్వరిని త‌మ చిత్రాల్లోకి సెలెక్ట్ చేసుకోవ‌టం అనేది ఆమెలోని నైపుణ్యాని నిద‌ర్శ‌నంగా చెప్పొచ్చు. శార్వరి నేటి త‌రానికి చెందిన స్టార్స్‌లో బెస్ట్‌గా ఎద‌గాల‌ని ఆకాంక్షిస్తున్నారు. ముంజ్యా చిత్రం, య‌ష్‌రాజ్ ఫిల్మ్స్ చేస్తోన్న స్పై యూనివ‌ర్స్ మూవీతో పాటు మ‌రో మాస్ట‌ర్ ఫిల్మ్ మేక‌ర్ నిఖిల్ అద్వానీ తెర‌కెక్కిస్తోన్న వేద సినిమాలోనూ శ్రావరి వాఘ్ నటిస్తోంది.

ఈ సినిమా కోసం శ్రావరిని ఎంపిక చేశారు. ఈ సంద‌ర్భంగా కూడా శార్వరి స్పందించింది. "నటనలో అత్యుత్తమ ప్రతిభను కనపరిచిన మన నటీనటులంటే నాకెంతో ఇష్టం, గౌర‌వం. వాళ్ల‌లాగానే నేను కూడా న‌టిగా మంచి పేరుని సంపాదించుకోవాల‌నుకుంటున్నాను" అని శ్రావరి తెలిపింది.

"ఇంత పెద్ద ఫ్రాంచైజీల్లో నేను భాగం కావ‌టం ఆనందంగా ఉంది. అలాగే నాలో న‌టిగా మ‌రింత బాధ్య‌త‌ను పెంచింది. వీటి వ‌ల్ల ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ అవుతాను. దీని వ‌ల్ల న‌టిగా నేనింకా మంచి ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌ప‌ర‌చ‌టానికి స్ఫూర్తినిస్తుంద‌ని భావిస్తున్నాను. అలాగే న‌న్ను నేను న‌టిగా మెరుగుప‌రుచుకోవ‌టానికి ఉప‌యోగ‌ప‌డుతుంది" అని చెప్పింది శ్రావరి వాఘ్.

టీ20 వరల్డ్ కప్ 2024