Vishwak Sen Superstar: విశ్వక్ సేన్ సూపర్ స్టార్.. హీరో నవదీప్ షాకింగ్ కామెంట్స్-navdeep comments on vishwak sen in chandini chowdary yevam movie pre release event vishwak sen is superstar tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwak Sen Superstar: విశ్వక్ సేన్ సూపర్ స్టార్.. హీరో నవదీప్ షాకింగ్ కామెంట్స్

Vishwak Sen Superstar: విశ్వక్ సేన్ సూపర్ స్టార్.. హీరో నవదీప్ షాకింగ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Jun 12, 2024 10:54 AM IST

Navdeep About Vishwak Sen Yevam Pre Release Event: విశ్వక్ సేనే సూపర్ స్టార్ లాంటివాడు అని హీరో నవదీప్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. చాందినీ చౌదరి ఏవమ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నవదీప్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

విశ్వక్ సేన్ సూపర్ స్టార్.. హీరో నవదీప్ షాకింగ్ కామెంట్స్
విశ్వక్ సేన్ సూపర్ స్టార్.. హీరో నవదీప్ షాకింగ్ కామెంట్స్

Navdeep About Vishwak Sen: చాందిని చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ యేవమ్ (Yevam Movie). తొలిసారిగా చాందినీ చౌదరి పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఈ సినిమాలో ఆమెతోపాటు వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌, బిగ్ బాస్ ఆషు రెడ్డి (Ashu Reddy) ముఖ్య పాత్రలు పోషింయారు. ఈ సినిమాకు ప్రకాష్‌ దంతులూరి దర్శకత్వం వహించారు.

యేవమ్ సినిమాను హీరో నవదీప్ (Navdeep), పవన్‌ గోపరాజు నిర్మాతలుగా వ్యవహరించి నిర్మించారు. జూన్ 12న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానున్న యేవమ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం (జూన్ 10) హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి మాస్ క‌దాస్ విశ్వ‌క్‌సేన్ (Vishwak Sen), ద‌ర్శ‌కుడు సందీప్‌రాజ్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా విశ్వక్ సేన్‌పై హీరో నవదీప్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

"కంటెంట్ బెస్‌డ్ సినిమాల‌కు విశ్వక్ సేన్ లాంటి హీరోలు ప్ర‌మోష‌న్ విష‌య‌లో స‌పోర్ట్ ఉంటుంది. ఈ విష‌యంలో విశ్వ‌క్ సేన్ సూప‌ర్‌ స్టార్ లాంటి వాడు. మంచి ఇంటెన్స్‌తో నిజాయితీగా చేసిన సినిమా ఇది. సినిమా మీద పిచ్చి త‌ప‌న ఉన్న హీరోయిన్ చాందిని చౌద‌రి" అని హీరో నవదీప్ చెప్పాడు.

"చాందినీ చౌదరి ఎప్పుడూ సినిమాల గురించే ఆలోచిస్తుంది. రెగ్యుల‌ర్ సినిమాలు కాకుండా ఎప్పుడూ డిఫ‌రెంట్ సినిమాలు, వైవిధ్య‌మైన పాత్ర‌ల కోసం త‌ప‌న ప‌డుతుంది. త‌ప్ప‌కుండా ఈ చిత్రం చాందిని కెరీర్‌లో ది బెస్ట్‌గా ఉండాలని కోరుకుంటున్నాను" హీరో, నిర్మాత నవదీప్ పేర్కొన్నాడు.

"ఈ సినిమా చూశాను. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా థ్రిల్లర్ లు చూసి ఉంటాం. అందులో ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నాకు బాగా న‌చ్చింది. ఇంట‌ర్వెల్‌, ప‌తాక స‌న్నివేశాలు మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి. ఈ సినిమాలో ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ క‌నిపించింది. ఈ సినిమాకు టెక్నిక‌ల్‌గా అన్ని బాగా కుదిరాయి" అని డైరెక్టర్ సందీప్ రాజ్ తెలిపారు.

"సినిమాలో అన్ని ఎమోష‌న్స్‌, వెరియేష‌న్స్ ఉన్నాయి. చాలా మంచి సినిమా. అంద‌రికి త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. ప్ర‌తి చిన్న సినిమాకు విశ్వ‌క్ స‌పోర్ట్ ఉంటుంది. ఈ సినిమాకు కూడా ఆయ‌న ప్రోత్సాహం అందించ‌డం ఆనందంగా ఉంది" అని దర్శకుడు సందీప్ రాజ్ అన్నారు.

దర్శకుడు ప్ర‌కాష్ దంతులూరి మాట్లాడుతూ.. "నా క‌థ‌ను, నా పాత్ర‌ను న‌మ్మి ఈ సినిమా చేసింది చాందిని. నాకు ఈ సినిమా విష‌యంలో నవ‌దీప్ స‌పోర్ట్ ఉంది. ప్ర‌తి విష‌యంలో ఆయ‌న నాతో ఉన్నాడు. ఈ సినిమా చూసి సందీప్‌రాజ్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ మాలో ధైర్యాన్ని నింపింది" అని తెలిపారు.

"కీర్త‌న్ నేప‌థ్య సంగీతం ఈ చిత్రానికి ఎంతో ప్ల‌స్ అవుతుంది. ఈ సినిమా న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు నేను ఊహించిన దానికంటే బెట‌ర్ అవుట్‌ పుట్ ఇచ్చారు. అంద‌రి స‌హ‌కారంతో ఓ మంచి సినిమా తీశాం. ఇదొక ఇంట్రెస్టింగ్ ఎంట‌ర్‌టైనింగ్ థ్రిల్ల‌ర్. త‌ప్ప‌కుండా అంద‌రికి న‌చ్చుతుందే న‌మ్మ‌కం ఉంది" అని యేవమ్ మూవీ డైరెక్టర్ ప్రకాష్ దంతులూరి అన్నారు.

WhatsApp channel