Pradeep Ranganathan: లవ్ టుడే కాంబో రిపీట్.. దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా కొత్త మూవీ.. మరి డైరెక్టర్ ఎవరంటే?-pradeep ranganathan new movie with ags entertainment love today combination repeat ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pradeep Ranganathan: లవ్ టుడే కాంబో రిపీట్.. దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా కొత్త మూవీ.. మరి డైరెక్టర్ ఎవరంటే?

Pradeep Ranganathan: లవ్ టుడే కాంబో రిపీట్.. దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా కొత్త మూవీ.. మరి డైరెక్టర్ ఎవరంటే?

Sanjiv Kumar HT Telugu
May 02, 2024 10:23 AM IST

Pradeep Ranganathan New Movie AGS Entertainment: లవ్ టుడే సినిమాతో హీరోగా, దర్శకుడిగా సూపర్ సక్సెస్ అందుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. లవ్ టుడే మూవీ తర్వాత ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన విశేషాలు ప్రకటించారు.

లవ్ టుడే కాంబో రిపీట్.. దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా కొత్త మూవీ.. మరి డైరెక్టర్ ఎవరంటే?
లవ్ టుడే కాంబో రిపీట్.. దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా కొత్త మూవీ.. మరి డైరెక్టర్ ఎవరంటే?

Love Today Pradeep Ranganathan New Movie: దక్షిణాది సినీ రంగం ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటి ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్. ఈ సంస్థ నిర్మించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘లవ్ టుడే’. ఈ చిత్రంలో హీరోగా నటిస్తూనే ప్రదీప్ రంగనాథన్ సినిమాను డైరెక్ట్ చేశారు. అన్నీ వర్గాల మన్ననలు అందుకుంటూ ఈ సినిమా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.

ఈ చిత్రానికి కల్పాతి ఎస్. అఘోరం, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘ఓ మై కడవులే’ (తెలుగులో ఓరి దేవుడా) ఫేమ్ అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్ నటించిన విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా మెప్పించనున్నారు. ఈ మే నెల నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రముఖ నటీనటులందరూ ఇందులో నటించనున్నారు.

ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూపొందుతోన్న 26వ సినిమా ఇది. కొత్త సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియోను మేకర్స్ విడుదల చేయగా, సోషల్ మీడియాలో వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రదీప్ రంగనాథన్, అశ్వత్ మారిముత్తు మధ్య ఉన్న నిజ జీవితంలోని స్నేహాన్ని తెలియజేస్తూ ఎంటర్‌టైనింగ్‌గా వీడియో ఉంది.

ఈ ఎమోషనల్ మూవీకి అర్చనా కల్పాతి క్రియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుంటే ఐశ్వర్యా కల్పాతి అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటర్‌గా, ఎస్.ఎం. వెంకట్ మాణిక్యం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ సందర్భంగా.. "లవ్ టుడే చిత్రంతో ప్రేక్షకుల హృదయాల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్‌తో మరోసారి కలిసి పని చేయటం ఆనందంగా ఉంది. అలాగే ఓ మై కడవులే సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం ఆనందంగా ఉంది. వీరి కలయికలో రాబోతున్న ఈ సినిమా ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సూపర్ హిట్ చిత్రాల సరసన నిలుస్తుందని నమ్మకంగా ఉన్నాం" క్రియేటివ్ ప్రొడ్యూసర్ అర్చనా కల్పాతి తెలిపారు.

ఇదిలా ఉంటే, సినిమా టైటిల్.. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ తెలియజేసింది. ఇక ఈ మూవీ వీడియో క్లాస్ రూమ్‌లో ప్రదీప్ మొబైల్ యూజ్ చేస్తుండటంతో స్టార్ట్ అవుతుంది. అది చూసిన లెక్చరర్ గెటౌట్ అని అరుస్తుంది. గెటౌట్ అనిపించుకోడానికే మొబైల్ యూజ్ చేసినట్లు ప్రదీప్ చెప్పడం హిలేరియస్‌గా ఉంది.

అనంతరం పదేళ్ల తర్వాత తాను దిగిన ఫొటోకు ఉన్న చరిత్ర గురించి చెబుతూ ప్రదీప్, డైరెక్టర్ మధ్య ఉన్న బాండింగ్ చెప్పాడు. అది చాలా బాగుంది. బయట అదోలా ఉన్నావ్. కానీ, కెమెరాలో చాలా బాగున్నావ్ అని ప్రదీప్‌ను డైరెక్టర్ అన్న డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది. పదేళ్ల క్రితం తీసిన షాట్‌ను రీ క్రియేట్ చేస్తూ సినిమా అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఇది చాలా డిఫరెంట్‌గా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.