Paarijatha Parvam OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలో తెలుసా?
Paarijatha Parvam OTT Streaming: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ పారిజాత పర్వం స్ట్రీమింగ్ కానుంది. శ్రద్ధా దాస్, చైతన్య రావు, సునీల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ కిడ్నాప్ డ్రామా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసుకోండి.
Paarijatha Parvam OTT Release: ఓటీటీలోకి ఎన్నో చిత్రాలు వచ్చి సందడి చేస్తుంటాయి. ఈ మధ్య తెలుగులో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు వచ్చి అలరిస్తున్నాయి. అయితే థియేటర్లలో కొన్ని రోజుల్లో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేస్తున్నాయి సినిమాలు. కానీ, ఓ తెలుగు కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మాత్రం రెండు నెలలకు ఓటీటీలోకి వస్తోంది. అది కూడా మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కానుంది.
క్రైమ్ కామెడీ థ్రిల్లర్
ఆ సినిమా పేరే పారిజాత పర్వం. బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్ధా దాస్, హీరోగా గుర్తింపు తెచ్చుకుంటోన్న చైతన్య రావు, పాపులర్ కమెడియన్, విలన్, హీరో సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమానే పారిజాత పర్వం. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించారు. పోస్టర్స్ నుంచి ట్రైలర్ వరకు మంచి బజ్ క్రియేట్ చేసింది ఈ సినిమా.
అంతంతమాత్రంగా కలెక్షన్స్
మంచి అంచనాలతో ఏప్రిల్ 19న పారిజాత పర్వం సినిమా థియేటర్లలో విడుదలైంది. కిడ్రాప్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు పెద్దగా ప్రేక్షకాదరణ దక్కలేదు. ఒక చిన్న సినిమాగా అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది పారిజాత పర్వం మూవీ. ఇక బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా అంతంతమాత్రంగానే వచ్చాయి. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేయనుంది. అది కూడా మరికొన్ని గంటల్లో. అంటే ఈ సినిమా జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అర్ధరాత్రి నుంచి
ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో జూన్ 12 అర్ధరాత్రి నుంచి అంటే 12 గంటల నుంచి పారిజాత పర్వం డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. దానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఈ కిడ్నాప్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. కాగా ఈ సినిమాను వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మించారు.
హీరోయిన్‌గా మాళవిక
హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన పారిజాత పర్వం మూవీలో చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్‌తోపాటు మాళవిక సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్ , జబర్దస్త్ అప్పారావు, టార్జాన్ , గడ్డం నవీన్, తోటపల్లి, మధు, జబర్దస్త్ రోహిణి సైతం నటించారు. చైతన్య రావుకు జోడీగా మాళవిక సతీశన్ హీరోయిన్‌గా నటించింది.
గ్లామర్ పాత్రలతో
సశాంక్ వుప్పుటూరి ఎడిటర్‌గా ఉపేందర్ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేసిన పారిజాత పర్వం సినిమాలో శ్రద్ధా దాస్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఆమె చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో నటించింది. అల్లరి నరేష్ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం మూవీలో సెకండ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దగుమ్మ గ్లామర్‌తో ఆకట్టుకుంది. బోల్డ్‌గా షో చేస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందింది.
ఆర్య 2 మూవీతో
ఆర్యలో పాపులర్ అయిన శాంతి పాత్రను ఆర్య 2లో శ్రద్ధా దాస్ చేసింది. ఆ పాత్రతో ప్రేక్షకుల వరకు చేరుకోగలిగింది శ్రద్ధా దాస్. అనంతరం పలు సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ బుల్లితెరపై జడ్జ్‌గా అలరించింది శ్రద్ధా దాస్. ఇక ఇటీవల ఈ పారిజాత పర్వంతో పర్వాలేదనిపించుకుంది.