Ravanasura Trailer: మాస్ మహారాజా ఫ్యాన్స్‌కు పూనకాలే.. రావణాసుర ట్రైలర్ వచ్చేసింది-ravanasura trailer released as the mass maharaja raviteja looking energetic ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ravanasura Trailer Released As The Mass Maharaja Raviteja Looking Energetic

Ravanasura Trailer: మాస్ మహారాజా ఫ్యాన్స్‌కు పూనకాలే.. రావణాసుర ట్రైలర్ వచ్చేసింది

Hari Prasad S HT Telugu
Mar 28, 2023 06:02 PM IST

Ravanasura Trailer: మాస్ మహారాజా ఫ్యాన్స్‌కు పూనకాలే.. రావణాసుర ట్రైలర్ వచ్చేసింది. మాస్ యాక్షన్, పంచ్ డైలాగులు కామనే అయినా.. నల్ల కోటులో రవితేజ ప్రత్యేకంగా కనిపిస్తున్నాడీ మూవీలో.

రావాణాసురలో రవితేజ
రావాణాసురలో రవితేజ

Ravanasura Trailer: ధమాకా, వాల్తేర్ వీరయ్య సక్సెస్ లతో మాంచి ఊపు మీదున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఇప్పుడు రావణాసురుడిగా మన ముందుకు వస్తున్నాడు. సుధీర్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో అతడు క్రిమినల్ లాయర్ గా కనిపిస్తున్నాడు. రవితేజ స్టైల్ మాస్ యాక్షన్, పంచ్ డైలాగులతో ఈ మూవీ ట్రైలర్ మంగళవారం (మార్చి 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మాస్ మహారాజా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఈ ట్రైలర్ ఉంది.తన మార్క్ డైలాగులు, ఫైటింగ్ సీన్స్ తో రవితేజ అదరగొట్టాడు. వాడు క్రిమినల్ కాదు.. లా చదివిన క్రిమినల్ అంటూ ఈ మూవీలో రవితేజ క్యారెక్టర్ గురించి విలన్ చెప్పకనే చెబుతాడు. ట్రైలర్ మొదట్లోనే ఫైటింగ్ సీన్స్, వయోలెన్స్ ఉంటుంది. ఆ తర్వాత రవితేజ ఎంట్రీ ఇస్తాడు.

అరెయ్ బాబ్జీ.. లైఫ్ లో వయోలెన్స్ ఎక్కువైపోయి.. బొత్తిగా రొమాన్స్ లేకుండా పోతోంది రా అనే డైలాగ్ తో రవితేజ వస్తాడు. క్రిమినల్ లాయర్ గానూ అతడు తన మార్క్ ఎనర్జీ, యాక్షన్ సీన్స్ తో ఇరగదీశాడు. ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ ఓ స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ట్రైలర్ మొదట్లో మొత్తం యాక్షన్ సీన్స్, మధ్యలో కాస్త సరదా సీన్స్, చివర్లో మరోసారి యాక్షన్ తో ముగించారు.

ఈ ట్రైలర్ ద్వారా స్టోరీ ఏంటన్నదానిపై స్పష్టత రాకపోయినా.. ఇందులో రవితేజ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. స్టైలిష్ యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటాయి. ఈ రావాణాసుర మూవీ ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతోంది.

అభిషేక్ నామా, రవితేజ కలిసి అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ల కింద ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజితా పొన్నడ హీరోయిన్లు నటించడం విశేషం. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. భీమ్స్ సీసీరోలియో మ్యూజిక్ అందించాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్