Ravanasura Movie Teaser: రావణాసురుడు వచ్చేస్తున్నాడు.. టీజర్‌లో అదరగొట్టిన రవితేజ
Ravanasura Movie Teaser: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన సరికొత్త చిత్రం రావణాసుర. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
Ravanasura Movie Teaser: మాస్ మహారాజా రవితేజ గతేడాది ధమాకా చిత్రంతో అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యలో కీలక పాత్ర పోషించి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఈ వేసవికి రావణాసురతో సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. తాజాగా రావణాసుర టీజర్‌ను విడుదల చేసింది.
రవితేజ రావణాసుర టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. యాక్షన్‌తో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉన్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. దర్శకుడు సుధీర్ వర్మ తన మార్కు థ్రిల్లింగ్ అంశాలను, మాస్ మహారాజా ఫ్యాన్స్ కోరుకుంటున్న మాస్ ఎలిమెంట్స్ కూడా జోడించినట్లు అర్థమవుతుంది.
నిమిషం 6 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. పోరాట సన్నివేశాలు, విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న సుశాంత్ స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. "సీతను తీసుకుని వెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు.. ఈ రావణాసురుడిని దాటి వెళ్లాలి." అనే డైలాగ్ టీజర్‌లో హైలెట్‌గా నిలిచింది.
ఈ చిత్రంలో రవితేజ సరసన అను ఇమ్మాన్యూయేల్ నటిస్తోంది. ఈమెతో పాటు పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రావు రమేష్, మురళీ కృష్ణ, సంపత్ రాజ్, నితిన్ మెహతా తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. సుశాంత్ ఇందులో ప్రతినాయక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హర్షన్ వర్ధన్ రామేశ్వర్-భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రావణాసుర సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
సంబంధిత కథనం